ఛత్తీస్ గఢ్ అడవులు మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లి పోయాయి. బీజపూర్లో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం తెల్లవరుజామున భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. బీజాపూర్ నేషనల్ పార్కులో కూంబింగ్ చేపట్టిన డీఆర్జీ(DRG), ఎస్టీఎఫ్(STF) దళాలకు మావోలు ఎదురవగా.. ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 12 మంది మావోయిస్టులు అక్కడిక్కడే హతం 5.. పోలీసులకు ఎవరికైనా గాయాలు అయ్యాయా అనేది తెలియరాలేదు. కాగా కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ భారీ ఎన్కౌంటర్ పై పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.

