Wednesday, April 15, 2026
38.2 C
Hyderabad

2025-26 వార్షిక బడ్జెట్ పూర్తి ప్రసంగ పాఠం

2025, మార్చి 19 వ తేదీన తెలంగాణ రాష్ట్ర శాసనసభకు

2025-26 వార్షిక బడ్జెట్ సమర్పిస్తూ……

గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖామాత్యులు

శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారి ప్రసంగం

గౌరవ అధ్యక్షా….

ప్రజాప్రయోజనాలేధ్యేయంగా,పారదర్శకత మరియుజవాబుదారీతనంతో  సాగుతున్న మా ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది.సంక్షేమం-అభివృద్ధిని సమపాళ్ళలో రంగరించి జోడు గుర్రాల తరహాలో  సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తున్నాను.

  1. డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని ఒక రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకున్నారు. అందుకే, రాజ్యాంగ నైతికతను [Constitutional Morality] ఆయన పదేపదే నొక్కిచెప్పారు. రాజ్యాంగనిర్మాత సూచించిన ఆ నైతిక విలువలనే సరిగ్గా పాటిస్తూ, మా ప్రజాపాలన సాగిస్తున్నాం.
  2. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని, మేం ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా, అధికార పీఠం హోదాగా భావించకుండా, ప్రజల జీవన స్థితిగతులు పెంచుతూ, మార్పు తెచ్చే బాధ్యతగా భావిస్తూ, వినమ్రంగా ప్రజలకు నిత్యం జవాబుదారీతనంతో ఉంటూ,విస్తృత ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తున్నాం. దశాబ్ద కాలం పాలనా వ్యవస్థల విధ్వంసం ఆర్థిక అరాచకత్వంతో కూడిన పాలనతో ఛిద్రమైన తెలంగాణ పాలనా ఆర్థిక వ్యవస్థలని గాడిలో పెడుతూ,తెలంగాణ తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని, మా ప్రభుత్వం నిరంతరం పని చేస్తున్నది.

4.నిజం కూడా ప్రతి రోజు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధంనిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడానాశనం చేస్తుంది”.

ప్రభుత్వం చేసేప్రతి చర్యను శంకిస్తూ, నిరాధారమైన విమర్శలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో, సొంత పత్రికలలో అబద్ధపు వార్తలతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటువంటి కువిమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతూ, వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత. నిజం ప్రజలకు చెప్పకపోతే, స్వార్థపరులు ప్రచారం చేసే అబద్ధాలే నిజాలుగా భ్రమించే ప్రమాదం ఉంది. అందుకే, ఎప్పటికప్పుడు  సత్యాలను ప్రజల ముందు ఉంచుతూ ముందుకు సాగుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, సమాఖ్య స్ఫూర్తిని మా ప్రభుత్వం కొనసాగిస్తోంది. సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకందించేందుకుగాను, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు సాగుతున్నాం.

