
కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు చెందిన బద్రి, భర్త శ్రీను స్థానికుల సహకారంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో కాకర్ల సర్పంచ్ పదవికి పోటీ చేసి 506 ఓట్లు సాధించినప్పటికీ ఓటమి పాలైన ఆమె, ఈసారి ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకంతో ముందుకు వచ్చారు. నామినేషన్ ఫీజు కోసం జోలె పట్టిన బద్రికి గ్రామ ప్రజలు స్పందించి రూ.3 వేల వరకు అందజేశారు. సర్పంచ్‌గా గెలిచే అవకాశం కల్పిస్తే గ్రామ అభివృద్ధికి నిస్వార్థంగా కృషి చేస్తానని బద్రి ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు.

