Sunday, August 9, 2026
23.8 C
Hyderabad

ఆర్థిక నిర్వహణ లోపం.. దేశానికి శాపం!?

అమెరికా ప్రపంచంలో అత్యంత అప్పుల్లో, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశం కావడం నమ్మలేని నిజం. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాల్లో సంక్షోభాలను, దేశాల మధ్య యుద్ధాలను గుర్తిస్తే, అర్థం చేసుకుంటే, ఆర్థిక వ్యవస్థ ఎంత పరిణామాలకు దారితీస్తుందో తెలుస్తుంది.
ఆర్థిక వ్యవస్థ ఒక వలయం. సరిగ్గా నిర్వహించలేకపోతే అది విషవలయం. ఆదాయ, వ్యవయాలు, రాబడులు, పెట్టుబడులు, అవసరాలు, మన చుట్టూ ఉన్న దేశాలు, సంబంధాలు, ఎగుమతులు, దిగుమతులు, ఈ మొత్తంపై అవగాహన, నేర్పరితనం, ముందు చూపు, భవిష్యత్తు ఆలోచనలు, అవసరాలు, వాటిని తీర్చే మార్గాలు… ఇలా అనేక అంశాలపై పట్టుతో నడపాల్సిన వ్యవహారం. మన భారత సంస్కృతి పరంపరలో వస్తున్న కుటుంబ వ్యవస్థను పరిశీలిస్తే, ఆ బాధ్యతలు నిర్వర్తిస్తే, దేశ బాధ్యతలు కూడా తెలుస్తాయి. ఇదంతా తెలవడానికి పెద్దగా చదువక్కరలేదు. డిగ్రీలు, డాక్టరేట్లు కూడా అవసరంలేదు. అంతెందుకు సగటు భారతీయ మహిళను అడిగితే వీటిని బాగా అర్థం చేయగలదు. కుటుంబమైనా, రాష్ట్రమైనా, దేశమైనా అంతే.! మన మహిళల్లోని ఆర్థిక నిర్వహణ నేర్పరితనం, మన పాలకుల్లో కొరవడటం విషాదం!! ‘మార్గం అడుగు’ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

ఆర్థిక వ్యవస్థ ఒక వలయం. సరిగ్గా నిర్వహించలేకపోతే అది విషవలయం. ఆదాయ, వ్యవయాలు, రాబడులు, పెట్టుబడులు, అవసరాలు, మన చుట్టూ ఉన్న దేశాలు, వాటితో మన సంబంధాలు, ఎగుమతులు, దిగుమతులు, ఈ మొత్తంపై అవగాహన, నేర్పరితనం, ముందు చూపు, భవిష్యత్తు ఆలోచనలు, అవసరాలు, వాటిని తీర్చే మార్గాలు… ఇలా అనేక అంశాలపై పట్టుతో నడపాల్సిన వ్యవహారం. మన భారత సంస్కృతి పరంపరలో వస్తున్న కుటుంబ వ్యవస్థను పరిశీలిస్తే, ఆ బాధ్యతలు నిర్వర్తిస్తే, దేశ బాధ్యతలు కూడా తెలుస్తాయి. ఇదంతా తెలవడానికి పెద్దగా చదువక్కరలేదు. డిగ్రీలు, డాక్టరేట్లు కూడా అవసరంలేదు. అంతెందుకు సగటు భారతీయ మహిళను అడిగితే వీటిని బాగా అర్థం చేయగలదు. కుటుంబమైనా, రాష్ట్రమైనా, దేశమైనా అంతే. అయితే, దేశాన్ని పాలించే అధికారం వేరు. దాన్ని దక్కించుకోవడం వేరు. ఆ అధికారాన్ని నిలుపుకోవడం వేరు. దేశాన్ని స్వావలంబనగా నపడం వేరు. ఈ విభజనలు.. విభజించి, పాలించే మన పాలకులకు అంతగా తెలిసినట్లు లేదు. పైగా, అధికార అంధకారంలో కొట్టుకుపోతూ, ప్రతీది రాజకీయం చేయడం అలవాటు చేసుకున్నందునే ఈ ఆర్థిక అంతర్గత సంక్షోభాలు, ప్రపంచ దేశాలతో సంబంధాల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయం లాగే ప్రజల విలువైన ప్రాణాలు, జీవన స్థితిగతులతో ముడిపడి ఉన్న ఆర్థిక వ్యవస్థను కూడా చూడటం వల్లే ఆటవిక రాజ్యాలతో అనేక ఉత్పాదాలు వచ్చిపడుతున్నాయి. అందులో అమెరికా ఒకటి.
అలవి కాని హామీలివ్వడం, వాటిని నెరవేర్చేందుకు అప్పులు చేయడం, ఆ అప్పులను తీర్చేందుకు మరిన్ని అప్పులు తేవడం, కల్పిత, కల్పించుకున్న భయాలతో దేశరక్షణకు లెక్కలేనంత ఖర్చులు చేయడం, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం, హూంకరింపులు, ధిక్కరింపులు, బెదిరింపులకు దిగడం అమెరికాకే కాక, అన్ని ప్రపంచ దేశాలకు అలవాటుగా మారింది. అమెరికానే ప్రపంచంలో అత్యంత అప్పుల్లో, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశం కావడం నమ్మలేని నిజం. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాల్లో సంక్షోభాలను, దేశాల మధ్య యుద్ధాలను గుర్తిస్తే, అర్థం చేసుకుంటే, ఆర్థిక వ్యవస్థ ఎంత పరిణామాలకు దారితీస్తుందో తెలుస్తుంది.

