Wednesday, September 9, 2026
29.2 C
Hyderabad

అంబేద్కర్ వేసిన బాటలే…రేపటి సమాజానికి వెలుగు రేఖలు!

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడారు. సమాజంలో వివక్ష, అసమానతలు తొలగిపోవాలని పరితపించారు. అందరికీ విద్య, ఆర్థిక స్వేచ్ఛ, ఓటు హక్కు ఉండాలని భావించారు. అంటరానివారికి రిజర్వేషన్లు మాత్రమేగాక, మహిళలకూ రిజర్వేషన్లు ఉండితీరాలని ఆనాడే బిల్లు తెచ్చారు. ఆ బిల్లు పార్లమెంటులో వీగిపోతే, తన పదవికే రాజీనామా చేశారు. అంతిమంగా రాజ్యాధికారం మాత్రమే పేదల అన్ని సమస్యలకు పరిష్కారం కాగలదని గట్టిగా చెప్పారు. మతాన్ని, కులాన్ని నిర్మూలించాలన్నారు. భారత సమాజాన్ని, రాజకీయాల్ని బహుషా అంబేద్కర్ అంతగా ప్రభావితం చేసిన వారెవ్వరూ లేరు. అంబేద్కర్ ని రాజ్యంగ నిర్మాతగా మాత్రమేగాక, సమాజ, రాజకీయ, ఆర్థిక, ప్రజాస్వామ్య దార్శనికుడిగా చూడాలి. అయితే, నాటి నుంచి నేటి దాకా, అంబేద్కర్ ను ఆరాధ్యుడిగా మార్చివేసిన పాలకులు, ఆయన ఆశయాలు, లక్ష్యాలను విస్మరించారు. అందరివాడైన అంబేద్కర్ ను కొందరి వాడిగా మార్చే ప్రయత్నమూ జరిగింది. జరుగుతూనే ఉంది. అంబేద్కర్ జయంతి, వర్ధంతిల సందర్భాల్లో ఆయన విగ్రహాలకు దండలు వేయడం, దండం పెట్టడం, ఆయన ఆశయాలకు నీళ్లొదలడం నేటి పాలకులకు అలవాటుగా, ఆనవాయితీగా మారిపోయింది.

