యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు. ఏమైనా కట్టంలేని గదేనుల్లా స్మార్టుగా దొంగతనాలు శేత్తాండ్రు. గివీటిని కనిపెట్టేందుకే సీసీ టీవీలొచ్చినయి. ఇండ్లల్ల, దుకాన్లల్ల, బాయిలకాడ, ఏడ సూడు గియేనాయె? కనీ, గీ గీత కార్మికుడి లెక్కే యేరనుకోండ్రి.

గీ గీత కార్మికుడిడి యాదాద్రి బోనగిరి జిల్లా మోత్కూరు. గీ మద్దెల గాయినె గీసే సెట్టుకల్లుకు దొంగలు పడ్తాండ్రు. ఇగేం శేసినా దొంగలు పడ్తనే ఉన్నరు. ఏం శేయాల్నో పాలు పోలే. ఇగ గిదేం పని కాదని, గా తాటి శెట్టుకే సీసీ కెమెరా బిగిచ్చిండు. ఇగప్పటి నుండి గా శెట్టు కల్లుకు దొంగలు పడ్తలేరట. ఇగ గీ ముచ్చట ఈడియ తీసి పెట్టంగనే గా నెట్టింట్ల లచ్చల మంది సూత్తాండ్రు. ఇచ్చెంత్రం కాకపోతే, గీ ముచ్చటెట్లున్నది.

