Monday, July 27, 2026
26.4 C
Hyderabad

గందరగోళం|BRS|BC RISERVATIONS

BC RISERVATIONS| బీసీ రిజర్వేషన్లపై BRS| బీఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు!
ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్
మా వల్లే వచ్చిందంటూ సానుకూలంగా కవిత|KAVITHA KALVAKUNTLA
రంగులు చల్లుకుని సెలబ్రేట్ చేసిన తెలంగాణ జాగ్రుతి| TELANGANA JAGRUTHI
KAMAREDDY DECLERATION| కామారెడ్డి డిక్లరేషన్ అమలు కావాల్సిందేనంటున్న గులాబీలు
CONFUSION| కన్ఫ్యూజనా? క్లారిటీ మిస్సా? కన్విన్సింగా? కన్నింగా?
ఏది నమ్మాలో తెలియని అయోమయంలో పార్టీ శ్రేణులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపడం బీఆర్ఎస్ లో చిచ్చు పెట్టిందా? రిజర్వేషన్లకు అనుకూలంగా వెళ్ళడమా? కాంగ్రెస్ నిర్ణయం కాబట్టి వ్యతిరేకించడమా? అన్న అంశంలో బీఆర్ఎస్ క్లారిటీ మిస్ అయిందా? కేసీఆర్ ఫ్యామిలీ కన్ఫ్యూజన్ లో పడిందా? కన్వీన్స్ కాలేక కన్నింగ్ కు పాల్పడుతోందా? ‘బీసీ రిజర్వేషన్లు బీసీలకు ద్రోహం చేయడమే, బీసీ రిజర్వేషన్లను బీఆర్ఎస్ పార్టీగా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నామ’ని శాసనమండలిలో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రకటించారు. ఆ పార్టీ నేతలు మరికొందరు ‘కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాల్సిందే’నన్నారు. కానీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, ఆ పార్టీ నేత, తెలంగాణ జాగ్రుతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాత్రం, ‘మేం ఒత్తిడి పెంచిన క్రమంలో వచ్చిన ఈ రిజర్వేషన్ల ప్రకటన కచ్చితంగా విజయంగానే భావిస్తున్నాం. ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేం తలపెట్టిన రైల్ రోకోను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నామ’ని ప్రకటించారు. ఈ రెండు ప్రకటనలూ బీఆర్ఎస్ నేతలు చేసినవేగాక, సమర్ధించినది కేసీఆర్ కూతురు, కేటీఆర్ చెల్లెలు కాగా, వ్యతిరేకించినది కేసీఆర్, కేటీఆర్ ల సూచనల మేరకు శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత. ఇద్దరూ ముఖ్య నేతలే వేర్వేరుగా విభిన్న ప్రకటనలు చేయడం వల్ల పార్టీ శ్రేణుల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? ఎవరిని ఫాలో కావాలో అర్థంగాని అయోమయంలో గులాబీలు పడ్డారు. కావాలనే ఇదంతా అనుకుంటున్న వారూ ఉన్నారు. ఫలితాలెలా ఉన్నా, దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికే ఇలా రెండు నాల్కల ధోరణలు అని మరికొందరు గొణుక్కుంటున్నారు. అదేంలేదు ఇదంతా సీఎం రేవంత్ ఎత్తులో చిత్తైన కల్వకుంట్ల ఫ్యామిలీ మైండ్ బ్లాంక్ అయిపోయి.. ఇలా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు మరికొందరు. ఏమైనా పార్టీ శ్రేణులు మాత్రం ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు.

