– అప్పుడు, SUB COMMITTEE|సబ్ కమిటీ కూడా వేశారు!
– CARPORATION|కార్పొరేషన్ ఏర్పాటు చేశారు!!
– CABINET|కేబినెట్ నిర్ణయాల మేరకే పనులు చేశారు!!!
– KALESHWARAM|కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల జవాబులు
– లోపల ఒకటి బయట మరొకటి చెప్పారా?
– TELANGANA|తెలంగాణ ప్రజల అనుమానాలు!?
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై KCR|కేసీఆర్ గుండెల్లో ఈటెలు దింపుతారనుకున్న EATALA RAJENDER|ఈటల మాటలు మాత్రమే చెప్పి వచ్చారా? కమిషన్ ముందు ఒకలా చెప్పి, బయట మరోలా మాట్లాడారా? చిక్కడు దొరకడులా సమాధానాలిచ్చారా? కమిషన్ కు తాను దొరకకుండా, కేసీఆర్ ను దొరక బుచ్చకుండా, హరీశ్ రావు కు ఎలాంటి హానీ జరగకుండా, అత్యంత జాగ్రత్తగా, తెలివిగా, లీగల్ గా కమిషన్ కు జవాబిచ్చారా? కమిషన్ ఎత్తుకు పై ఎత్తుగా జవాబిచ్చారా? ఇటు కాళేశ్వరం అవినీతి తనకంటకుండా అటు మరెవ్వరికీ అంటనివ్వకుండా, రాజకీయంగా తన భవిష్యత్తును మరింత భద్రం చేసుకున్నారా? కమిషన్ వేసిన, ప్రశ్నలు ఈటల చెప్పిన జవాబుల తీరును పరిశీలించినా, విచారణ అనంతరం బయటకు వచ్చిన ఈటల మాటలను విశ్లేషించినా అవుననే అనిపిస్తున్నది. పైగా తన నిజాయితీని, బీజేపీ నిబద్ధతను సమర్ధించుకుంటూ, కమిషన్ నివేదికను బటయ పెట్టాలని ఈటల చేసిన డిమాండ్ కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేదే. అయితే, ఎక్కడా బీఆర్ఎస్ కు గానీ, అప్పటి ప్రభుత్వానికి గానీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా జాగ్రత్త పడినట్లు ఆయన మాటలే అర్థం చేస్తున్నాయి. ఇవన్నీ ఆయన HARISH RAO|హరీశ్ రావుతో భేటీ అయింది నిజమేనన్నట్లు, పెద్దాయన డైరెక్షన్ లోనే నడుచుకున్నట్లు, బీఆర్ఎస్ తో అంటకాగినట్లు చెప్పకనే చెబుతున్నాయి.
‘‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి… అన్యుల మనముల్ నొప్పించక… తానొవ్వక…’’ అన్నట్లుగా అత్యంత ధన్యుడిగా కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు సమాధానాలిచ్చి బయట పడ్డారు మాజీ మంత్రి, ప్రస్తుత మల్కాజీగిరి ఎంపీఈటల రాజేందర్. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు 113వ సాక్షిగా మాజీ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం హాజరయ్యారు. 40 నిమిషాల పాటు విచారణ సాగింది. బ్యారేజీల నిర్మాణం, కాలేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్‌పై మొత్తం 19 ప్రశ్నలను కమిషన్ ఈటలకు సంధించింది. కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ ను ఎక్స్ పర్ట్, టెక్నికల్, సబ్ కమిటీల నిర్ణయాలకు అంటగట్టి, ప్రాజెక్టు డిపిఆర్, నిర్మాణం బాధ్యతలని కేబినెట్ కి, తానే ఆర్థిక మంత్రినైనప్పటికీ, ఆ బాధ్యత తనకు లేనే లేదని చెప్పి ఈటల తప్పించుకున్నారు. ఇదే సమయంలో అప్పటి ప్రభుత్వాన్ని, తనకు మంత్రి పదవినిచ్చిన కేసీఆర్ ని, హరీశ్ రావులని కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జవాబులిచ్చి తప్పించేశారు.
క్యాబినెట్ నిర్ణయాల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేశారని ఈటెల చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్‌కు సంబంధం లేదని, కార్పొరేషన్ పూర్తిగా ఇరిగేషన్ శాఖ పరిధిలో పని చేసిందని అన్నారు. తుమ్మడి హట్టి దగ్గర కట్టాల్సిన బ్యారేజీని కాదని, టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు.. కేబినెట్ నిర్ణయం తీసుకుందని సమాధానం ఇచ్చారు. అలాగే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది. కేబినెటేనన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డిజైన్లు, నిర్మాణంతో సంబంధం ఉందా? అంటే తనకేం సంబంధం లేదని చెప్పానన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్‌పై అధికారం ఉండేదా అంటే తనకు ఎలాంటి అధికారం లేదని చెప్పినట్లు తెలిపారు. కాళేశ్వరం నిర్మాణం క్వాలిటీ గురించి ఇంజనీర్లు చూసుకోవాలని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ నాయకత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశారు, సబ్ కమిటీ, సీడబ్ల్యూసీ రిపోర్ట్ ఆర్థిక శాఖ ముందు పెట్టారని తెలిపారు.
మొదట రూ.63వేల కోట్ల అంచనాతో ప్రారంభం అయితే.. రైతుల డిమాండ్ మేరకు రూ.82 వేల కోట్లకు పోయిందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 150 ఫీట్ల ఎత్తు నుంచి 148 ఫీట్లకు కుదించామన్నారు.
విచారణ తర్వాత బయటకు వచ్చిన ఈటల మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ అని ఆయనే చెప్పుకున్నారని, ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ఆనాటి ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై నిర్ణయం తీసుకుంది కేసీఆర్ అని, అప్పుడు ఆయనే బాస్ అన్నారు.
మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పాప పంకిలంలోఈటల తాను ఇరుక్కోకుండా, అప్పటి ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావును ఇరికించకుండా అత్యంత జాగ్రత్తగా సమాధానాలు చెప్పినట్లుగా తేలిపోయింది. పైగా, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను త్వరగా బయటపెట్టాలని, నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు. అప్పటి దాకా ఊరుకునేది లేదని తన రాజకీయ పరిణతిని ప్రదర్శించారు. అయితే 25 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నట్లు తెలిపారు. మరి పార్టీలు మారడం ఏ విలువల కిందకు వస్తుందో ఆయనే చెప్పాలి. ‘మా బతుకులో నిబద్ధతతో ఉంది… నా గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా. కొందరు బట్టకాల్చి మీదేస్తే నాకేమీ కాదు’ అని కూడా అన్నారు. బహుషా తాను కమిషన్ ఎదుట చెప్పిన జవాబులపై వచ్చే విమర్శలను కూడా ఈటల ముందే ఊహించినట్లున్నారు.