  1. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలతో తెలంగాణ నమూనా, నేడు దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచేవిధంగా కృషి చేస్తున్నాము.అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే గత పాలకులు సృష్టించిన సవాళ్లన్నింటినీఎదుర్కొని మా ప్రభుత్వం పరిపాలనా సత్తాను చాటుకుంది. అయితే, అదే సమయంలో లోక్ సభ ఎన్నికలు రావడంతో, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అభివృద్ధి పనులకు కొంత విరామం ఏర్పడింది.
  2. 6. తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల సాధనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో “తెలంగాణ రైజింగ్ 2050” అనే ప్రణాళికతో మా పాలనని ముందుకు నడిపిస్తున్నాం. ఈ రోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం 200 బిలియన్ డాలర్లు.రాబోయే పదేళ్ల కాలంలో దీనిని ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1000 బిలియన్ డాలర్ (ట్రిలియన్-డాలర్) వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది.
  3. హైదరాబాద్ మహా నగరంలోరవాణా, మౌలిక సదుపాయాల విస్తరణ, పర్యావరణ పరిరక్షణ మరియుసాంకేతిక అభివృద్ధి ప్రధానాంశాలుగా అంతర్జాతీయ స్థాయిలోఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకుమాస్టర్ ప్లాన్ ను తయారుచేస్తున్నాం. దీనిలో భాగంగా హైదరాబాద్ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడానికి మూసీ నదీ పునరుద్ధరణప్రాజెక్ట్‌ను ప్రారంభించాం.
  4. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్లీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు “మెగా మాస్టర్ ప్లాన్ 2050″ని రూపొందించాం. దీని కోసం సౌర, పవన ఇంధన ప్రాజెక్టుల స్థాపనను ప్రోత్సహిస్తున్నాం.
  5. ప్రతీ పౌరుడికి మెరుగైన వైద్యంఅందించడానికి, ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు భారీ స్థాయిలో కేటాయింపులు చేసాం.
  6. సమాజ పురోగతికి కీలకంగా మారిన విద్యా వ్యవస్థను పటిష్టపరచడంతో పాటు, డిజిటల్ విద్యను పెంపొందించి, పాఠశాలలకు మౌలిక సదుపాయాలను కల్పించాం. వెనుకబడిన వర్గాలకు చెందినప్రతిభావంతులైన విద్యార్థులను ప్రత్సహించేందుకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాం.
  7. 1 రైతుల సంక్షేమమే ప్రాధాన్యంగా పనిచేసే మాప్రభుత్వం, రాష్ట్ర రైతాంగానికి ఎప్పటికప్పుడు స్వల్పకాలిక, దీర్ఘకాలిక సహాయాన్ని అందిస్తూనే ఆధునిక వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు, ప్రత్యేక ఇన్సెంటివ్ లను అందిస్తుంది. మార్కెట్లో సరైన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, మార్కెట్ యార్డుల్లో రైతుల కోసం అనేక సదుపాయాలను కూడా కల్పిస్తున్నాం.
  8. 12. నీకు కనిపించిన బలహీనుడైన నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో. నువ్వు తీసుకున్న చర్య అతనికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో-మహాత్మగాంధి

వారి మాటలే మాకు స్ఫూర్తి మంత్రం. నిరుపేదల కోసం, బలహీన వర్గాల కోసం మేము తీసుకున్న ప్రతి చర్య వెనుక ఉన్న ఆలోచన ఇదే. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి చేర్చే లక్ష్యంతో అభివృద్ధి మరియు సంక్షేమ రంగాలకు తగినన్ని నిధులనుప్రస్తుత బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాం.

రాష్ట్రఆర్థికస్థితి:

  1. 1 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ,తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి (GSDP) ప్రస్తుత ధరల ప్రకారం,పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్భై తొమ్మిదికోట్ల రూపాయలు(16,12,579కోట్లు). గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధిరేటు 10.1 శాతంగా నమోదు అయ్యింది. ఇదేసమయంలో, దేశ GDPమూడు కోట్ల ముప్పై ఒక్కలక్షల మూడు వేల రెండు వందల పదిహేనుకోట్ల రూపాయలు(3,31,03,215కోట్లు)కాగా, వృద్ధిరేటు 9.9శాతంగా ఉంది.

తలసరి ఆదాయం:

  1. 1 2024-25 ఆర్థిక సంవత్సరంలో, ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఏడు వందల యాబై ఒక రూపాయలు (రూ. 3,79,751) కాగా, వృద్ధిరేటు 9.6 శాతం. దేశ తలసరి ఆదాయం రెండు లక్షల ఐదువేల ఐదు వందల డెబ్బై తొమ్మిదిరూపాయలు(రూ.2,05,579) కాగా వృద్ధి రేటు 8.8 శాతం. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్షా డెబ్బై నాలుగు వేల ఒక వంద డెబ్భై రెండు రూపాయలు (రూ.1,74,172), అంటే 1.8 రెట్లు ఎక్కువగా ఉంది.

వివిధ రంగాలలో వృద్ధి రేటు:

