తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ (AICC) అధినాయకులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలపై పలు కీలక అంశాలు చర్చించనున్నారు. అలాగే, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు మంత్రులపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. గురువారం హైదరాబాద్లో జరిగిన సీఎల్పీ సమావేశంలో కూడా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలపైనే చర్చించినట్లు సమాచారం.

