బీసీసీఐ సెక్రటరీ పదవికి దేవజిత్ సైకియా ఎంపిక లాంఛనమైంది. డిసెంబర్ 1న జై షా ఐసీసీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన తరువాత, సైకియా తాత్కాలిక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. జనవరి 4 సాయంత్రం 4 గంటల గడువు ముగిసేలోపు మరెవరూ నామినేషన్లు వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. అలాగే, ట్రెజరర్ పదవికి ఛత్తీస్గఢ్ క్రికెట్ సంఘం సభ్యుడు ప్రభుతేజ్ భాటియా ఎంపిక కాబోతున్నారు. మహారాష్ట్ర మంత్రి ఆశిష్ శెలర్ పదవి స్వీకరించడంతో ట్రెజరర్ స్థానంలో ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ ఎన్నికల్లో పెద్దగా పోటీ లేకుండా కీలక పదవుల భర్తీ పూర్తికానుంది.

