డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఫైట్లు మనుసులు శేత్తుంటే మనం సూసి సంతోష పడేటోల్లం. ఇగిప్పుడు రోబోలు కూడా గా ఫైట్లే శేత్తానయి. రోబో హ్యూమనాయిడ్లతోటి గా ఫైట్ల పోటీని బహిరంగంగా పెట్టి జనం మస్తు ఎంజాయ్ శేత్తాండ్రు. గీ ముచ్చట గా చైనాల జరుగుతాంది.

అచ్చం గా మనుసుల్లెక్కనే రోబోలుంటయి. గ వాటికి కూడ ఓ బరి తయారు శేత్తరు. ఇగ గా బరిలోకి గా రోబోలను తోల్తరు. ఇగయ్యి ఒక్కొక్కటి ఎదురు పడి అచ్చం మనసుల్లెక్కనే తలపడ్తయి. ఎగిరెగిరి కొట్లాడుతయి. గట్లనే గా ఫైట్ల.. గవాటి తలలు, శేతులు, కాల్లు ఊడి పోయినా, గయి ఆగయి. కొట్లాడ్తనే ఉంటయి. గిదిప్పుడు చైనాల కొత్త ట్రెండంట. జనం కూడా ఎగబడి సూత్తాండ్రు. మరి, మీరూ సూత్తరా?