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర కాలంలో మన నాయకులంతా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే దిశగానే పని చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలకు, నాయకులకు అంబేద్కర్ పేరును జపించడం ఓ ఫ్యాషన్ గా, స్టేటస్ సింబల్ గా మారిపోయింది. ఇదంతా కేవలం తమ ఓటు బ్యాంక్‌ ను పెంచుకోవడానికి, ఉన్నది కాపాడుకోవడానికి చేస్తున్న రాజకీయమే తప్ప మరోటి కాదు. నిజంగానే మనం అంబేద్కర్‌ ఆశయాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామా? లేదా? అన్నది నేతలతో పాటు దళితులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజకీయ పార్టీలు, నాయకుల కుట్రలను దళితులు అర్థం చేసుకోవాలి. ఏటేటా అంబేద్కర్‌ జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం కొన్ని ప్రభుత్వ సంస్థలకు అంబేద్కర్ పేరు పెట్టడం, ఢిల్లీ నుండి గల్లీ దాకా ఆయన విగ్రహాలను పెట్టడం, దండలేయడం, దండం పెట్టడమే తప్ప, ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలపై చేస్తున్నదేంటో అవలోకనం చేసుకోవాలి. ప్రధాని మోడీ అయితే అంబేద్కర్‌ పేరు ఉచ్చరించ కుండా ఉండలేకపోతున్నారు. అంబేద్కర్ కు తామిచ్చిన గౌరవం మరెవరూ ఇవ్వలేదంటున్నారు. కానీ నిత్యం అంబేద్కర్‌ జపం చేస్తున్న వారంతా ఉన్నత కులాలు వారే. వారు ఏనాడు దళితులను ఉన్నతికి తీసకుని వచ్చేందుకు ప్రయత్నించడం లేదు. ఓ ఆదివాసీని రాష్ట్రపతిని చేయడం దళిత ఉద్ధరణగా ప్రచారం చేసుకుంటున్నారు. ఒకటి రెండు పదవులు వారి మొహాన పడేసి దళిత దీనజన ఉద్ధరణ జరిగిందన్న ఆ ప్రచారాన్ని మనం నమ్మితే, మనల్ని మనం మోసం చేసుకోవడమే అవుతుంది. దళిత ఉద్ధరణ గురించి గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్‌, జగ్జీవన్‌ రామ్‌కు ప్రధాని అయ్యే ఛాన్స్‌ వస్తే అడ్డుకున్న చరిత్రను మరచిపోగలమా? దళితుడినే తెలంగాణ సిఎం చేస్తానన్న కెసిఆర్‌ సైతం వారిని ఓటు బ్యాంక్‌ కోసం మభ్యపెట్టారు. తొలి దళిత ముఖ్యమంత్రి అంటూ ఊదరగొట్టి తెలంగాణ సమాజాన్ని మోసం చేసి, పదేళ్ల పాటు ఆయనే సిఎంగా కొనసాగారు. దళితబంధు పథకం పేరుతో అక్రమాలకు తెరతీసారు. రాజకీయ నాయకులు ఎలాగూ మంచి చేయరు. కనీసం ప్రజలుగా మనమంతా అంబేద్కర్ కి నివాళి అర్పించేందుకు ఆయన చూపిన మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి. అంటరాని కులాలు ఆర్థికంగా బలపడనిదే, రాజకీయాధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారం దొరకదని అంబేద్కర్‌ ఆనాడే ప్రకటించారు. దళితులకు రాజ్యాధికారం వస్తే తప్ప ఈ అంటరానితనం, చిన్నచూపు చూడడం వేరుగా చూడడం వంటి సమస్యలు సమిసిపోవు.

ఆనాడు భారత జాతీయ కాంగ్రెస్‌ నడిపే జాతీయోద్యమంలో అంటరానితనం నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే ఆ కృషికి కాంగ్రెస్‌ సభ్యుల నుండి పూర్తిస్థాయిలో మద్దతు లభించనేలేదు. గాంధీజీ వర్ణ వ్యవస్థను భారత సమాజం ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉన్నదని సమర్ధించాడు. అయితే, 1932లోనే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నుండి కమ్యూనల్ అవార్డును పొంది, “డిప్రెస్డ్ క్లాసెస్” కోసం ప్రత్యేక ఓటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటింపచేసిన ఘనాపాటి అంబేద్కర్.

ఇప్పటికైనా దళితులు తెలివిడిని, ఐక్యతను ప్రదర్శించాలి. అంబేద్కర్‌ పేరుతో చేసే రాజకీయాలను తిప్పి కొట్టాలి. ఉన్నత కులాలు, రాజకీయ పార్టీలు చేసే కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలి. తమను రాజకీయంగా వాడుకుంటున్న నేతల నిజస్వారూపాలను గుర్తించాలి. అందరికీ సమాన అవకాశాల కోసం పాటుపడాలి. ముఖ్యంగా మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. అప్పుడే అంబేద్కర్‌ ఆశయాలను సాధించగలం. అంబేద్కర్ దళితుడిగా అనుభవించిన అవమానాలు, ఉన్నత చదువులు చదివినప్పటికీ ఎదుర్కొన్న వివక్షలు, తన లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యాలు, సమాజ, ఆర్థిక, రాజకీయ చైతన్యమున్నప్పటికీ, తనకు జరిగిన ఆటుపోట్ల నుండి రాటుదేలి, ప్రజలకు పోరాటదారులు చూపినాడు. ఇప్పటికీ, ఎప్పటికీ అంబేద్కర్ చూపిన బాటలే రేపటి సమాజానికి వెలుగు రేఖలు.

