తన భర్త వేధింపులు తట్టుకోలేక, బీహార్‌కు చెందిన ఓ మహిళ సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యంకు బానిసైన భర్తను వదిలి, తరచూ ఇంటికి వచ్చే లోన్ రికవరీ ఏజెంట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంద్ర కుమారి 2022లో నకుల్ శర్మను వివాహం చేసుకుంది. కానీ పెళ్లి తర్వాత నకుల్ పూర్తిగా మారిపోయాడు. మద్యం సేవిస్తూ, దురుసుగా ప్రవర్తిస్తూ, భార్యను తీవ్రంగా వేధించసాగాడు. ఈ పరిస్థితిని తట్టుకోలేక, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆమె నిర్ణయించింది. ఈ సమయంలో ఓ ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న పవన్ కుమార్ యాదవ్ పరిచయమయ్యాడు. లోన్ రికవరీ కోసం తరచూ ఇంటికి వచ్చే పవన్‌తో ఆమె స్నేహం పెరిగి ప్రేమగా మారింది. చివరికి ఫిబ్రవరి 11న ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ వివాహం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. భర్త వేధింపుల నుంచి బయటపడి, కొత్త జీవితాన్ని ప్రారంభించినందుకు ఇంద్ర సంతోషంగా ఉందని తెలుస్తోంది.