హైదరాబాద్, జులై 11 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలపడం బీఆర్ఎస్ ను గందరగోళంలో పడేసిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆ పార్టీలో ప్రధాన నేతలు ఒకరు అనుకూలంగా, మరికొరు ప్రతి కూలంగా పరస్పరం భిన్నమైన ప్రకటనలు చేయడంతో పార్టీ శ్రేణులు కన్ఫ్యూజన్ లో పడ్డాయి. బీసీ రిజర్వేషన్లను బీఆర్ఎస్ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తుందని, తమ ఒత్తిడి మేరకు సాధించిన విజయంగా భావిస్తున్నామన్న ఆ రెండు ప్రకటనలు బీసీలకు 42శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నట్లా? సానుకూలంగా ఉన్నట్లా? అన్నది తేలడం లేదు. ఒకే పార్టీలో భిన్న వాదనలను అర్థం చేసుకోవచ్చు. కానీ, పార్టీలో ప్రధాన నేతలే ఇలా ఎందుకు క్లారిటీ మిస్ అయ్యారు. ఆ కన్ ఫ్యూజన్ పార్టీ నాయకత్వంలోనూ ఉందా? పార్టీ అధినేత కూతురు, వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లెలు తెలంగాణ జాగ్రుతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనుకూల అభిప్రాయం వ్యక్తం చేయడం మరింత గందరగోళానికి దారితీసి, అసలుకే ఎసరు పెట్టేలా కనిపిస్తోందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. బయటకు కనిపిస్తున్నట్లు పార్టీలో, కల్వకుంట్ల ఫ్యామిలీలో వేర్వేరు కుంపట్లకు ఇది పరాకాష్టా? లేక అంతర్గతంగా అంతా ఒక్కటే కానీ, బయటకు మాత్రం వేర్వేరుగా ప్రకటిస్తున్నారా? తండ్రిని దేవుడిగా చూసే కవిత కేసీఆర్ ని, ఆయన నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా లేకపోయినా సరే, వ్యతిరేకిస్తారనుకోలేం. కానీ, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకమైన ప్రకటన ఆమె నోటి నుండి రావడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పైగా రేపు ఈ అంశంపై ఎలా ప్రతిస్పందించాలి? అన్న మీమాంసలో గులాబీలు పడ్డారు.

అయితే, బీఆర్ఎస్ పార్టీ కంటే ముందే, ఎన్నికలకు ముందే అంటే 2023 నవంబర్ 10న కాంగ్రెస్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. అది అంత ఈజీ కాదని భావించిన కవిత ఈలోగా బీసీ రిజర్వేషన్ల సాధనకు పోరాటాన్ని ప్రారంభించారు. పోరాటాల సమాయత్తం జరుగుతున్న దశలోనే సీఎం రేవంత్ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి, కేంద్రానికి పంపించారు. అది ఆలస్యమయ్యే పరిస్థితి కనిపించడంతో మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ద్వారా ఆమోదం తీసుకున్నారు. ఆర్డినెన్స్ విడుదలకు సిద్ధమయ్యారు. దీంతో బీఆర్ఎస్ నాయకత్వం కన్ఫ్యూజన్ లో పడింది. సమర్ధించడం సాధ్యం కాదు కాబట్టి, ఈ కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయంగా వ్యతిరేకించినా బీసీల నుంచి వ్యతిరేకతే వస్తుంది. అందుకని కామారెడ్డి డిక్లరేషన్ కు పట్టుపట్టాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లుంది. ఒక్కదెబ్బకు రెండు పిట్టల్లా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడమేగాక, బీఆర్ఎస్ నోరు మూయించే పనికి సీఎం పూనుకున్నారు. దీంతో కుడితో పడ్డ ఎలకలా బీఆర్ఎస్ పరిస్థితి మారిపోయిందని తల పండిన రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఏమైనా మొన్న రైతుకు సాయంపై చర్చకు ఏకంగా ఫాం హౌస్ కే వస్తానని కేసీఆర్ కే షాకిచ్చిన సీఎం, నిన్న స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదంతో కేసీఆర్ ఫ్యామిలీకి, బీఆర్ఎస్ కీ మరో షాక్ ఇచ్చినట్లయిందని రాజకీయ పరిశీలకులు చర్చిస్తున్నారు. మరి ఈ అంశంలో కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ ఏం చేయనుంది? చూడాలి మరి.

బీసీలకు ద్రోహం!

బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం తూతూ మంత్రంగా చేస్తోంది. బీసీలకు ద్రోహం చేసే దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీగా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాం. మీరిచ్చిన హామీని అమలు చేయమంటున్నాం.


-సిరికొండ మధుసూదనాచారి, శాసన మండలి (బీఆర్ఎస్) ప్రతిపక్షనేత

విజయంగా భావిస్తున్నాం!

మేం ఒత్తిడి పెంచిన క్రమంలో వచ్చిన ఈ రిజర్వేషన్ల ప్రకటన కచ్చితంగా విజయంగానే భావిస్తున్నాం. ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేం తలపెట్టిన రైల్ రోకోను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నాం.


-కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగ్రుతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ నేత

Latest News

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News