Friday, April 10, 2026
36.2 C
Hyderabad

పిచ్చోడి చేతిలో రాయిలా.. ట్రంప్‌ నిర్ణయాలు!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేతిలో అధికారం.. పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఆయనే తెలియని అయోమయం నెలకొంది. ట్రంప్ నిర్ణయాలతో అమెరికన్లే ఆందోళన చెందుతున్నారు. ఎందుకు ఓటేశామా? అని అమెరికన్ల తో పాటు ఎన్నారైలు కూడా నెత్తీనోరు మొత్తుకుంటున్నారు. ట్రంప్ నిర్ణయాలతో విదేశీయులతో పాటు, అమెరికన్లు కూడా తీవ్ర ప్రభావానికి లోనవుతున్నారు. అమెరికాలోని విదేశీయులపై ఆంక్షలు, సుంకాల వల్ల అమెరికా ఆర్థిక పరిస్థితి మెరగవడం కంటే ప్రతిష్ట కూడా దిగజారిపోతోంది. ఎప్పుడు మాంద్యం ముంచుకొస్తుందో అన్న భయం వెన్నాడుతోంది. తాజాగా హెచ్‌1 బి వీసాలపై ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై టెక్ కంపెనీలు సైతం ఆందోళన చెందుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన నాటి నుంచి భారత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారీ పన్నులతో భారత ఎగుమతులను దెబ్బకొట్టిన ట్రంప్‌, తాజాగా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు గట్టి షాకిచ్చారు. హెచ్‌-1బీ వీసా దరఖాస్తు వార్షిక రుసుమును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులిచ్చారు. ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌, చైనాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ఉత్తర్వు ప్రకారం అమెరికా వేదికగా పని చేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవాలంటే ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాలి. ఇది అమలు సాధ్యమా? కాదా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

అయితే ట్రంప్‌ టారిఫ్‌ యుద్ధం కారణంగా అమెరికాలో ఉద్యోగావకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి. అమెరికా కార్మిక శాఖ గణాంకాల ప్రకారం. గత నెలలో వ్యవసాయేతర ఉద్యోగ నియామకాలు అంచనాల కంటే తగ్గి 22 వేలకు పరిమితమయ్యాయి. అదే సమయంలో నిరుద్యోగిత రేటు- 4.2 శాతం నుంచి 4.3 శాతానికి పెరిగింది. అంతేకాదు, మే, జూన్‌ నెలలకు విడుదల చేసిన ఉద్యోగ గణాంక అంచనాలను కూడా భారీగా తగ్గించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉందనడానికి ఇది సంకేతమని విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్‌ సుంకాలు అమెరికన్‌ కార్పొరేట్‌ కంపెనీల లాభాలపైనా ప్రభావం చూపనున్నాయని, దాంతో కంపెనీలు వ్యయ నియంత్రణపై దృష్టి సారిస్తాయని, పర్యవసానంగా అక్కడి జాబ్‌ మార్కెట్‌ మరింత బలహీనపడే అవకాశాలు న్నాయని నిపుణులు వివరించారు.

