Thursday, September 24, 2026
25.8 C
Hyderabad

ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మోసం!?|EDITORIAL

జీఎస్టీ సంక్లిష్టలతో ఏళ్ల తరబడి ప్రజలను పీల్చి పిప్పి చేసి, ఇప్పుడు అట్టహాసంగా తగ్గించడం ముమ్మాటికీ రాజకీయమే. భారీ మొత్తంలో పన్నులు తగ్గాయని, సామాన్యులు పండగ చేసుకోవంటున్న ప్రగల్బాల ఫలితాలు సామాన్యులకు అందడం లేదు. దసరా, దీపావళి పండగ సీజన్‌ను ‘జీఎస్టీ సేవింగ్స్‌ ఫెస్టివల్‌’గా ప్రధాని అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వం మోదీని అభినందిస్తూ అసెంబ్లీ ఉభయ సభల్లోనూ తీర్మానాలు చేసింది. జీఎస్టీని ప్రతిపక్షాలు గతంలోనే ‘గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్’ గా అభివర్ణించాయి.

ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.55 లక్షల కోట్లు గత ఏడు సంవత్సరాల్లో జీఎస్టీ ద్వారా మోదీ ప్రజల మూలుగలు పీల్చారు. ప్రజల ప్రయోజనాలు ఎలా ఉన్నప్పటికీ కార్పొరేట్ల కోసం, దేశీయ మార్కెట్‌ను పెంచడం కోసం మాత్రమే జీఎస్టీని తగ్గించక తప్పనిస్థితి ఏర్పడింది. దీనికితోడు చుట్టుపక్కల దేశాల్లో ప్రజల్లో పెల్లుబికిన తిరుగుబాట్లు గమనించిన ఏలినవారికి వెన్నులో వణుకు పుట్టింది. చివరకు కార్పోరేట్లు సూచనల మేరకే తగ్గింపులు జరిగాయన్నదీ, తమపై ప్రేమతో కాదనీ ప్రజలకు అర్థం కావడానికి మరికొంత సమయం పట్టొచ్చు. ‘మార్గం అడుగు’ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ 

పెంచిన పన్నులు తగ్గిస్తే అవి సంస్కరణలు అవుతాయా? తనకు తానే ఏకపక్షంగా పన్నులు పెంచి, మళ్ళీ వాటిని తగ్గించి సంస్కరణలుగా ప్రచారం చేసుకోవడం కేంద్రంలోని ఏన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకే చెల్లింది. నిజానికి అది పన్నుల సవరింపు మాత్రమే! ఇప్పటికే ఉన్న వ్యవస్థ లేదా ప్రక్రియలో తప్పులు, అవకతవకలు లేదా అసంతృప్తికరమైన అంశాలను మెరుగుపరచడం లేదా సవరించడాన్ని సంస్కరణ అనవచ్చు. జీఎస్టీ మార్పులు సంస్కరణ అంటే అంతకుముందు జీఎస్టీని పెంచడాన్ని తప్పుగా అంగీకరించినట్లవుతుంది. సంస్కరణగా పేర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం తప్పును ఒప్పుకున్నట్లేనా? లేక ఆ తప్పులను సంస్కరించుకున్నట్లేనా? బీజేపీ తేల్చుకోవాలి.
8ఏళ్ల క్రితం ఒకే దేశం, ఒకే పన్నుగా పేర్కొంటూ, జీఎస్టీని తెచ్చారు. ఆ పన్నులతో దేశాన్ని ప్రజల్ని పీల్చి పిప్పి చేసి, దోచి పడేశారు. ఆ డబ్బుతో చేసిన ప్రగతిని తమ ప్రతిభగా చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. హెల్త్‌ స్కీమ్‌లు, ఇన్సూరెన్స్‌ ల పైన వేసిన జీఎస్టీని తగ్గించమని పార్లమెంట్‌ వేదికగా కోరితే, నిర్ద్వందంగా తిరస్కరించిన ఘనత మన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ది. కనీసం ఆలోచిస్తామని కూడా చెప్పలేదు. స్వయంగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కోరినా నో చెప్పారు. అలాంటి వారు ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న, బీహార్ లాంటి ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జీఎస్టీ స్లాబులను తగ్గించారు. ఇది కేవలం పెంచిన దాన్ని తగ్గించడం మాత్రమే. మోదీని సమర్థిస్తూ, నిత్యం కీర్తిస్తున్న చంద్రబాబు సైతం గొప్ప ఆర్థిక సంస్కరణగా చెప్పుకోవడం, అసెంబ్లీలో తీర్మానం చేయడం విడ్డూరమే.

