Friday, May 1, 2026
32.2 C
Hyderabad

రాహుల్ పరిపక్వ విపక్ష నేతేనా!?|EDITORIAL

భారత రాజకీయాల్లో విపక్ష నాయకత్వం ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత కీలకం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను సమీక్షించడం, ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం, అవసరమైన సూచనలు చేయడం, తద్వారా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం విపక్షం ప్రధాన బాధ్యతలు. ఈ నేపథ్యంలో భారత పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాత్రపై గత కొన్నేళ్లుగా తరచుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు, భారత విదేశాంగ విధానంపై చర్చలు, పార్లమెంటులో ఆయన ప్రసంగాల నేపథ్యంలో మరోసారి రాహుల్ నాయకత్వ పటిమ, పరిపక్వతపై చర్చ ప్రాధాన్యతను సంతరించుకుంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

భారత రాజకీయాల్లో విపక్ష నాయకత్వం ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత కీలకం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను సమీక్షించడం, ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం, అవసరమైన సూచనలు చేయడం, తద్వారా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం విపక్షం ప్రధాన బాధ్యతలు. ఈ నేపథ్యంలో భారత పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాత్రపై గత కొన్నేళ్లుగా తరచుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు, భారత విదేశాంగ విధానంపై చర్చలు, పార్లమెంటులో ఆయన ప్రసంగాల నేపథ్యంలో మరోసారి రాహుల్ నాయకత్వ పటిమ, పరిపక్వతపై చర్చ ప్రాధాన్యతను సంతరించుకుంది.

రాహుల్ గాంధీ రాజకీయ ప్రయాణం చాలా కాలం వరకు విమర్శల మధ్యే సాగింది. ఆయనను ప్రత్యర్థులు తరచూ అనుభవంలేని నాయకుడిగా, పప్పుగా, రాజకీయాల్లో పిల్లవాడిగా చిత్రీకరించడం అలవాటై పోయింది. కానీ, గత కొన్ని సంవత్సరాల్లో ఆయన రాజకీయ ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా చేసిన పాదయాత్రలు, ప్రజల సమస్యలపై ప్రత్యక్షంగా స్పందించడం, రాజకీయ చర్చల్లో సీరియస్‌గా పాల్గొనడం ఆయనకు ఒక కొత్త రాజకీయ ఇమేజ్‌ను తెచ్చి పెట్టాయి. అయినప్పటికీ, ఈ మార్పు పూర్తిస్థాయి పరిపక్వ నాయకత్వంగా మారిందా అన్నది ఇంకా చర్చనీయాంశంగానే ఉంది.

ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతల సందర్భంలో రాహుల్ వ్యాఖ్యలు ఆయన నాయకత్వ పటిమని మరోసారి ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుత ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి, యుద్ధ సమయంలో భారతదేశం ఎలా స్పందించాలి అనే అంశంలో ఆయన మానవతా దృక్పథాన్ని పాటించారు. సాధారణంగా భారత విదేశాంగ విధానం సమాన ధోరణిని అనుసరిస్తుంది. రాహుల్ గాంధీ కూడా హింసకు వ్యతిరేకంగా, పౌరుల ప్రాణనష్టం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. అయితే విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆయన వ్యాఖ్యలు కొన్నిసార్లు స్పష్టమైన విధాన ప్రత్యామ్నాయం చూపించకుండా సాధారణ నైతిక వ్యాఖ్యలకే పరిమితమయ్యాయి.

పార్లమెంట్‌లో ఆయన పాత్రను పరిశీలిస్తే మరింత సంక్లిష్టమైన చిత్రం కనిపిస్తుంది. లోక్ సభలో చేసిన కొన్ని ప్రసంగాలు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ప్రశ్నించాయి. ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, కార్పొరేట్ ప్రభావం వంటి అంశాలపై ఆయన పదేపదే విమర్శలు చేశారు. ఈ దృక్కోణంలో చూస్తే ఆయన విపక్ష ధర్మాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది.

