Saturday, July 25, 2026
22.7 C
Hyderabad

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ పెల్లుబికుతుంది. అసలు శత్రువు ఉద్యమం కాదు. ఉద్యమ కారణాలపై నిర్లక్ష్యం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ప్రతి ఆందోళన వెనుకా రాజకీయాలే ఉంటాయని భావించడం పాలకుల తప్పిదం. రాజకీయ పార్టీలు ఏవైనా ఉద్యమంలోనూ తమ అవకాశాలు, మైలేజీ వెతక్కోవడం సహజమే. కానీ ఉద్యమం పుట్టుకకు కారణమైన సామాజిక, ఆర్థిక, పరిపాలనా సమస్యలను విస్మరించడం మాత్రం మూర్ఖత్వమే అవుతుంది. భారత రాజకీయాల్లో కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ప్రజా అసంతృప్తిని తరచూ రాజకీయ కుట్రగా చిత్రీకరించిన సందర్భాలు ఉన్నాయి. సమస్యను అణచివేయడం సులభమే కావచ్చు. కానీ, అసంతృప్తిని అణచివేయడం అంత సులువు కాదు. కదా, అసాధ్యం కూడా.

ఇటీవల సోషల్ మీడియాలో చర్చకు వచ్చిన “కాక్రోచ్ జనతా పార్టీ” ఉద్యమం కూడా అలాంటి అసంతృప్తికి ప్రతీకగా కనిపిస్తోంది. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో నిర్వహించిన నీట్-యూజీ పరీక్షకు 24 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణపై నమ్మకం దెబ్బతినడంతో సుప్రీంకోర్టు వరకు ఈ వివాదం చేరింది. అయితే ప్రజల్లో ఏర్పడిన అనుమానాలు, విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించలేదనే చెప్పాలి. పరీక్షల విశ్వసనీయత కేవలం విద్యార్థుల భవిష్యత్తుకే కాదు, ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల నమ్మకానికీ సంబంధించిన అంశం.

ఈ ఉద్యమాన్ని కేవలం ఒక పరీక్షకు పరిమితం చేసి చూడడం సరైంది కాదు. ఇది ఉద్యోగ అవకాశాల కొరత, పెరుగుతున్న జీవన వ్యయం, విద్యా–వైద్య రంగాల వ్యాపారం, ప్రభుత్వ సంస్థలపై తగ్గుతున్న విశ్వాసం వంటి అనేక సమస్యల సమాహారం. జాతీయ గణాంకాల ప్రకారం యువ నిరుద్యోగిత ఇప్పటికీ ఆందోళనకర స్థాయిలోనే ఉంది. పట్టభద్రుల్లో ఉద్యోగాల కోసం పోటీ పెరుగుతుండగా, ప్రభుత్వ నియామకాలు మందగిస్తున్నాయి. మరోవైపు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి సంస్థలు భారత ఆర్థిక వృద్ధిని ప్రశంసిస్తున్నప్పటికీ, ఆ వృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి సమానంగా చేరడం లేదనే అభిప్రాయం కూడా ఉంది.

విద్య, వైద్యం సాధారణ సామాన్య కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో లక్షల రూపాయల ఫీజులు, ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్సలకు భారీ ఖర్చులు మధ్యతరగతి, పేద వర్గాలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ప్రభుత్వ రంగ సేవల నాణ్యత మెరుగుపడకపోవడం వల్లే ప్రజలు తప్పనిసరై ప్రైవేట్ రంగాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి సామాజిక అసమానతలను మరింత పెంచుతోంది.
ప్రతిపక్షం బలహీనపడినప్పుడు ప్రజల అసంతృప్తి కొత్త వేదికలను వెతుక్కుంటుంది. గత దశాబ్దంలో సోషల్ మీడియా అలాంటి వేదికగా మారింది. అరబ్ స్ప్రింగ్ నుంచి శ్రీలంక ఆర్థిక సంక్షోభ నిరసనల వరకు, బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమాల నుంచి కెన్యాలో జెన్-జీ నిరసనల వరకు యువత డిజిటల్ వేదికలను సమర్థంగా వినియోగించింది. భారతదేశంలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. సంప్రదాయ మీడియా కంటే సోషల్ మీడియా వేగంగా స్పందించే వేదికగా యువత భావిస్తోంది.