మనదేశంలో ఉపాధి, ఉద్యోగవకాశాలు కరువై, రూపాయి విలువ పడిపోతూనే, డాలర్ విలువ పెరగడంతో సంపాదన వ్యామోహంలో అనేక మంది అమెరికా బాట పట్టారు. ఆ దేశ జనాభాలో రెండో అతి పెద్దదిగా మన జనాభా వాటా 15శాతంగా, ఐటీలో అత్యధికంగా 75శాతంగా, ఉంది. ఇదే అదనుగా, అమెరికా అధ్యక్షుడు ట్రంపు లేపుతున్న కంపు కారణంగా ఇండియా సహా, ప్రపంచ దేశాలు అనేక ఇబ్బందుల్లో పడుతున్నాయి. ఎంఎస్‌, ఎంబీఏలు చదివి ఉద్యోగాలు పొందానల్న వారి కలలపై ట్రంప్‌ నీళ్లు చట్టారు. ఇటీవల హెచ్‌-1బి వీసాలను వ్యాపారంగా మార్చడంతో ఇప్పుడు అమెరికా వెళ్ళి ఇక చదువుకోవడం కష్టంగా మారింది. అమెరికాలో చదివిన భారతీయలు ఉద్యోగాలు లేక అక్కడే మగ్గుతున్నారు. అటు ఉద్యోగాలు దొరక్క..బ్యాంకు రుణాలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. పోనీ దేశానికి వచ్చి ఇక్కడేమైనా చేద్దామా అంటే ఇక్కడా పరిస్థితి దారుణంగా ఉంది. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కనిపించడం లేదు. ఉన్న ఉద్యోగులను మెల్లగా తీసేస్తున్నారు.

ఇక ప్రభుత్వాల విధానాల ఫలితంగా నిరుద్యోగం పెరుగుతున్నది. ప్రైవేట్‌ పెట్టుబడులు తగ్గుతున్నవి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడటం ఎక్కువైంది. మన ప్రభుత్వాలు ఓటు బ్యాంక్‌ పథకాల్లో రాటుదేలాయి. విద్యా, ఉపాధి రంగాలను ప్రోత్సహించడం లేదు. విదేశాలపై ఆధారపడొద్దంటున్న ప్రధాని మోదీ, ఇక్కడ ఉపాధి, ఉద్యోగ రంగాలను ప్రోత్సహిస్తామన్న భరోసా ఇవ్వడం లేదు. రాజకీయ పార్టీలు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కేంద్రంగా గాకుండా, అధికార పీఠాలను నిలుపుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నాయి.

మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అమెరికా లాంటి దేశాలు ఆంక్షలు విధిస్తే అతలాకుతలం కావడం మినహా గత్యంతరం లేని దుర్భరంలో ఉన్నాం. కులవృత్తులకు అంతరిస్తున్నాయి. వ్యవసాయం, అనుబంధ రంగాలు కునారిల్లుతున్నయి. పన్నుల వసూళ్లపైనే దృష్టి సారిస్తున్నారు. నెపం ఎదుటి వాళ్ళపై నెట్టి తప్పించుకుంటున్నారు.

ఒకప్పుడు డాలర్ కంటే రూపాయి విలువ. ఎగుమతులకు ప్రాధాన్యం పెరగాలి. దిగుమతులకు కళ్లెం వేయాలి. ఆర్థికవృద్ధికి ఊతమిచ్చే చర్యలు ప్రకటించాలి. జీఎస్టీ తగ్గింపులతో కాదు. వస్తూత్పత్తి ధరలు దిగిరావాలి. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే వ్యవసాయ, వ్యవసాయోత్పత్తులు, పారిశ్రామిక రంగాల్ని బలపరచాలి. ఎన్డీఏ వచ్చాక పెట్టుబడి వ్యయాలను గణనీయంగా పెంచి ఆ లోటును పూడ్చింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగు తుండటం, అమెరికా వాణిజ్య యుద్ధ భయాలు, కరెన్సీ దారుణంగా పతనమవడం వంటి అంశాలు మన విదేశీ మారకపు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. రూపాయి క్షీణత ఇలాగే కొనసాగితే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే మన దేశానికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు. వాణిజ్యలోటు, కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణం పెరిగేందుకు రూపాయి పతనం పరోక్షంగా దోహదం చేసే అంశాలు. చమురు, పసిడి దిగుమతుల వ్యయాలు పెరిగితే, దేశ వాణిజ్య లోటు అధికమవుతుంది. విదేశీ ప్రయాణాలు, చదువుల ఖర్చులు భారమవుతాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచాల్సిన పరిస్థితి నెలకొంటుంది. రవాణా వ్యయాలు పెరిగి సరకులు ప్రియమవుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుంది. పారిశ్రామిక ప్రగతి మందగిస్తుంది. ఇది దేశ అభివృద్ధిని అడ్డుకుంటుంది. రూపాయి క్షీణిస్తే, విదేశీ మదుపర్లు దేశీయ మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తే, ఈక్విటీ మార్కెట్లు నష్టపోతాయి. ఇదో విషవలయంగా మారుతుంది.
ముందున్న ఈ సంక్షోభాన్ని మరచి ఈ మధ్య బీజేపీ, కాంగ్రెస్‌లు తమ హయాంలోనే వృద్ధిరేటు ఎక్కువని వాదులాడుకుంటున్నాయి. కానీ జరుగుతున్న అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, ఫలాల పంపకం ఏ రీతిన ఉన్నదో చూడటం లేదు. ఇలాగైతే మొత్తానికి ఇప్పట్లో ఆర్థికరంగం కోలుకునేలా కనిపించడం లేదు.

Latest News

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

సంయమనం కోల్పోతే రాజకీయ సంక్షోభమే!?|EDITORIAL

వ్యక్తిగత విమర్శలు తాత్కాలిక రాజకీయ ప్రచారానికి ఉపయోగపడవచ్చు. కానీ, దీర్ఘకాలంలో నాయకుడి విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. రాజకీయ వారసత్వం కేవలం కుటుంబ నేపథ్యంతోనే రాదు, హుందాతనంతో కూడిన నాయకత్వంతోనే నిలుస్తుంది. మాటలతో సంపాదించేది ప్రచారం...

ఆగస్టు 06, గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి మధ్యాహ్నం 03.39 వరకు ఉపరి నవమి నక్షత్రం భరణి సాయంత్రం 06.11 వరకు ఉపరి కృత్తిక యోగం గండ మధ్యాహ్నం 02.03 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 03.39వరకు ఉపరి తైతుల రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News