విమర్శనాత్మకంగా చూస్తే కొన్ని పరిమితులు కూడా కనిపిస్తాయి. ఒక పరిపక్వ విపక్ష నాయకుడు కేవలం విమర్శించడం మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ విధానాలను కూడా స్పష్టంగా ప్రతిపాదించాలి. ఈ విషయంలో రాహుల్ గాంధీ ఇంకా పూర్తి స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. రాహుల్ ప్రసంగాలు భావోద్వేగపూరితంగా ఉంటాయి, కానీ వాటిని ఆచరణాత్మక విధానాలుగా మలచడంలో స్పష్టత కొన్నిసార్లు తక్కువగా కనిపిస్తోంది.

అదేవిధంగా రాజకీయ కమ్యూనికేషన్‌లో కూడా ఆయనకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని విమర్శించే సమయంలో ఉపయోగించే ఉపమానాలు లేదా వ్యాఖ్యలు రాజకీయ చర్చను ఘర్షణలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. విమర్శను కచ్చితమైన వాస్తవాల ఆధారంగా చేయగలగాలి. రాజకీయ, ఎత్తులు వేసే, వాక్ చాతుర్యం, వాగ్ధాటి కళల్లో ఆయన ఇంకా ఆరితేరాల్సి ఉంది. ఈ దిశగా ఆయన ఇంకా తన శైలిని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది.

అలాగని, రాహుల్ గాంధీ పాత్రను పూర్తిగా తక్కువగా అంచనా వేయలేం. ప్రధాన అధికార పక్షం బలంగా ఉండి, విపక్ష రాజకీయాలు బలహీనంగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రధాన స్వరంగా ఎదిగాడు. సామాజిక అసమానతలు, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రత వంటి అంశాలను రాజకీయ చర్చల్లో ఎజెండాగా తెచ్చే ప్రయత్నం చేశాడు.

అయితే, రాహుల్ గాంధీ వయసు, రాజకీయ అనుభవం, నేపథ్యం, వ్యక్తిత్వం, దూకుడు శైలి రీత్యా ఆయనింకా రాజకీయ ప్రయాణం ఒక పరిణామ ప్రక్రియలో ఉందని చెప్పడమే సమంజసం. గతంతో పోలిస్తే ఆయన రాజకీయ చైతన్యం, ప్రజా సమస్యలపై దృష్టి పెరిగినట్టు కనిపిస్తోంది. విమర్శల సూటి, స్థాయి, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, సూచనల సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంది.

భారత ప్రజాస్వామ్యంలో బలమైన ప్రభుత్వం ఎంత అవసరమో, అంతకంటే బలమైన విపక్షం కూడా అవసరం. అలాంటి విపక్షానికి నాయకత్వం వహించాలంటే ధైర్యం, స్పష్టత, విధాన దృష్టి చాలా కీలకం. ఈ లక్షణాలను జన్మత పునికి పుచ్చుకోవడం అదరికీ సాధ్యం కాదు, కానీ నేర్చుకోవడం కష్టమేమీ కాదు. రాహుల్ అపారమైన రాజకీయ నాయకత్వ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. అంతకంటే స్వాతంత్ర్యోద్యమ చరిత్ర ఉన్న పురాతన పార్టీకి పార్లమెంటులో నాయకత్వం వహిస్తున్నారు. తాను నడవడమే కాదు, నలుగురుని తన వెంట, మొత్తం ప్రజల్ని తన వెంటే నడపుగోలిగే నాయకత్వ లక్షణాల్ని రాహుల్ ఎంతమేరకు సాధించగలడనేదే ఆయనపై జరిగే ఈ చర్చకు సరైన సమాధానం కాగలదు.

Latest News

పందేరం సందేశమేనా?|TELANGANA|V.HANUMANTHA RAO|BC

వీహెచ్ కు సలహా పదవి..|V.HANUMANTHA RAO|ADVISOR బీసీలకు సానుకూల సంకేతమా?|BC సీనియర్ల అనుభవానికి గుర్తింపా?|SENIOR LEADERS పార్టీకి, ప్రభుత్వానికి మేలు చేసేనా?|PARTY|GOVERNMENT సీఎం పదవి మరింత పదిలమయ్యేనా?|CM కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు సలహాదారుగా పదవివ్వడం పార్టీలో సీనియార్టీని గౌరవించడమా?...

