Friday, October 9, 2026
26.3 C
Hyderabad

రూపాయి బియ్యంతో కోట్లలో దళారుల దందా!|EDITORIAL

రేషన్ బియ్యం అక్రమ రవాణా కేవలం లబ్ధిదారుల స్థాయిలోనే కాదు. కొన్నిచోట్ల డీలర్లు, దళారులు కుమ్మక్కై నిల్వలను నిలువునా మింగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గోదాములు, హోటళ్లు, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతున్నాయి. గతంలో పాతరకం బియ్యం రీసైక్లింగ్‌కు తరలగా, ఇప్పుడు నాణ్యమైన సన్నబియ్యం కూడా అక్రమ రీసైక్లింగ్ కొనసాగుతోంది. కచ్చితంగా అది వ్యవస్థ వైఫల్యమే. అధికారులు హెచ్చరికలు, అప్పుడప్పుడు చేసే దాడులు మాత్రమే సరిపోదు. లబ్ధిదారులు బియ్యం అమ్మినట్లు రుజువైతే రేషన్ కార్డు రద్దు చేయడం, వరుసగా ఆరు నెలలు సరుకులు తీసుకోని వారిని అనర్హులుగా గుర్తించడం, నిల్వల్లో తేడాలు ఉన్న డీలర్లపై లైసెన్సు రద్దు చేసి క్రిమినల్ కేసులు పెట్టడం వంటి చర్యలను కచ్చితంగా అమలు చేయాలి. అదే సమయంలో దళారుల అసలు నెట్‌వర్క్‌ను గుర్తించి మూలాలను ఛేదించాలి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలు పెచ్చుమీరడం ఆందోళన కలిగించే పరిణామం. రూపాయికే కిలో లభించే బియ్యం, కొన్ని సందర్భాల్లో ఉచితంగా అందుతున్న సన్నబియ్యం, అర్హులైన పేదల ఆహార భద్రతకు ఉపయోగపడాల్సింది పోయి దళారులు, అక్రమ వ్యాపారులకు కాసుల పంటగా మారుతోంది. రేషన్ దుకాణం నుంచి లబ్ధిదారుడి ఇంటికి చేరకముందే బియ్యం చేతులు మారుతున్న ఘటనలు పలు ప్రాంతాల్లో వెలుగుచూస్తున్నాయి. ఇది కేవలం రేషన్ అక్రమం కాదు. ప్రభుత్వ సంక్షేమ లక్ష్యానికే తూట్లు పొడిచే వ్యవహారం.

పేదలకు తక్కువ ధరకు బియ్యం అందించే పథకానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఎన్టీ రామారావు హయాంలో కిలో బియ్యం రూ.2కే అందించే పథకానికి శ్రీకారం చుట్టగా, అనంతరం పలు ప్రభుత్వాలు దీనిని మరింత విస్తరించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కిలో రూపాయికే బియ్యం అందించే విధానం అమల్లోకి వచ్చింది. కాలక్రమంలో ఆహార భద్రతా పథకాలు మరింత విస్తరించాయి. తెలంగాణలో ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా అందించే విధానం అమల్లో ఉంది.

తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 3.42 కోట్ల మంది ఉచిత సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. కొత్తగా 16 లక్షల కుటుంబాలను రేషన్ పరిధిలోకి తీసుకురావడంతో ప్రస్తుతం 1.06 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఆహార భద్రత అందుతోంది. ఇంత భారీ స్థాయిలో ప్రజాధనం వెచ్చించి అమలు చేస్తున్న పథకంలో ప్రతి గింజ అర్హుడి కడుపులోకే చేరాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైన వెంటనే కొన్నిచోట్ల లబ్ధిదారుల ఇళ్ల వద్ద దళారులు ప్రత్యక్షమవుతున్నారు. కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు చెల్లించి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులు రేషన్ దుకాణంలో వేలిముద్ర వేసి, బియ్యం తీసుకెళ్లకుండా కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకు నగదు తీసుకుంటున్న ఘటనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అదే బియ్యం అక్రమ మార్గాల్లో హోటళ్లకు, వ్యాపారులకు లేదా ఇతర ప్రాంతాలకు తరలుతోంది.

