Saturday, August 29, 2026
29.1 C
Hyderabad

ఉద్వాసనా? ఉపేక్షనా? రిటర్న్ గిఫ్ట్ ఏంటి?|ADUGU EXCLUSIVE

రాఖీతో రాజీ కుదిరేనా!?|RAKHI POURNAMI
చర్యలకే మొగ్గు చూపేనా?
కొండా వివాదం ఎటువైపు?|KONDA SUREKHA|CM|REVANTH REDDY

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ చుట్టూ నెలకొన్న తాజా వివాదాస్పద పరిణామాలు పార్టీలో క్రమశిక్షణ, వ్యక్తిగత రాజకీయ సంబంధాలు, అధిష్ఠానం నిర్ణయం అనే మూడు అంశాలను ముందుకు తెచ్చాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం, ఆ తర్వాత పార్టీ పెద్దలతో జరిగిన చర్చలు, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలసి సురేఖ బంగారు రాఖీ కట్టడం వరకు ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే, ఇది ఉద్వాసన దిశగా వెళ్తున్న వ్యవహారమా? లేక రాజకీయ ఉపేక్షతో ముగిసే వివాదమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమువుతున్నాయి.

సుస్మితా పటేల్ వ్యాఖ్యల వ్యవహారం వ్యక్తిగత స్థాయిని దాటి పార్టీ అంతర్గత క్రమశిక్షణ అంశంగా మారింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు సీఎం రేవంత్‌రెడ్డిపై కూడా ఆమె వ్యాఖ్యలు చేయడంతో వివరణలు, చర్యలపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం స్పందన ఎలా ఉంటుందన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. పార్టీ ఇప్పటికే అంతర్గత విభేదాలను అదుపులో ఉంచే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ వివాదం మరింత రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

అయితే, రాఖీ రాజకీయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డికి సురేఖ ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టినట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. సీఎం మనవడు, అల్లుడికి కూడా రాఖీ కట్టానని, తాను అందరికీ ఆడపడుచునేనని ఆమె పేర్కొన్నారు. ఇది సాధారణ పండుగ సంప్రదాయంగా చూడవచ్చా? లేక వివాదానికి రాజకీయ ముగింపు పలికే సంకేతంగా భావించాలా? సమాధానం మాత్రం ఇంకా స్పష్టంగా లేదు. ఇక్కడ గణాంకాల కంటే రాజకీయ సమీకరణలే కీలకం. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలుండగా, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే అధికార పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ, అంతర్గత అసంతృప్తి ప్రతి అంశాన్నీ రాజకీయంగా సున్నితంగా మారుస్తుంది. ఒక్క ఎమ్మెల్యే లేదా ఒక్క మంత్రి చుట్టూ ఏర్పడే వివాదం సంఖ్యాపరంగా ప్రభుత్వాన్ని కూల్చే స్థాయిలో లేకపోయినా, పార్టీ ప్రతిష్ఠ, నాయకత్వ నియంత్రణ, భవిష్యత్ ఎన్నికల సమీకరణాలపై ప్రభావం చూపగలదు.

అందుకే అధిష్ఠానం ముందు రెండు మార్గాలున్నాయి. మొదటిది క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించి, పార్టీ నిర్ణయాలకు ఎవరూ అతీతులు కారనే సందేశం ఇవ్వడం. రెండోది వివాదాన్ని కుటుంబ, వ్యక్తిగత స్థాయిలోనే పరిమితం చేసి రాజకీయ రాజీకి అవకాశం ఇవ్వడం. రాఖీ ఘటన రెండో మార్గానికి తలుపు తెరిచిన సంకేతంలా కనిపించినా, అది అధికారికంగా వివాదం ముగిసిందనే అర్థం కాదు.

అంతిమంగా కొండా వ్యవహారం ఒక వ్యక్తి రాజకీయ భవితవ్యానికి మాత్రమే సంబంధించినది కాదు. తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వం మాట ఎంత బలంగా అమలవుతుంది? పార్టీ క్రమశిక్షణకు ఎంత విలువ ఉంది? వ్యక్తిగత సంబంధాలు రాజకీయ విభేదాలను ఎంతవరకు కరిగించగలవు? అన్న ప్రశ్నలకు ఇది ఒక పరీక్ష. అందుకే ఇప్పుడు అందరి చూపు మంత్రి కొండ సురేఖపైనే కేంద్రీక్రుతం అయింది. సురేఖకు ఉద్వాసన తప్పదా? ఉపేక్ష దక్కుతుందా? లేక రాఖీతోనే రాజీకి తెరపడుతుందా?

Latest News

గీ ఈడియ సూత్తే గుండె కరగాలె!?|ADUGU TRENDS

రాఖీలను తోడబుట్టినోల్లకే కాదుల్లా. సోదర భావంతోటి ఎవ్వలకైనా కట్టొచ్చు. గట్లనే ఓ బడి పిల్ల, ఎవ్వలూ లేక వాడవాడలకు తిరిగే ఓ అనాథకు రాఖీ కట్టింది. తనలోని మానవత్వాన్ని సాటుకుంది. యేడ జరిగిందో గనీ,...

