తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు అయోధ్య రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ చరిత్రలో తొలిసారిగా శ్రీ వేంకటేశ్వర స్వామి తరఫున రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించటం విశేషం. బీఆర్ నాయుడు దంపతులు నిన్న రాత్రి అయోధ్యకు చేరుకుని సరయు నది ఒడ్డున జరిగిన హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ ఉదయం అయోధ్యలోని రామజన్మభూమి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాముడి విగ్రహానికి టీటీడీ తరఫున అందజేసిన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ ఆచారం దైవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా నిలుస్తుందని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మన సంస్కృతి, సాంప్రదాయాల మధ్య అనుబంధాన్ని బలపరచడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా టీటీడీ సేవలను ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ఇది మంచి అవకాశం అన్నారు.

