అవుమల్ల.. గది నిజమేనుల్లా… పత్యేక ఓట్ల సవరింపు (సర్) 35 ఏండ్ల కింద యిడిపోయిన అన్నదమ్ముల్ని కలిపింది. గదెట్లనో మీరే సదువుండ్రి.
మన తెలంగాణ లెక్కనే గా పంజాబ్ ల సర్ సవరింపులు జరుగుతున్నయి. అమ్రుత్ సర్ కు శెందిన సీతారాం కు ఎన్నికల సంఘానికి ఇయ్యడానికి ఓ సర్టిఫికెట్ అవసరమైంది. గందుకు గాయినె తాను సదువుకున్న హరియాణా జింద్ జిల్ల మనోహర్ పూర్ కు పోయిండు. గాడ గాయినె కుటుంబీకులు ఎవరున్నారని ఆరా తీస్తే, గాయినెకు ఒక అన్న ఉన్నడని, గాయినె పేరు దల్బీర్ అని తేలింది. యెంటనే గా బీఎల్ఓ గా దల్బీర్ కు పోన్ చేసి, సీతారాం గురించి శెప్పిండు. గాయినె పరుగున గా బడికి వచ్చిండు. ఇగ అన్నదమ్ములు కలుసుకుని ఒకరి మీద ఒకరుపడి ఏడ్సిండ్రు.

అయితే, 35 ఏండ్ల కింద పోలియోతో బాధపడుతున్న సీతారాంను ఓ దవాఖాన్ల యేసి నెల రోజులు వైద్గం చేయిచిండ్రు. ఓ రోజు సీతారాం కనిపించకుండ పోయిండు. యేడ యెతికినా కానరాలె. ఇగ ఆశ వదులుకున్నరు. గా సీతారాం మాత్రం తను తన కుటుంబానికి భారం కావద్దని, ఎవ్వలికి శెప్పుకుండా పంజాబ్ కు పారిపోయిండు. ఓ పైవేటు బల్లె ప్యూన్ గ పనిశేసుకుంట, సర్కార్ కొలువు దొరకబట్టిండు. ఇగిప్పుడు గా రెండు కుటుంబాలు కలిసిపోయినయి. గీ సర్ సల్లగుండ ఓట్ల సంతేమో గనీ, తప్పిపోయినోల్లను మంచిగనే కలుపుతాంది గదా!?

