ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభం
ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో పెద్ద వంగర మండలం, చిన్న వంగరలో, తొర్రూరు మండలం, నాంచారి మాడురులో, రాయపర్తి మండల కేంద్రంలో, పాలకుర్తి మండలం, శాతపురంలో, కొడకండ్ల మండలం, ఏడునూతులలో, దేవరుప్పుల మండలం, నీర్మాల తదితర గ్రామాల్లో ఉచిత సన్న బియ్యం పథక పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు అందించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. పేద ప్రజలు ఆకలితో బాధపడకుండా, వారి జీవిత స్థాయిని మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ పథకంను మన ఇందిరమ్మ పాలనలో సీఎం రేవంత్ అన్న అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