ఏళ్ల తరబడి ప్రజలను పీల్చి పిప్పి చేసిన అనంతరం వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా తీసుకువచ్చిన మార్పుల తీరు చూస్తుంటే ఎంతగా రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ చర్యతో భారీ మొత్తంలో పన్నులు తగ్గాయని, సామాన్యులు పండగ చేసుకోవచ్చని పాలకులు చెబుతున్నప్పటికీ వాటి ఫలితాలు సామాన్యులకు అందడంపై సందేహాలు నెలకొన్నాయి.
ఈ నెల 22వ తేదీ నుండి నూతన జీఎస్టీ విధానం అమలులోకి రాగా, ఒక రోజు ముందు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దసరా, దీపావళి పండగ సీజన్‌ను ’జీఎస్టీ సేవింగ్స్‌ ఫెస్టివల్‌’గా అభివర్ణించారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ అసెంబ్లీ ఉభయ సభల్లోనూ తీర్మానాలు చేసింది. జీఎస్టీ 2.0 వల్ల కలిగే ప్రయోజనాలపై చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. అయితే, మోదీగానీ, చంద్రబాబు గానీ ఇన్ని ఏళ్ళ పాటు ప్రజలపై మోపిన భారాన్ని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. నిజానికి, ఏ వస్తువుపై ఎంత ధర తగ్గుతుందన్న నిర్దిష్టమైన వివరాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించలేదు. ఇప్పటికీ షాపుల వారు మాత్రం పాత ధరలకే అమ్ముతున్నారు. టీవీ, కార్ల షోరూమ్‌లలో మాత్రం కొంత హడావుడి కనిపిస్తోంది.

ఏకీకృత పన్ను విధానం పేరుతో కార్పొరేట్ల ప్రయోజనాల కోసం జీఎస్టీని 2017లో దేశంపై బీజేపీ ప్రభుత్వం రుద్దింది. దశాబ్దాలుగా అనుసరించిన ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా సామాన్యుడి కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గింది. జీఎస్టీలో ఉన్న సంక్లిష్టత, అపరిమిత శ్లాబుల కారణంగా నిత్యావసర ధరలు భారీగా పెరిగి దేశ వ్యాప్తంగా గగ్గోలు చెరేగింది. ప్రతిపక్షాలు దీనిని ‘గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్’ గా అభివర్ణించాయి. మరోవైపు చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు మూతపడి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా తగ్గాయి. అదే సమయంలో ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావమూ పడింది. దీంతో ప్రజల ప్రయోజనాలు ఎలా ఉన్నప్పటికీ కార్పొరేట్ల కోసమైనా దేశీయ మార్కెట్‌ను పెంచడం కోసం జీఎస్టీని తగ్గించక తప్పనిస్థితి ఏర్పడింది. వారికి లాభం చేకూర్చాలంటే జీఎస్టీ తగ్గించాలన్న పరిస్థితి ఎదురయ్యింది. దీనికితోడు చుట్టుపక్కల దేశాల్లో ప్రజల్లో అసహనం పెల్లుబికింది. ఇవన్నీ గమనించిన ఏలినవారు జిఎస్టీ తగ్గించడం తప్పదని గుర్తించారు. కార్పోరేట్లు కూడా ధరల తగ్గింపు గురించి ఇచ్చిన సూచనలు పాటించారని అర్థం అవుతోంది. జీఎస్టీ తగ్గింపు ప్రజలపై ప్రేమతో మాత్రం కానేకాదు.

