Saturday, September 5, 2026
30.2 C
Hyderabad

ఏఐ యుగంలో గెలిచేది మానవ నైపుణ్యమే!?|EDITORIAL

ద్యోగార్థులకు ఏఐ గణాంకాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. డిగ్రీ లేదా అనుభవం ఒక్కటే భవిష్యత్తుకు భద్రత ఇవ్వవు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం తప్పనిసరి. సంస్థలకూ ఇదే సవాల్. సరైన నైపుణ్యాలను గుర్తించి, వాటిలో పెట్టుబడి పెట్టినప్పుడే ఉత్పాదకత పెరుగుతుంది. ఏఐ యుగంలో చివరకు గెలిచేది సాంకేతికత మాత్రమే కాదు, దాన్ని సమర్థంగా వినియోగించగల మానవ నైపుణ్యమే.!

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) భవిష్యత్తు సాంకేతికతగా మాత్రమే కాక, వర్తమాన వ్యాపార ప్రపంచానికి కీలక సాధనంగా మారింది. సంస్థల నిర్ణయ ప్రక్రియల నుంచి ఉత్పత్తి, సేవలు, సైబర్‌ భద్రత వరకు ఏఐ వినియోగం విస్తరిస్తున్న కొద్దీ, దానికి అనుగుణమైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకు డిమాండ్‌ కూడా వేగంగా పెరుగుతోంది. ఈ పరిణామం ఉద్యోగాల సంఖ్యపైనే కాదు. వేతనాల నిర్మాణంపైనా స్పష్టమైన ప్రభావం చూపుతోంది. నైపుణ్యం ఉన్నవాళ్ళకి అధిక వేతనాలు, సంప్రదాయ సాంకేతిక ఉద్యోగాల్లో మాత్రం స్థిరత్వం లేదా తగ్గుదల కనిపించడం కొత్త ఉద్యోగ మార్కెట్‌కు సంకేతం.

జాబ్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫౌండిట్‌ నివేదిక ప్రకారం, భారత్‌లో 2024-2026 మధ్య ఏఐ సంబంధిత ఉద్యోగాల వేతనాలు ఏకంగా 23% పెరిగాయి. గత ఏడాది మాత్రమే ఏఐ రంగం 12% వేతన వృద్ధిని నమోదు చేసింది. పరిశీలించిన విభాగాల్లో ఇదే అత్యధిక వార్షిక వృద్ధి. కంప్యూటర్‌ అండ్‌ నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, సెమీకండక్టర్స్‌ రంగాలు చెరో 9% వేతన వృద్ధితో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ గణాంకాలు కంపెనీల ప్రాధాన్యతలు ఏ దిశగా మారుతున్నాయో స్పష్టం చేస్తున్నాయి.

అయితే, సాంకేతిక రంగం మొత్తం ఒకే రీతిలో వృద్ధి చెందడం లేదు. కంప్యూటర్‌ హార్డ్ వేర్‌, ఈ-కామర్స్‌ వంటి విభాగాల్లో గత రెండేళ్లుగా వేతనాలు తగ్గుముఖం పట్టాయి. ఐటీ సర్వీసెస్‌ రంగంలోనూ జీతాలు దాదాపు స్తబ్ధంగా ఉండటమే కాకుండా, గత ఏడాదితో పోలిస్తే 1% తగ్గుదల నమోదైంది. అంటే ‘టెక్నాలజీ ఉద్యోగం’ అన్న ఒక్క కారణంతో అధిక వేతనం లభించే రోజులు క్రమంగా ముగుస్తున్నాయన్నమాట. ఏ సాంకేతికత వ్యాపారానికి ఎంత విలువను సృష్టిస్తుందన్నదే ఇప్పుడు వేతనాలను నిర్ణయించే ప్రధాన ప్రమాణంగా మారుతోంది.

ఏఐ నిపుణుల వేతనాల్లో అనుభవంతో పాటు నైపుణ్యానికి ఉన్న విలువను గణాంకాలు మరింత స్పష్టంగా చూపుతున్నాయి. 0-3 ఏళ్ళ అనుభవం ఉన్న ఎంట్రీ-లెవల్‌ ఏఐ నిపుణులు ఏడాదికి రూ.8.87 లక్షల నుంచి రూ.15.41 లక్షల వరకు సంపాదిస్తున్నారు. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సీనియర్‌ నిపుణుల వేతనాలు రూ.70.99 లక్షల నుంచి రూ.89.24 లక్షల వరకు చేరుతున్నాయి. సాధారణ ఐటీ-ఐటీ సర్వీసెస్‌ రంగంలో మాత్రం ప్రారంభ వేతనాలు రూ.2.68 లక్షల నుంచి రూ.5.08 లక్షల వరకు ఉండగా, 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నవారికి రూ.57.55 లక్షల నుంచి రూ.72.13 లక్షల వరకు ఉన్నాయి.

