బెంగళూరులో 8 నెలల శిశువుకు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (హెచ్‌ఎంపీవీ) పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇది దేశంలోనే మొదటి కేసు. వైరస్ కారణంగా శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, వృద్దులపై ఇది ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