అమెరికాకు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని ప్రముఖ ఆర్థిక రేటింగ్‌ కంపెనీ మూడీస్‌ చీఫ్‌ మార్క్‌ జాండీ హెచ్చరించారు. ట్రంప్‌ తీసుకుంటున్న విధాన నిర్ణయాలే ఇందుకు కారణమని ఆరోపించారు. టారిఫ్‌లు ఆయా దేశాలతో పాటు- అమెరికాపైనా ప్రభావం చూపిస్తాయని, వలస విధానం ఉద్యోగ నియామకాలను నెమ్మదించేలా చేసిందని చెప్పారు. ఫెడరల్‌ రిజర్వ్‌ విషయంలో ట్రంప్‌ నిర్ణయాల ప్రభావం వ్యాపార రంగంపై భారీగా ఉందని, పెట్టుబడులు మందగించాయని వివరించారు. వీటన్నింటి ఫలితంగా అమెరికా ఆర్థికవృద్ధి నెమ్మదించడంతో పాటు- ద్రవ్యోల్బణం పెరుగుతోందని జాడీ ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే, ఆర్థిక మందగమనం లక్షణాలు ఇంకా బయటపడనప్పటికీ నిర్మాణ రంగంతోపాటు, ఉత్పాదక రంగంలో సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా మదుపరులను జాడీ హెచ్చరిస్తూ, ఆర్థిక మాంద్యంలో ఏ స్టాక్‌ కూడా సురక్షితం కాదని సూచించారు. యూఎస్‌ జీడీపీలో మూడోవంతు అంటే 33.33 శాతం ఇప్పటికే తిరోగమనంలోకి జారుకుందని తెలిపారు. రాష్టాల్రవారీగా చూస్తే, వ్యోమింగ్‌, మోంటానా, మిన్నెసోటా, మిస్సిస్సిప్పీ, కాన్సాస్‌, మసాచుసెట్స్ కు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందన్నారు.
ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా కోతపెట్టడంతో వాషింగ్టన్‌ డీసీ కూడా ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటోందని అన్నారు. 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనావేసిన ఆర్థికవేత్తల్లో జాండీ ఒకరు. ఆ సంక్షోభం అమెరికాతో పాటు మొత్తం ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి విదితమే. అమెరికాలో ధరలు, ముఖ్యంగా నిత్యావసరాల రేట్లు మళ్లీ పెరుగుతున్నా యని.. త్వరలోనే అందుకోలేని స్థాయికి ధరలు ఎగబాకవచ్చని జాండీ అన్నారు. తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. ధరాభారం కారణంగా అమెరికన్ల కొనుగోలు శక్తి కూడా తగ్గిందని, వినియోగదారుల వ్యయ వృద్ధి 2008-09 ఆర్థిక సంక్షోభ కాలం నాటి కనిష్ఠ స్థాయికి జారుకుందన్నారు. ఈ జూలై లో అమెరికాలో వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మరో 0.2 శాతం పెరిగి 2.7 శాతానికి చేరుకుంది. వచ్చే ఏడాదికాలంలో సూచీ 4 శాతానికి ఎగబాకవచ్చని జాండీ అంచనా వేశారు. తత్ఫలితంగా అమెరికన్ల కొనుగోలు శక్తి మరింత తగ్గిపోవచ్చని జాండీ వివరించారు.

వరుసగా రెండు తైమ్రాసికాల పాటు జీడీపీ వృద్ధి రేటు క్షీణిస్తే ఆ దేశం ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లు గా పరిగణిస్తారు. ట్రంప్‌ సుంకాల యుద్ధం ఫలితంగా … ఈ ఏడాది తొలి తైమ్రాసికం జనవరి-మార్చి లో అమెరికా జీడీపీ 0.50 శాతం క్షీణించగా.. రెండో తైమ్రాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో మాత్రం 3.3 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది. ప్రస్తుతం అమెరికా పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టబోయినట్లుగా ఉంది. పెరుగుతున్న ధరలు, సుంకాలతో పెరిగిన వాణిజ్య అనిశ్చితి, తగ్గుతున్న కొనుగోళ్లు మున్ముందు తైమ్రాసికాల్లో ఆ దేశ జీడీపీని మాంద్యంలోకి నెట్టవచ్చునని తెలుస్తోంది.

తాజా నిర్ణయాలు మరింత సంక్షోభానికి కారణం అవుతాయని అంటున్నారు. విదేశ నిపుణులు ముఖ్యంగా భారతీయులు వెళితే అమెరికాలో పనిచేసే వారు కరువవుతారని ఆందోళన చెందుతున్నారు. అయితే ట్రంప్‌ నిర్ణయాలను అక్కడి చట్టాలు అడ్డుకుంటాయా లేదా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News