  1. 1 2024-25లో తెలంగాణ జోడింపబడిన స్థూల విలువలో (GSVA) సేవా రంగం 66.3 శాతం, పారిశ్రామిక రంగం 16.4 శాతం, మరియు వ్యవసాయ, అనుబంధ రంగాలు 17.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
  2. 16. వ్యవసాయ, అనుబంధ రంగాలు GSDP లో తక్కువ వాటా కలిగి ఉన్నప్పటికీ, రాష్ట్ర మొత్తం శ్రామిక రంగంలో7 శాతంమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఉచిత కరెంట్,రైతు భరోసా, పంట రుణ మాఫీ, నీటి పారుదల ప్రాజెక్టులపై పెట్టుబడులువంటి ప్రభుత్వ పథకాలురైతాంగానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. అదే సమయంలోవ్యవసాయ రంగాన్ని పటిష్టవంతం చేసేందుకుగాను, పండ్ల తోటలు, పశు సంరక్షణ, చేపల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాం.
  3. 17. రాష్ట్ర పరిశ్రమలు 5 శాతంమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. “చైనా +1” వ్యూహాన్నిఅవలంభించడం ద్వారాతెలంగాణను ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక శక్తి రంగాలలోగ్లోబల్ తయారీ కేంద్రంగాఅభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.
  4. 1 పరిశ్రమల కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్ళ అభివృద్ధి,మరిన్నిపెట్టుబడులను ఆకర్షించి, ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి తోడ్పడతాయి. తద్వారా, ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా, వేగంగా అభివృద్ధి చెందుతుంది.
  5. 19. రాష్ట్రంలోసేవా రంగం అత్యధిక క్రొత్త ఉపాధి కల్పించే దిశగా కొనసాగుతోంది. ఇది మొత్తం శ్రామిక రంగంలో8 శాతంవాటాను కలిగి ఉంది. హైదరాబాద్నగరంఐటీ రంగంలో అగ్రగామిగా, ముఖ్యంగాసాఫ్ట్‌వేర్ సేవలు, ఫిన్‌టెక్, లాజిస్టిక్స్, పర్యాటకంవంటి రంగాలలో ఉపాధి వృద్ధికి ప్రధానంగా దోహదపడుతోంది.
  6. 20. తెలంగాణ లో శ్రామికశక్తి7 శాతంఉండగా, దేశీయ సగటు 64.3 శాతంమాత్రమే ఉంది. దీనిలో, మహిళల ఉపాధి శాతం 52.7 శాతం ఉండగా, ఇదిదేశ సగటు 45.2 శాతంకంటే అధికం.మహిళలు మరియు వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎంతగా విజయవంతమయ్యిందో ఈ గణాంకాలుతెలియజేస్తున్నాయి.

16వ ఆర్థిక సంఘం

  1. 21. రాష్ట్ర ప్రభుత్వం16వ ఆర్థిక సంఘానికి సమగ్ర నివేదికను సమర్పించింది.ఇందులోకేంద్ర పన్నుల పంపిణీలో రాష్ట్రాలకు న్యాయమైన వాటా కల్పించాలని, అలాగేరుణ స్థిరత్వం, మౌలిక సదుపాయాల అభివృద్ధిమరియు సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు మరింత ఆర్థిక సహాయం అందించాలనివిజ్ఞప్తి చేసింది.కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్సులు, అదనపు చార్జీల వల్ల రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గుతుంది అన్న విషయాన్ని కమీషన్ కు వివరించాం. ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న 41 శాతం పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలని ప్రతిపాదించడం జరిగింది.
  2. 22. తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలకు పన్నుల పంపిణీలో తగ్గుతున్న వాటాపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణకు 14వ ఆర్థిక సంఘం ద్వారా 437 శాతం నిధుల పంపిణీ జరిగితే, 15వ ఆర్థిక సంఘం కాలంలో ఇది 2.102 శాతానికి తగ్గింది. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయించడం అన్యాయమని, దేశ ఆర్థికవృద్ధికి దోహదపడుతున్నరాష్ట్రాలను ప్రోత్సహించే విధంగా పన్నుల పంపిణీ విధానాన్ని మరింత హేతుబద్దంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.
  3. 23. తెలంగాణ ప్రభుత్వం సమాంతర పన్నుల పంపిణీ సూత్రంలో సంస్కరణలు తీసుకురావాలని సూచించింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న “తలసరి ఆదాయ దూరం” అనే ప్రాతిపదిక ప్రాధాన్యతను తగ్గించి, GSDP కి 50 శాతం వెయిటేజినిఇవ్వాలని కోరింది. దేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా సహకరిస్తున్న రాష్ట్రాలకుమరింత హేతుబద్ధంగా వనరులను అందించడం ద్వారా దేశ అభివృద్ధిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సూచన ప్రతిపాదించబడింది. మన న్యాయమైన వాటాను సాధించడంతో పాటు, ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుని,ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

అభయహస్తం:

24.మేము ప్రవేశపెట్టిన అభయ హస్తంలోని ప్రతి అంశం సామాన్య ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని రూపుదిద్దుకొన్నవే.ఒక నిరుపేద తన రోజువారి జీవితంలో ఏ కనీస సదుపాయాలు ఉండాలని కోరుకుంటాడో వాటినన్నీ అభయహస్తంలో భాగంగా చేర్చడం జరిగింది.మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత క్రింద పింఛన్ల పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తోంది.