అయితే, సోషల్ మీడియా రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. అది ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురాగలదు. అదే సమయంలో అంతకంతకూ అసత్య ప్రచారాన్ని విస్తరించగలదు. అందువల్ల ప్రభుత్వం సమస్యలను అణచివేయడం కంటే, నిజమైన సమాచారాన్ని వేగంగా ప్రజలకు అందించడం, పారదర్శకంగా వ్యవహరించడం అవసరం. విశ్వాసం కోల్పోయిన వ్యవస్థను జవాబుదారీ తనంతోనే తిరిగి నిర్మించవచ్చు.

భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా కలిగిన దేశాల్లో ఒకటి. 65 శాతం జనాభా 35 ఏళ్లలోపు ఉంది. ఈ యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలంటే నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, ఉద్యోగ సృష్టి ప్రభుత్వాల ప్రాధాన్యంగా మారాలి. లేకపోతే చదువుకున్న యువత విదేశాలకు వలస వెళ్లడం కొనసాగుతుంది. ఇది దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా సవాల్ గా మారుతుంది.
పార్టీలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలకే కాకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో నిరంతర చర్చలు, భాగస్వామ్యాన్ని కొనసాగించాలి. పార్లమెంట్, శాసన సభల్లో సమగ్ర చర్చలు, ప్రజలతో ప్రత్యక్ష మమేకం వంటి ప్రజాస్వామ్య ప్రక్రియలు బలపడితే అసంతృప్తి తీవ్ర ఉద్యమాలుగా మారే అవకాశం తగ్గుతుంది. ప్రజల ఆవేదనను వినడం బలహీనతగా కాకుండా, బలంగా అలవరచుకుకోవాలి.

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ పెల్లుబికుతుంది. అసలు శత్రువు ఉద్యమం కాదు. ఉద్యమ కారణాలపై నిర్లక్ష్యం.

ప్రభుత్వాలు విమర్శలను దేశద్రోహంగా కాకుండా ప్రజల హెచ్చరికగా స్వీకరించాలి. యువత ప్రశ్నించడం శాంతియుత సంకేతం. వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, విధానాల్లో లోపాలను సరిదిద్దడం, అవకాశాలను విస్తరించడం, పారదర్శకత పెంచడం సుస్థిరమైన పాలనకు పునాది. సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరిస్తే ‘కాక్రోచ్’లాంటి ఉద్యమాలకు ఆస్కారమే ఉండదు. లేదంటే అసంతృప్తి కొత్త పేర్లతో, కొత్త రూపాల్లో మళ్లీ మళ్లీ బయటపడుతూనే ఉంటుంది. ప్రజల విశ్వాసమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష.

Latest News

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

జూలై 23, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి నవమి ఉదయం 08.27 వరకు ఉపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 03.30 వరకు ఉపరి అనురాధ యోగం శుభ రాత్రి 10.06 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 08.28...

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన...

గాడ వజ్రాల వాన!?|ADUGU TRENDS

మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం...

యుద్ధ మేఘాలు ప్రపంచ శాంతికి ఆటంకాలు!?|EDITORIAL

యుద్ధం ఎప్పుడూ చివరి పరిష్కారం కాదు. ప్రతి బాంబు పేలుడు వెనుక వేలాది కుటుంబాల విషాదం ఉంటుంది. ప్రతి ఆంక్ష వెనుక లక్షలాది మంది సామాన్యుల జీవనోపాధి దెబ్బతింటుంది. కాబట్టి అమెరికా, ఇరాన్‌తో...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News