Saturday, September 19, 2026
27.3 C
Hyderabad

PARTY|పార్టీ POST|పదవికి RESPECT|గౌరవం, బాధ్యతా భావంతో కృషి చేయాలి

GANDHI BHAVAN| గాంధీభవన్ PCC| పిసిసి సమావేశంలో CM|సీఎం REVANTH REDDY| రేవంత్ రెడ్డి

గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి మరియు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ పిసిసి కమిటీ సభ్యులకు కీలక దిశానిర్దేశం చేశారు. పార్టీ భవిష్యత్తు, నాయకత్వ వికాసం, రాష్ట్ర ప్రగతిపై ఆయన స్పష్టమైన విధానాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రాన్ని దేశంలోనే మోడల్‌గా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో నూతన పాలనతో ప్రజలకు సంక్షేమ పథకాల ఫలితాలు నేరుగా అందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చి కుల గణన చేపట్టేలా చేయడంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయవంతమైందని గుర్తు చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో గొప్ప ప్రగతిని సాధించాం. ఇదంతా కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమైంది. ప్రజలు నమ్మిన పార్టీగా మళ్లీ ఎన్నికల వేళ తమ ఆశలు మాతో పెట్టుకుంటారు అని సీఎం వ్యాఖ్యానించారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 45 లక్షల మందిని క్రియాశీలక సభ్యులుగా నమోదు చేయడమే కాకుండా, YOUTH CONGRESS| యూత్ కాంగ్రెస్, NSUI| ఎన్ఎస్యూఐ, జిల్లా అధ్యక్షులుగా ఉన్న వారిలో చాలామందికి ప్రభుత్వ పదవులు వచ్చాయని తెలిపారు. ఇది పార్టీ కార్యకర్తలకు విలువనిచ్చే విధానానికి నిదర్శనమన్నారు.

పార్టీ పదవులు సాధించిన ప్రతి ఒక్కరూ అవి క్యాజువల్‌గా తీసుకోకూడదు. అవి మీకిచ్చే గౌరవానికి ప్రతీకలు. రాజకీయ జీవితంలో ఎదుగుదలకు ఇవే బలం. ఇప్పటి నుంచే గ్రామాలకు వెళ్లి ప్రజల మధ్య ఉండాలి. వారి సమస్యలు తెలుసుకోవాలి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, పార్టీ విజయంలో ఇదే కీలకమవుతుంది. అందరూ సమన్వయంతో పనిచేస్తేనే నాయకత్వం గుర్తింపు ఇస్తుంది అని సూచించారు.

రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరగబోతున్న నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల విధానం, జమిలి ఎన్నికల ప్రభావం పార్టీ వ్యవస్థపై ఉండే అవకాశాన్ని సీఎం వివరించారు. 2029 ఎన్నికలు నూతన నాయకత్వానికి వేదికగా మారాలనీ, ఇప్పటి నుంచే ప్రతి నాయకుడు ప్రణాళికతో కష్టపడాలనీ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం. అందరూ కలిసికట్టుగా పనిచేసి మళ్లీ రెండోసారి అధికారంలోకి రావాలి. మనకు పార్టీగా ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది – ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ సామాజిక న్యాయాన్ని సమర్థించడమే. ఈ దిశగా ప్రతి కార్యకర్త నిబద్ధతతో ముందుకు సాగాలి అని సీఎం స్పష్టం చేశారు.

అలాగే, పార్టీ జాతీయ అధ్యక్షుడు MALLIKHARJUN KHARGE| మల్లికార్జున ఖర్గే సుదీర్ఘకాలం ప్రజా ప్రతినిధిగా సేవలందించిన అరుదైన ఘనత సాధించారనీ, వారిని స్ఫూర్తిగా తీసుకుని కొత్త తరం నాయకులు అభివృద్ధి చెందాలని సీఎం సూచించారు. పార్టీ పదవులతోనే గుర్తింపు లభిస్తుందని, వాటికి తగిన గౌరవం, బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పునరుద్ఘాటించారు.

Latest News

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News