అదే సమయంలో ధరలను నేరుగా తగ్గించే అవకాశాలను మాత్రం పరిశీలించడం లేదు. స్టీలు, సిమెంట్‌, ఔషధాల ధరలను తగ్గించడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 55 లక్షల కోట్ల రూపాయలను గత ఏడు సంవత్సరాల్లో జీఎస్టీ ద్వారా మోదీ ప్రజల మూలుగలు పీల్చారు. దేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పించే చేనేత రంగానికి అవసరమయ్యే ముడి సరుకులను అదే శ్లాబులో ఉంచారు. కొన్ని రకాల ఔషధాలను జీరో శ్లాబులో ఉంచినట్లు చెబుతున్నప్పటికి, వాటి తయారీకవసరమైన ముడి పదార్ధాలపై పన్ను విధించారు.
జీఎస్టీ అమలులోకి వచ్చినా ధరలు తగ్గలేదు. పాత స్టాక్‌కు తగ్గింపు వర్తించదని అంటున్నారు. పలు సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను కొద్ది రోజుల కిందటే పెంచాయి. వీటిపై జీఎస్టీ తగ్గినా, పెద్దగా ఫలితం కనిపిందు. సామాన్యుడికి ప్రయోజనం కలిగించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే తగ్గిన జీఎస్టీ రేట్లను నిర్దిష్టంగా సరుకుల వారీగా ప్రకటించాలి. కరోనా తరవాత పెంచిన ఔషధాల ధరలను తగ్గించాలి.

Latest News

SIRపై CJP సమరం..|SIR|CJP

సీఈసీకి 48 గంటల డెడ్‌లైన్! న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ **(SIR)**పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో...

తెలంగాణ వార్‌రూమ్‌ టు ఢిల్లీ వార్‌రూమ్‌|TELANGANA|WAR ROOM|DELHI|WAR ROOM

రుద్ర సంతోష్‌ కుమార్‌కు ఏఐసీసీలో కీలక బాధ్యతలు హైదరాబాద్‌: తెలంగాణలో కులగణన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు సమన్వయం చేసిన కాంగ్రెస్‌ నాయకుడు రుద్ర సంతోష్‌ కుమార్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ...

జింబాబ్వేలో ఘనంగా గణేష్ శోభాయాత్ర|ZIMBABWE|GANESH|SHOBHA YATRA

రూ.8 లక్షలకు లడ్డూ సొంతం చేసుకున్న బద్దం నరేష్ రెడ్డి జింబాబ్వే రాజధాని హరారేలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరారే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన వేడుకలు...

యికటి0చిన ముద్దు కటకాలు సూపింది!?|ADUGU TRENDS

ము ము ముద్దంటే చేదా?! ఆ ఉద్దేశ్యం లేదా? అన్నరు. ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ఆ ఉద్దేశ్యం ఉందో? లేదో తెలుసుకోకపోతే, ముద్దూ, ముచ్చటా యికటిత్తయి. కటకాలు కూడా సూపిత్తయి. ముద్దుకైన, ముచ్చటకైన...

ఊగిసలాటకు ఊతం భద్రతే!|EDITORIAL

చమురు ధరల ఊగిసలాటకు తాత్కాలిక దౌత్య పరిణామాలు మాత్రమే కాకుండా యుద్ధం, రవాణా అంతరాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ముప్పులు కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొని, అంతర్జాతీయ నౌకా రవాణా సాధారణ స్థితికి...

సెప్టెంబర్ 24, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 09.33 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ధనిష్ఠ ఉదయం 09.58 వరకు ఉపరి శతభిషం యోగం ధృతి సాయంత్రం 04.34 వరకు ఉపరి శూల కరణం కౌలవ ఉదయం 09.08...

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News