రాఖీల పున్నం పండగను అన్నా శెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల మద్దెల పేమానురాగాలకు, రచ్చణకు పతీకగా జరుపుకుంటరు. రాఖీ అంటే రచ్చణ కవచం. రచ్చా సూత్రం. గా అన్నాతమ్ముల్లకు ఆపదలు రాకుండా, గవాల్లు ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని అక్కా శెల్లెల్లు మణికట్టుకు రాఖీ కడతరు. అక్కా శెల్లెల్లకు జీవితకాలం భరోసగ, అండగా ఉంటమని, గీ పండుగనాడు పతిన శేత్తరు. గిసొంటి గీ రోజున గా అక్క తన తమ్మునికి జీవితాన్నే రివర్స్ గిఫ్టుగ ఇచ్చింది. గదేందో సూద్దాం పదండ్రి.

ఢిల్లీకి శెందిన జితేంద్రకుమార్ కు కిడ్నీల సమస్య ఒచ్చింది. రొండేండ్లుగ వారానికి 3 సార్ల డయాలసిస్ శేత్తాండ్రు. గాయినకు బీనా కుమారి అని ఒక అక్క ఉంది. గీ తమ్ముని పానం పోతాంటె సూడలేక, తన ఒక కిడ్నీని ఇత్తనంది. పరీచ్చలు శేసి పనికి వత్తదని డాక్టర్లన్నరు. యెంటనే గా కిడ్నీ మార్చిండ్రు. గిప్పుడు గా తమ్ముడు, గీ అక్కా కోలుకుంటాండ్రు. అక్కంటే గామే పోండ్రి.