ఇటికెలకు నీల్లు కొడితే, గోడలు గట్టిగుంటయ్!?|ADUGU TRENDS

ఇల్లు కడితే ఏం శేత్తం? గోడలు కట్టినంక నీల్లు బాగా పడ్తం. కనీ, ఇటికెలకు నీల్లు పట్టినంకనే గోడలు కట్టాల్నట! గట్ల కడితే గా ఇటికెలు గట్టిపడి గోడలు నెర్రెలు బాయయట. గంతే...

శ్రమైక జీవన సౌందర్యం-మే డే!|EDITORIAL

“శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాద్యములు సంరావిస్తూ, వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక...

01-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం వైశాఖ పూర్ణిమ మేడే  తిధి శు పౌర్ణమి రాత్రి 09.15 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం స్వాతి రాత్రి 03.10 వరకు ఉపరి విశాఖ యోగం సిద్ది రాత్రి 08.13 వరకు ఉపరి వ్యతీపాత కరణం భద్ర...

అదిరింది..గీ బొంగులతో పందిరి!?|ADUGU TRENDS

సల్లగుండాలె! సూడ్డానికి మంచిగుండాలె! ఏం శేయాలె? గిట్ల ఆలోసించిన గీ అన్నకు భలే ఐడియా వచ్చింది. గదేందో సూత్తాం పదండ్రి. అసలే ఎండా కాలం.. ఆపైన వానా కాలం. ఇగ తర్వాత సలికాలమే అనుకోండ్లి!...

కవిత్వాన్ని భూమార్గం పట్టించిన మహాకవి!|EDITORIAL

సమాజాన్ని మేల్కొలిపే శక్తి సాహిత్యానికి ఉంది. ఆ శక్తికి రూపం ఇచ్చినవారు కవులు. అలాంటి కవుల్లో అగ్రగణ్యుడు శ్రీరంగం శ్రీనివాసరావు, అంటే “శ్రీశ్రీ”. ఆయన కవిత్వం కేవలం సాహిత్యానికే పరిమితం కాలేదు. అది...

30-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 08.06 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం చిత్త రాత్రి 01.21 వరకు ఉపరి స్వాతి యోగం వజ్ర రాత్రి 08.23 వరకు ఉపరి సిద్ది కరణం గరజి ఉదయం...

భూకంపం పుట్టిస్తున్న భూ సేకరణ!|EDITORIAL

అభివృద్ధి ప్రజల సహకారంతో మాత్రమే సుస్థిరంగా ఉంటుంది. రైతులను భాగస్వాములుగా కాకుండా బాధితులుగా మార్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండవు. అమరావతి వంటి మహత్తర ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే, అక్కడి రైతుల నమ్మకం,...

29-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 07.30 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం హస్త రాత్రి 12.00 వరకు ఉపరి చిత్త యోగం హర్షణ రాత్రి 08.52 వరకు ఉపరి వజ్ర కరణం కౌలవ ఉదయం...

ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్! హార్మూజ్ ని తెరుస్తాం! కానీ,

అమెరికాకు ఇరాన్ రెండు షరతులు అమెరికా-ఇరాన్ చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఇరాన్ కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. హర్మూజ్ జలసంధిని తెరిచి నౌకల రాకపోకలకు అనుమతిస్తామని తెలిపింది. అయితే అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని...

శిన్న శిట్కాతోటి కొవ్వు ఖతం!?|ADUGU TRENDS

ఇగిప్పుడు అందరి బాధా గా పెయ్యిల శెడు కొవ్వే! మనం తినే ఆహారపు అలవాట్లు, బతుకు తెరువులు బాగా మారినయి. జీవన శైలి గూడ మస్తుగ మారింది. ఇగ గిదీంతోటి పెయ్యిల అట్టు...

కొంగ జపం శాంతి తపం!?|EDITORIAL

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిజమేనా? అసలా చర్చలు దౌత్య నాటకమా? నిజమైన పరిష్కార ప్రయత్నమా? మధ్యప్రాచ్యంలోని తాజా ఉద్రిక్తతలను పరిశీలిస్తే ఈ ప్రశ్న తలెత్తక మానది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News