భూభారతి చట్టం రైతులకు ఎంతో ఉపయోగకరమైనది
ధరణిపై సుమారు 21 లక్షల రైతుల కంప్లైంట్స్ ఉన్నాయి
గత పదేళ్లలో రైతాంగాన్ని, రెవెన్యూ శాఖని సర్వనాశనం చేశారు
సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక భూ భారతి చట్టం
కేసీఆర్ కుటుంబం రైతు కష్టం తీర్చకుండా….వారి ఖజానా ను మాత్రమే నింపుకున్నారు
ఇంటికో ఉద్యోగం అన్నారు వారి కుటుంబంలోనే ఉద్యోగాలు నింపుకున్నారు
ఎమ్మెల్యే యశస్విని కోరిక మేరకు మొట్టమొదటి రైతు అవగాహన సదస్సు పాలకుర్తిలోనే నిర్వహిస్తున్నాం
లిఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో పలువురు వక్తలు
హాజరైన ఎమ్మెల్సీ కోదండరాం, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ఇతర సభ్యులు, భూభారతి చట్ట రూపకర్త భూమి సునీల్ కుమార్
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ వ్యాప్తంగా రైతులకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు గాను లీఫ్స్ సంస్థ ఏర్పాటు చేసిన సదస్సుకు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి సభ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్సీ కోదండరాం రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి భూభారతి చట్ట రూపకర్త భూమి సునీల్ కుమార్ రైతు కమిషన్ సభ్యులు మరికంటి భవానీ రెడ్డి, చెవిటి వెంకన్న, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు అడిగిన ప్రశ్నలకు కమిషన్ సభ్యులు సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ…. గత పదేళ్లలో నష్టపోయిన తెలంగాణ ఒక్క సంవత్సరంలోనే ఊహించనంత అభివృద్ధ జరిగిందన్నారు. గత ప్రభుత్వం భూసంస్కరణలు చేయమంటే భూమిని దోచుకోవడమే పనిగా పెట్టుకుందన్నారు. 75 ఏళ్ల భారత స్వాతంత్ర దేశంలో భూసంస్కరణలు చేపట్టాల్సిన అవసరాలు ఉన్నాయని, మార్పులు చేయడాన్ని, మనమంతా స్వాగతించాలని ఈ భూభారతి చట్టం ఈ మార్పులకు దోహదం చేస్తుందని అన్నారు. ఇలాంటి సదస్సు ఏర్పాటు చేసిన స్థానిక ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డిని అభినందించారు. తెలంగాణ ఉద్యమం చేసిన మనం ఈ భూభారతి చట్టాన్ని కూడా ఒక ఉద్యమంలా, ప్రజలందరికీ రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
https://www.youtube.com/watch?v=PdesOHowCcE
రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడుతూ…. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కోనేరు రంగారావు కమిటీ చెప్పిన సూచనలే మన రైతులకు భగవద్గీత లాంటివి అన్నారు. ఆ సూచనలకనుగుణంగానే ఈ చట్టాన్ని రూపొందించామని చెప్పారు. రైతులు భూమికి సంబంధించి రైతుల హక్కులు భూ చట్టాలపై అవగాహన ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. రైతులు తమ హక్కులు తెలుసుకోవడం ద్వారా ఎటువంటి భూ సమస్యలనైనా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ భూభారతి చట్టం రైతుల అన్ని సమస్యలు తీర్చే చట్టంగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డి సీఎం కాగానే మొట్టమొదటి అంశంగా రైతులను బాగు చేయడమే లక్ష్యమని తమకు తెలిపారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ భూభారతి చట్టాన్ని తయారు చేశామన్నారు. ఈ అవగాహన సదస్సును రైతులంతా ఉపయోగించుకోవాలన్నారు.
https://www.youtube.com/watch?v=2fgWR9KAJDo
భూ భారతి చట్ట రూపకర్త భూమి సునీల్ కుమార్ మాట్లాడుతూ…. యూట్యూబ్ లో సినిమాలు కామెడీ చూసే బదులు ఈ రైతు హక్కులకు సంబంధించి చట్టాలకు సంబంధించిన వీడియోలను చూడాలని సూచించారు. ఈ భూభారతి చట్టం రైతుల కోసమే రైతు సంక్షేమం కోసమే తయారుచేసింది అన్నారు. గత ప్రభుత్వం తయారుచేసిన ధరణి చట్టం ఒక తప్పుల తడక అన్నారు. ఈ ధరణి చట్టం ద్వారా ఏ ఒక్క రైతు కూడా సమస్య లేకుండా లేడు అన్నారు. అన్నం పెట్టే రైతన్న బాధపడితే దేశమంతా నాశనం అవుతుందనే విషయాన్ని గత ప్రభుత్వం మర్చిపోయింది అన్నారు. ఏమన్నా అంటే ధరణి అని మాట్లాడే గత పాలకులు 21 లక్షల రైతుల కంప్లైంట్స్ కేవలం ధరణిపై వచ్చాయనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, తాము గుర్తించామన్నారు. ఒకప్పుడు రైతుకు భూ సమస్యలు 75 వుంటే ధరణి ద్వారా అవి 120కి చేరాయి అన్నారు. ఈ చట్టం ద్వారా ఆధార్ కార్డ్స్ లాగా భూధర్ కార్డ్ ఇస్తామన్నారు. ఈ చట్టంపై ప్రతి ఒక్క రైతు అవగాహనతో ఉండాలి అన్నారు. ఈ చట్టం రూపకల్పనలో అందరి రైతు సమస్యలను తీర్చే విధంగా చేయాలని కలిసిన ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. ఈ చట్టం ద్వారా భూ రికార్డుల నిర్వహణ, భూ హక్కుల పరిరక్షణ, భూవివాదాల పరిష్కారం వంటి అంశాలు సులభతరం అవుతాయని వివరించారు.