కాంగ్రెస్‌లో కలుపు మొక్కలు!|EDITORIAL

ప్రజలు కోరుకునేది పార్టీ అంతర్గత రాజకీయ విమర్శలు కాదు, ఫలితాలు. మంత్రులు తమ శాఖలపై దృష్టి పెట్టాలి. ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై మాట్లాడాలి. పార్టీ నేతలు ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలహీనపరిచే బహిరంగ పోరాటాలకు...

ఆగస్టు 29, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి పాడ్యమి ఉదయం 09.15 వరకు ఉపరి విదియ నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి తెల్ల 04.18 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం సుకర్మ ఉదయం 08.10 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 09.15 వరకు ఉపరి...

‘రాఖీ’తో ‘రాజీ’…!?|RAKSHA BANDHAN|KONDA SUREKHA|CM|REVANTH REDDY

మంత్రి పదవికి ‘రక్షా’ బంధన్! కొండా సురేఖ వ్యూహం ఫలించేనా? ‘రక్షాబంధనం’ సురేఖక్క మంత్రి పదవిని రక్షిస్తుందా? ‘రాఖీ’తో ‘రాజీ’ కుదురుతుందా? మంత్రి కొండా సురేఖ వ్యూహం ఫలిస్తుందా? ఏం కానుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్...

తమ్ముడికి జీవితాన్నే బహమతిగా ఇచ్చిన అక్క!?|ADUGU TRENDS

రాఖీల పున్నం పండగను అన్నా శెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల మద్దెల పేమానురాగాలకు, రచ్చణకు పతీకగా జరుపుకుంటరు. రాఖీ అంటే రచ్చణ కవచం. రచ్చా సూత్రం. గా అన్నాతమ్ముల్లకు ఆపదలు రాకుండా, గవాల్లు ఆయురారోగ్యాలతో కలకాలం...

హిమాలయాల్లో మహా విలయం!?|EDITORIAL

ఇంతటి విపత్తు నుంచి భారత్‌ పాఠాలు నేర్చుకోవాలి. హిమాలయాల్లో విచ్చలవిడిగా రహదారులు, హైడ్రోపవర్‌ ప్రాజెక్టులు, పర్యాటక నిర్మాణాలు చేపడుతూ పర్వతాల సహజ సమతౌల్యాన్ని దెబ్బతీస్తే ప్రమాదాల సంఖ్యేకాదు, వాటి తీవ్రతా పెరుగుతుంది. వాతావరణ...

ఆగస్టు 28, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం రాఖీ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమ తిధి పౌర్ణమి ఉదయం 08.57 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం శతభిషం రాత్రి తెల్ల 03.43 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం అతిగండ ఉదయం 08.57 వరకు ఉపరి సుకర్మ కరణం బవ...

హద్దుల్లేని ముద్దురణం!?|ADUGU TRENDS

ము ముద్దంటే శేదా? అంటే ఎవరికి శేదు చెప్పండి? గందుకే కాకిపిల్ల కాకికి ముద్దన్నరు. తల్లికి పిల్లంటే ముద్దు. పేమికులకు ఒకలంటే ఇంకొకలికి ముద్దు. గా ముద్దు ముచ్చట ఒకామె గీ ఇధంగా...

ఆర్థిక పతనం దిశగా అమెరికా ఫస్ట్ నినాదం!?|EDITORIAL

‘అమెరికా ఫస్ట్’ అంటే ప్రపంచం నుంచి అమెరికా దూరం కావడం కాదు. అమెరికా ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూనే ప్రపంచ వాణిజ్యం, శాంతి, స్థిరత్వంతో సమన్వయం సాధించాలి. లేకపోతే గొప్ప దేశాన్ని నిర్మించాలన్న నినాదమే...

ఆగస్టు 27, గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి చతుర్దశి ఉదయం 08.05 వరకు ఉపరి పొర్ణమి నక్షత్రం ధనిష్ఠ రాత్రి 02.38 వరకు ఉపరి శతభిషం యోగం శోభ ఉదయం 09.20 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 08.05 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

పనికి ఫార్చునర్ కారులో సఫాయి!?|ADUGU TRENDS

రోజులు మస్తుగ మారిపోతున్నయి. పేదా బక్క, బిక్కిబీదా తేడా లేకుండా పోతాంది. ఎవ్వలైనా హమ్ కిసీ సే కం నహీ అంటాండ్రు. గట్లనే గా సఫాయి కూడా అంటా0డు. గా సఫాయి రోజూ...

ఆర్థిక యుద్ధం అణుబాంబు కన్నా డేంజర్!?|EDITORIAL

యుద్ధానికి ఆయుధాలు అవసరం. ఆర్థిక యుద్ధానికి ప్రపంచ సహకారం అవసరం. అమెరికా ఆ సహకారాన్ని ఎంతవరకు సాధించగలదన్నదే అసలు పరీక్ష. ఇరాన్‌ను బలహీనపరచాలన్న అమెరికా ప్రయత్నం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచకుండా జాగ్రత్తపడాల్సిన...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News