గచ్చిబౌలిలోని ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో హైడ్రా సిబ్బంది అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం ప్రారంభించారు. ఖాజాగూడ సర్వే నంబరు 18 ఎఫ్టీఎల్ మరియు బఫర్‌జోన్‌లోని 9 ఎకరాలు, 7 గుంటల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చినట్లు అధికారులు తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా చెరువును పరిశీలించి, స్థానికుల ఫిర్యాదుల మేరకు 20కి పైగా దుకాణాలను తొలగించారు. ఈ కూల్చివేతలకు సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, 24 గంటల్లోనే దుకాణాలు కూల్చేయడంపై వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