Latest News

గాలిమోటర్ కాదు ఎర్ర బస్సే!?|ADUGU TRENDS

సుతిమెత్తగా తోలు సీట్లు, సీటుసీటుకు బుల్లి తెరలు, శార్జింగ్ పాయింట్లు, ఉచితంగా వైఫై, కావాలంటే టిపిని, తాగాలంటే చాయ్, పోవాలంటే ఒకటి, రెండుకు టాయిలెట్లు... సల్లగా పయాణం.. ఇంకేం కావాలె శెప్పుండ్రి? అయితే...

సెప్టెంబర్ 09, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి త్రయోదశి ఉదయం 11.45 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఆశ్లేష పగలు 03.40 వరకు ఉపరి మఖ యోగం శివ రాత్రి 11.15 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం 11.47 వరకు ఉపరి...

రక్షణ వ్యవస్థలే సైబర్ దోపిడీకి ఆయుధాలు!?|EDITORIAL

అసలైన కాపీరైట్ హక్కుదారులు లేదా వారి అధికారిక ప్రతినిధులకే ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే హక్కు ఉండాలి. అందువల్ల కాపీరైట్ పేరుతో ఎవరైనా వ్యక్తిగతంగా డబ్బులు అడిగితే చెల్లించడం పరిష్కారం కాదు. పోలీసులు, సైబర్...

రూపాయెకే వైద్గ సేవలు!?|ADUGU TRENDS

సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు. గీ...

కొండా కుటుంబానికి కొత్త పరీక్ష!?|EDITORIAL

ఇప్పుడు కొండా కుటుంబం ముందున్న అసలు ప్రశ్న ‘ఎవరి మీద పోరాడాలి?’ అన్నది కాదు.. ‘ఎలా తిరిగి రాజకీయంగా బలపడాలి?’ అనేదే. మౌనం, సమన్వయం, సంస్థాగత పునర్నిర్మాణం ఈ మూడు మార్గాల్లో దేన్ని...

సెప్టెంబర్ 08, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి పగలు 01.49 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.55 వరకు ఉపరి ఆశ్లేష యోగం పరిఘ రాత్రి 01.59 వరకు ఉపరి శివ కరణం తైతుల పగలు 01.49 వరకు ఉపరి గరజి రాహుకాలం...

సెప్టెంబర్ 07, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి సాయంత్రం 04.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.23 వరకు ఉపరి పుష్యమి యోగం వ్యతీపాత ఉదయం 07.46 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ సాయంత్రం 04.03 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

బర్త్ డే టు బర్తరఫ్!|KONDA FAMILY|CONGRESS|

తారుమారైన కొండా సు‘రేఖ’! 17 రోజుల్లోనే తలకిందులు? ‘చే’జేతులా...చెడిన రాజకీయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబరం 3 వరకు మరి తర్వాత వారి దారెటు? కోరి కోరి పదవికి ఎసరు తెచ్చుకోవడమంటే ఇదే! అదీ లండన్ లో ఉన్న...

గుప్త సామ్రాజ్యం – ప్రారంభం మరియు అభివృద్ధి (క్రీ.శ.275-550)|ADUGU DIGITAL MEDIA|HISTORY|COMPITITIVE EXAMS|SPECIAL

గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది...

డాక్టర్ నెట్ ఇండియా-వైద్గం ఫ్రీ!?|ADUGU TRENDS

ఏదన్నా రోగమొత్తే అయిపాయె, ఆగమాగమైతం. యాడికిపోవాల్నో తెల్వదు. ఎంత కర్సైతదో తెల్వదు. ఇగ గిదే సందని, పైసలు గుంజుడు, పానం తీసుడు గా ప్రైవేట్ దవాఖాన్లల్ల పనైపాయె. పానం పోతదో, నిలుత్తదో కనీ,...

అధ్యాపకా! అభివందనం!!|EDITORIAL

నాణ్యమైన విద్య, సమర్థవంతమైన ఉపాధ్యాయ శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడమే రాధాకృష్ణన్‌కు నిజమైన నివాళి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 06 నుండి సెప్టెంబర్ 12 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త ఆలోచనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ప్రారంభించిన పనులను మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News