భౌగోళికంగా కూడా ఈ వ్యత్యాసం గణనీయంగానే ఉంది. ఉత్పత్తి సంస్థలు, ఏఐ ఆధారిత స్టార్టప్‌లు, గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీలు) అధికంగా కేంద్రీకృతమై ఉండటంతో బెంగళూరు అత్యధిక వేతనాలు అందించే మార్కెట్‌గా నిలిచింది. అక్కడ సీనియర్‌ ఏఐ నిపుణులు ఏడాదికి రూ.61.70 లక్షల నుంచి రూ.91.25 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఇది ఎన్‌సీఆర్‌, ముంబై కంటే 10%-15% అధికం. చెన్నైతో పోలిస్తే సీనియర్‌ స్థాయిలో 40% వరకు ఎక్కువ. జీసీసీలు, ఉత్పత్తి ఇంజినీరింగ్‌ పెట్టుబడులు పెరుగుతుండటంతో హైదరాబాద్‌ కూడా ఈ పోటీలో వేగంగా ముందుకొస్తోంది.

మరోవైపు సైబర్‌ సెక్యూరిటీ రంగం కూడా అధిక విలువ కలిగిన నైపుణ్యాలకు మార్కెట్‌ ఎంత ప్రాధాన్యం ఇస్తోందో చూపిస్తోంది. ఈ విభాగంలో గరిష్ట వార్షిక వేతనం రూ.97.81 లక్షలకు చేరుకుంది. పరిశీలించిన రంగాలన్నింటిలో ఇదే అత్యధిక గరిష్ట వేతనం. డిజిటల్‌ మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్‌ దాడుల ముప్పు పెరగడం, డేటా రక్షణకు ప్రాధాన్యం పెరగడం ఇందుకు ప్రధాన కారణాలు.
టెక్నాలజీకి వెలుపల కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. సెమీకండక్టర్స్‌ రంగంలో రెండేళ్లలో మొత్తం 17% వేతన వృద్ధి నమోదైంది. ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌లో 13% పెరిగింది. ఈ రంగాల్లో సీనియర్‌ ఉద్యోగుల వార్షిక ప్యాకేజీలు వరుసగా రూ.48.49 లక్షలు, రూ.58.90 లక్షలకు చేరాయి. గత ఏడాది ఆటోమోటివ్‌ రంగంలో 6%, మెడికల్‌ ప్రాక్టీస్‌లో 8%, మెడికల్‌ డివైసెస్‌లో 6%, ఫార్మాస్యూటికల్స్ లో 4% వేతన వృద్ధి నమోదైంది.

ఈ పరిణామాలను కేవలం ‘ఏఐ ఉద్యోగాలకు ఎక్కువ జీతాలు’ అనే కోణంలో చూడటం సరిపోదు. వాస్తవానికి భారత ఉద్యోగ మార్కెట్‌ ఒక కీలకమైన మార్పు దశలో ఉంది. కంపెనీలు ఇప్పుడు అనుభవానికి మాత్రమే కాకుండా, తమ వ్యాపార అవసరాలను తీర్చగల నైపుణ్యాలకు ధర నిర్ణయిస్తున్నాయి. ఏఐ వ్యవస్థలను నిర్మించడం, మౌలిక సదుపాయాలను భద్రపరచడం, పారిశ్రామిక ప్రక్రియలను ఆటోమేట్‌ చేయడం, ఆరోగ్య రంగంలో ప్రత్యేక పరిష్కారాలను అందించడం వంటి సామర్థ్యాలు ఉన్నవారికి డిమాండ్‌ పెరుగుతోంది.

అందువల్ల ఉద్యోగార్థులకు ఈ గణాంకాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. డిగ్రీ లేదా అనుభవం ఒక్కటే భవిష్యత్తుకు భద్రత ఇవ్వవు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం తప్పనిసరి. సంస్థలకూ ఇదే సవాల్. సరైన నైపుణ్యాలను గుర్తించి, వాటిలో పెట్టుబడి పెట్టినప్పుడే ఉత్పాదకత పెరుగుతుంది. ఏఐ యుగంలో చివరకు గెలిచేది సాంకేతికత మాత్రమే కాదు.. దాన్ని సమర్థంగా వినియోగించగల మానవ నైపుణ్యమే.

Latest News

అమ్మంటే గామే!?|ADUGU TRENDS

మహారాష్ట్రల బీడ్ అంబాజోగాయిల అమ్రుత్ మహోత్సవ్ వేడుకలు జర్గుతానయి. అమ్రుత్ దౌడ్ మొదలైతాంది. గండ్లకు హఠాత్తుగా ఓ 47 ఏండ్ల రమాబాయి రణవీర్ దూసుకొచ్చింది. గా మారథాన్ పరుగు పందెంల ఉరుకుడు మొదలు...