రేషన్ బియ్యం బహిరంగ మార్కెట్‌లో కిలోకు రూ.25 నుంచి రూ.50 వరకు అమ్ముడవుతుండటంతో అక్రమ వ్యాపారులకు భారీ లాభాలు వస్తున్నాయి. వేల టన్నుల ధాన్యం ఈ విధంగా పక్కదారి పడితే కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం సాగడం అసాధ్యమేమీ కాదు. ఒకవైపు ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే, మరోవైపు అదే బియ్యం బ్లాక్ మార్కెట్‌కు చేరడం ప్రజాధనానికి రెండు విధాలా నష్టం.

రేషన్ బియ్యం అక్రమ రవాణా కేవలం లబ్ధిదారుల స్థాయిలోనే ఆగిపోవడం లేదు. కొన్నిచోట్ల డీలర్లు, దళారులు కుమ్మక్కై నిల్వలను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గోదాములు, హోటళ్లు, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతున్నట్లు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో పాతరకం బియ్యం నాణ్యతపై అభ్యంతరాల కారణంగా రీసైక్లింగ్‌కు తరలిన సందర్భాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్న నేపథ్యంలో కూడా అక్రమ రీసైక్లింగ్ కొనసాగితే అది వ్యవస్థ వైఫల్యమే అవుతుంది.

అధికారులు హెచ్చరికలు చేయడం, అప్పుడప్పుడు దాడులు నిర్వహించడం మాత్రమే సరిపోదు. లబ్ధిదారులు బియ్యం అమ్మినట్లు రుజువైతే రేషన్ కార్డు రద్దు చేయడం, వరుసగా ఆరు నెలలు సరుకులు తీసుకోని వారిని అనర్హులుగా గుర్తించడం, నిల్వల్లో తేడాలు ఉన్న డీలర్లపై లైసెన్సు రద్దు చేసి క్రిమినల్ కేసులు పెట్టడం వంటి చర్యలను కచ్చితంగా అమలు చేయాలి. అదే సమయంలో దళారుల అసలు నెట్‌వర్క్‌ను గుర్తించి మూలాలను ఛేదించాలి.

స్మార్ట్ రేషన్ కార్డులు, బయోమెట్రిక్ విధానం, డిజిటల్ స్టాక్ రికార్డులు ఉన్నప్పటికీ అక్రమాలు కొనసాగుతున్నాయంటే పర్యవేక్షణలో లోపాలున్నట్టే. ప్రతి రేషన్ దుకాణం నిల్వలను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేయాలి. లబ్ధిదారుడికి అందాల్సిన పరిమాణం, తీసుకున్న తేదీ, మిగిలిన నిల్వ తదితర వివరాలు పారదర్శకంగా అందుబాటులో ఉండాలి.

పేదవాడి ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన బియ్యం వ్యాపార వస్తువుగా మారడం సహించరానిది. సంక్షేమ పథకాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితం కాకుండా నిజమైన లబ్ధిదారులకు చేరినప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుంది. ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయి పేదవాడి పళ్లెంలో అన్నంగా మారాలి. దళారి జేబులో లాభంగా కాదు. రేషన్ బియ్యం దందాను అరికట్టడంలో ప్రభుత్వాలు మరింత కఠినతరమైన, నిరంతర చర్యలకు పూనుకోవాలి.

Latest News

నానా పటేకర్ ఇక లేరు|NANA PATEKAR|FILM ACTOR

ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) గురువారం ఉదయం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని దవాఖానకి తరలించారు. అయితే...

మూగ జీవాలకో ఫుడ్ కోర్టు!?|ADUGU TRENDS

మూగ జీవాలను మనుసులతో సమానంగ సూత్తం. మంచి మంచి దేవుల్ల పేర్లు పెట్టి పిలుస్తం. గయి మనతో సమానంగ కలిసే జీవిత్తయి. కనీ, గీ మద్దెల గవాటిని పట్టించుకునుడే మానేసినం. గయ్యేమో ఆహారం...

