మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన నితిన్ భార్య వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ నోట్లో భార్య హర్షతో పాటు అత్త, భార్య సోదరీమణులు కలిసి తాను విడాకులు తీసుకున్నప్పటికీ వేధింపులు ఆగలేదని తెలిపాడు. మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని, వీటిని సవరించాలని ప్రభుత్వాన్ని కోరాడు. యువకులు పెళ్లికి ముందు జాగ్రత్తగా అగ్రిమెంట్ చేసుకోవాలని సూచించాడు. ఈ ఘటన పెళ్లితో సతమతమవుతున్న యువతలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