https://www.youtube.com/watch?v=_tgEB3QjyuQ
కమిషన్ సభ్యులు మరికంటి భవాని రెడ్డి, చెవిటి వెంకన్నలు మాట్లాడుతూ…. రైతు సమస్యలను తీర్చడమే లక్ష్యంగా భూభారతి చట్టం రూపొందించి త్వరలో అమలు చేయబోతున్నాం అన్నారు. హైదరాబాద్ బూర్గుల రామకృష్ణారావు భవన్లో రైతు కమిషన్ కార్యాలయంలో రైతులకు ఏ సమస్యలు ఉన్న తమకు కంప్లైంట్ చేయాలని వాటిని సాల్వ్ చేస్తామన్నారు.
సభా అధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ…. గత ప్రభుత్వం రైతుల కష్టాలు తీర్చమంటే ధరణి పేరుతో రైతాంగాన్ని దోచుకున్నారు అన్నారు. నియోజకవర్గంలో 90 శాతం మందికి భూ సమస్యలు ఉన్నాయన్నారు. భూ సమస్యలు లేని పాలకుర్తిని చేయడమే తమ లక్ష్యం అన్నారు. అందుకోసమే మొట్టమొదటి అవగాహన సదస్సును పాలకుర్తిలో నిర్వహించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు. ఇంటికో ఉద్యోగం అని మాట ఇచ్చి తమ కుటుంబంలోనే అన్ని ఉద్యోగాలు పెట్టుకున్నది మనకు అందరికీ తెలుసు అన్నారు. ఇందిరమ్మ పాలనలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. అభివృద్ధిపై మేము ఒక ప్రణాళికతో పని చేస్తున్నామన్నారు. కొందరు తమపై అవాకులు చవాకులు పేలుతున్నారని వారిని పట్టించుకోనన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వానిది అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో 6 మండలాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. తొర్రూర్ లో 100 పడకల దవాఖానా మంజూరైందని త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. రాయపర్తి మండలానికి గోడౌన్ మంజురైందని, అలాగే పోతిరెడ్డిపల్లి గ్రామంలో సోలార్ ప్యానల్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెద్ద వంగర మండలం, కొడకండ్ల మండలం గత ప్రభుత్వ పాలనలో వెనుకబడిపోయిందని వాటిని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు. కొడకండ్లకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. దేవరుప్పులలో కూడా చాలా పనులు చేయాల్సినవి ఉన్నాయని, వాటిని త్వరలో మీకందరికీ చెప్తానన్నారు. పాలకుర్తి మండలం లో చెన్నూరు పాలకుర్తి రిజర్వాయర్లను పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిచడానికి కృషి చేస్తున్నామన్నారు. పాలకుర్తి టూరిజం హబ్ గా మారుస్తున్నాం అన్నారు.
https://www.youtube.com/watch?v=cS9C9RECFWU
పాలకుర్తి నియోజకవర్గకాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…. ఎర్రబెల్లి దయాకర్ రావు ను ఓడించి మమ్మల్ని గెలిపించినందుకు పాలకుర్తి ప్రజలకు తాము రుణపడి ఉంటామన్నారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు మేము ఆహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి, రైతులకు ధన్యవాదాలు తెలిపారు.
https://www.youtube.com/watch?v=Ljg3rmTe1P8
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ కుమార్ సింగ్, తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, లీప్స్ సంస్థ ప్రతినిధి కరుణాకర్ దేశాయ్, పాలకుర్తి, కొడకండ్ల మార్కెట్ కమిటీల చైర్మన్లు, ఆర్డీవో లు, ఎమార్వోలు, సంబంధిత అధికారులు, బ్లాక్ అధ్యక్షులు, ఆరు మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకులు, రైతులు, యుత్ నాయకులు తదితరులు, పాల్గొన్నారు.
పాలకుర్తి సోమన్న ను దర్శించుకున్న రైతు కమిషన్, ఎమ్మెల్యే
పాలకుర్తి పర్యటనకు వచ్చిన రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, భూ భారతి చట్టం రూపకర్త భూమి అనిల్ కుమార్, కమిషన్ సభ్యులు మరికంటి భవాని రెడ్డి, చెవిటి వెంకన్న తదితరులు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి తో కలిసి పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాశస్త్యం అడిగి తెలుసుకున్నారు. వారికి ఆలయ పూజారులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి ఆశీర్వదించారు. వారి వెంట తొర్రూరు మాజీ వైస్ ఎంపీపీ ఎట్టే శ్యాంసుందర్ రెడ్డి, రైతు నాయకులు సంగి వెంకన్న యాదవ్ వున్నారు. ఆలయ అధికారులు మోహన్ బాబు, వెంకటయ్య, పూజారులు దేవగిరి లక్ష్మన్న, రమేష్ శర్మ, అనిల్ శర్మ, మత్తగజం నాగరాజు శర్మ, సంతోష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శ
పాలకుర్తి మండలం, దర్దేపల్లి గ్రామానికి చెందిన నిమ్మల యాకయ్య అనే రైతు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోగా, వారి కుటుంబాన్ని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, భూ భారతి చట్ట రూపకర్త సునీల్ కుమార్, కమిషన్ సభ్యులు మరికంటి భవాని రెడ్డి, చెవిటి వెంకన్న లతో కలిసి స్థానిక ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.