సెప్టెంబర్ 05, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి నవమి రాత్రి 08.54 వరకు ఉపరి దశమి నక్షత్రం మృగశిర రాత్రి 09.39 వరకు ఉపరి ఆరుద్ర యోగం వజ్ర పగలు 01.57 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 10.08 వరకు ఉపరి గరజి రాహుకాలం...

తలుసుకుంటే కాందేంది? నదే శుభ్రమైంది!?|ADUGU TRENDS

గీ డిగ్రీలు సదివే పిల్లలు ఏం ఆలోశిస్తరు? ఆటా, పాటా, అల్లరి, సదువు, కెరీర్ గివే కదా? కనీ గీ పిల్లగాడు గివేవీ ఆలోసించలే.. తమ ఊరి పక్కనుండే పోతున్న నది గురించి...

కొండా కుటుంబం దారెటు!?|EDITORIAL

అనూహ్యం కాకపోయినా, అనివార్యంగా జరిగిపోయింది. పరిణామాల ఫలితాలేమైనా, కొండంత ఆశయం, తన కూతురు, తమ భవిష్యత్తు కోసం కొంత పట్టువిడుపు ప్రదర్శించి ఉంటే, కొండా సురేఖ మంత్రి పదవి నిలిచేదేమో! అయినా కొండా...

సెప్టెంబర్ 04, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శ్రీ కృష్ణాష్టమి తిధి అష్టమి రాత్రి 11.20 వరకు ఉపరి నవమి నక్షత్రం రోహిణీ రాత్రి 11.20 వరకు ఉపరి మృగశిర యోగం హర్షణ సాయంత్రం 05.00 వరకు ఉపరి వజ్ర కరణం బాలవ పగలు 12.30 వరకు ఉపరి...

అధిష్ఠానం నిర్ణయంపై చిన్నారెడ్డి సంచలనం|CHINNA REDDY|CONGRESS

ఒక్క పోటుతో కూల్చేశారు.. పదవులపై నాకు సోకు లేదు తనకు పదవులపై ఎలాంటి ఆసక్తి, వ్యామోహం లేదని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయంగా ఈ స్థాయికి వచ్చానని, అయితే ఒక్క పోటుతో తనను పదవి...

నా బర్తరఫ్‌ చెల్లదు|KONDA SUREKHA|SENSATIONAL COMMENTS

ఈరోజు నాకు జరిగింది.. రేపు మీకూ జరుగుతుంది ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడండి రేవంత్‌ సర్కార్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు....

BREAKING: కొండా సురేఖపై వేటు..చిన్నారెడ్డి ఔట్

సీఎం రేవంత్‌ నిర్ణయం! తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు అధికారిక నోట్‌ వెల్లడించింది. ఈ మేరకు...

కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం..|KONDA SUREKHA|KA PAUL

కాంగ్రెస్‌ను వీడి ప్రజాశాంతి పార్టీలోకి రండి మంత్రి కొండా సురేఖకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బహిరంగ ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీ...

రాజీనామా చేయాల్సిందే.. లేదంటే బర్తరఫ్‌!|KONDA SUREKHA|RESIGN|BURTRAF

కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం.. ఇంటి వద్ద నిర్మానుష్యం పార్టీ లైన్‌ దాటని అనుచరులు  తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌...

ఉద్వాసనమే!|KONDA SUREKHA|CM|REVANTH REDDY|DELHI

సురేఖను పట్టించుకోని అధిష్ఠానం ముక్తసరిగా మూడు ముక్కల్లో ఖర్గేతో మచ్చట అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ కార్యాలయంలోనే రోజంతా పడిగాపులు నిరాశతో వెనుతిరిగిన మంత్రి కొండా సురేఖ ఖర్గే, కేసీలతో రేవంత్ రెడ్డి వేర్వేరుగా భేటీలు సురేఖ వ్యవహారాన్ని...

గీ కర్ణాటక ట్రాఫిక్ కట్టాలకు గింత కథ ఉందా!?|ADUGU TRENDS

ట్రాఫిక్ కట్టాలు లేందెక్కడ? కిరాణా దుకాన్ల, రేషన్ షాపుల్ల, బ్యాంకుల్ల, బస్సుల్ల, రోడ్ల మీద, శివరాకరికి సులభ్ కాంప్లెక్సుల్ల కూడా రద్దేనాయె!? కానీ, గీ కర్ణాటకల రద్దీకి కర్ణునికి ఏదో లింకుందట సూద్దాం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News