నమో పాతికేళ్ళ అసాధారణ ప్రస్థానం!?|EDITORIAL

నమో పాతికేళ్ల అనుభవం నిజంగానే ఒక గొప్ప ఆస్తి. కానీ ప్రజాస్వామ్యంలో ఆ ఆస్తికి అసలైన యజమానులు ప్రజలే. కాబట్టి ఈ అనుభవానికి తుది కొలమానం అధికారంలో గడిపిన సంవత్సరాల సంఖ్య కాదు....

అక్టోబర్ 08, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి త్రయోదశి రాత్రి 09.40 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పుబ్బ రాత్రి 09.50 వరకు ఉపరి ఉత్తర యోగం శుక్ల రాత్రి 02.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 10.23 వరకు ఉపరి...

‘అన్న’మో రామచంద్రా!?|RICE|FARMER|RICE MILL|STATE|CENTRAL|GOVERNMENT

బియ్యమా? ధరలు పెరుగుతున్న దయ్యమా? ధాన్యం ఉత్పత్తిలో టాప్..ధరల నియంత్రణలో ఫ్లాప్ రైతుకు గిట్టుబాటు-సామాన్యుడికి అందుబాటేది? మిల్లర్ల మాయా? పరిపాలనా వైఫల్యమా? రాష్ట్రమే కాదు, దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి! ధరల పెరుగుదలకు దరిద్రపు కారణాలెన్నో? అన్నపూర్ణ రాష్ట్రంలో ప్రజలు ‘అన్న’మో...

తాటిశెట్టుకు ఇనుప మెట్లు!?|ADUGU TRENDS

తాటి కల్లు మత్తుగున్నది.. నీ బాంచెన్ తాగుతుంటే ఎక్కుతున్నది. అనుకుంటనే గీ కల్లును మస్తుగ తాగుతుంటరు. తెలంగాణలనైతే ఊర్లల్ల ఆడోల్లు కూడా గీ కల్లు తాగుతరు. కనీ, గీ కల్లు గీసుడే మస్తు...

‘సర్’ సర్వేపై సర్వత్రా నిరసనలు.. భరోసా ఏది!|EDITORIAL

‘సర్’పై నెలకొన్న వివాదాన్ని విస్తృత ప్రజాస్వామ్య విశ్వాస సంక్షోభంలో భాగంగా చూడాలి. ఎన్నికల సంఘం నిష్పక్షపాతత్వంపై సందేహాలు రాకుండా ప్రతి అభ్యంతరానికీ పారదర్శకంగా సమాధానం చెప్పాలి. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా...

అక్టోబర్ 07, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.02 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం మఖ రాత్రి 10.32 వరకు ఉపరి పుబ్బ యోగం సాధ్య ఉదయం 07.05 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 11.55 వరకు ఉపరి...

గాడ దుర్గమ్మకు శేపల కూరే నైవేద్యం!?|ADUGU TRENDS

దేవీ శరన్నవరాత్రోత్సవాలు గదేనుల్లా.. దుర్గా నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ. తొమ్మిది రోజులు జగన్మాత అయిన గా దుర్గాదేవిని రకరకాల రూపాలల్ల అర్చిస్తూ, పదో రోజున అంటే విజయదశమి దసరా...

భయపడటం కాదు, అప్రమత్తంగా ఉండాలి!?|EDITORIAL

సైబీరియా ఘటన మనకు నేర్పే పాఠం భయపడటం కాదు. అప్రమత్తంగా ఉండటం. అధికారిక నిర్ధారణకు ముందే రూమర్లను ప్లేగ్ మహమ్మారి వార్తలుగా మార్చడం ప్రజల్లో అనవసర భయాన్ని పెంచుతుంది. అదే సమయంలో ల్యాబొరేటరీ...

అక్టోబర్ 06, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి ఏకాదశి రాత్రి 12.45 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.36 వరకు ఉపరి మఖ యోగం సిద్ద ఉదయం 09.47 వరకు ఉపరి సాధ్య కరణం బవ పగలు 01.47 వరకు ఉపరి...

అక్టోబర్ 05, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి దశమి రాత్రి 02.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి రాత్రి 12.51 వరకు ఉపరి ఆశ్లేష యోగం శివ పగలు 12.50 వరకు ఉపరి సిద్ద కరణం వణజి పగలు 03.55 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News