  1. 2 మన ఆడబిడ్డలు పనికి వెళ్లాలన్నా, చదువుకోవడానికి బడికి వెళ్లాలన్నా లేదా మొక్కు తీర్చుకోవడానికి ఓ గుడికి వెళ్లాలన్నా వారు ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించకుండావెళ్లడానికి,మహాలక్ష్మి పథకం క్రింద 2023, డిసెంబర్ 9వ తేదీన రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించాం. నేటి వరకురాష్ట్ర వ్యాప్తంగా 7,227 బస్సుల్లో 149.63 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేసారు.దీని ద్వారా ఐదు వేల ఐదుకోట్ల తొంబై ఐదు లక్షలరూపాయలు(5005.95 కోట్లు) మహిళలకు ఆదా అయ్యింది. ప్రారంభ దశలో సాధారణ బస్సులలో 69 శాతంగా ఉన్న RTC ఆక్యుపెన్సి రేషియో 94 శాతానికి పెరిగింది. మహాలక్ష్మి ప్రత్యేక బస్సులలో ఈ ఆక్యుపెన్సీ రేషియో 100 శాతంగా నమోదవుతూ ఉంది. దీనివల్ల RTC ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది. బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా, 6,400 మంది ఉద్యోగులను ఇప్పటికే అదనంగా నియమించడం జరిగింది. ప్రభుత్వం ఈ పథకం అమలుకు, RTC కి క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తూ ఉంది.
  2. 2 మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకే పంపిణీ చేస్తున్నాం. ఈ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలకు లబ్ధిచేకూరుతూ ఉంది. లబ్ధిదారులు ఉపయోగించిన సిలిండర్లకు సబ్సిడీ క్రింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ముప్పై మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు(433.20 కోట్లు) చెల్లించింది.
  3. 2 గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్లకు లోబడి విద్యుత్తును వినియోగిస్తున్నవారికి ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాము. ఈ పథకం క్రింద 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ పథకం కోసం ఇప్పటికే ఒక వెయ్యిఏడు వందల డెబ్భై ఐదు కోట్లపదిహేను లక్షలరూపాయలు(1,775.15 కోట్లు) విద్యుత్ సంస్థలకు సబ్సిడీగా చెల్లించడం జరిగింది.
  4. 2 ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని 2024,మార్చి నెలలో ప్రారంభించి, ఇండ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించాం. 22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభైవేల (4,50,000)ఇండ్లను మంజూరు చేస్తాం.
  5. గత ప్రభుత్వం పదేళ్ల పాటు నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇస్తామని ఆశలు రేకెత్తించి చివరకు నిరాశ నిస్పృహలనే మిగిల్చింది. అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాలలో ముప్ఫై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు (34,545) నిర్మాణాలకు,మూడువందల ఐదు కోట్ల మూడు లక్షలరూపాయల(305.03కోట్లు)నిధులను కేటాయించి, వాటిని అందుబాటులోకి తెస్తున్నాము. అంతే కాకుండా, ఔటర్ రింగు రోడ్డుని ఆనుకొని హైదరాబాద్ నగరం నలువైపులాశాటిలైట్ టౌన్షిప్ లుఏర్పాటు చేసి, అల్పాదాయ మరియు మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా గృహ సముదాయాలను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నాం.
  6. 3 రాష్ట్రం లోని నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించే ధ్యేయంతో రూపొందిన రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్నిచేయూతలో భాగంగా అమలు చేస్తున్నాం. ఈ పథకం క్రింద ఉచిత వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు పెంచడంవల్ల దారిద్ర్యరేఖకు దిగువనున్న 90.10 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. వైద్యవ్యయ పరిమితిని పెంచడంతో పాటు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే 1,375 వైద్య చికిత్సల ధరలను కూడా 20 శాతం పెంచాం. అదనంగా 163 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తీసుకు రావడంతో, 1,835 వైద్య పరమైన వివిధ ప్యాకేజీలు పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

వ్యవసాయం రంగం:

రైతు రుణ మాఫీ:

31.పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడికోసంరైతులు అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. గతంలో చేసిన అప్పుతీరితేనే రాబోయే పంట కాలానికి కావలసిన పెట్టుబడికి రుణం దొరుకుతుంది.మన రైతన్నలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మా ప్రభుత్వంవారిని రుణ విముక్తులను చేసింది. వారికి 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది. ఇప్పటివరకు 25.35 లక్షల  మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనబై తొమ్మిదిలక్షలు(20,616.89 కోట్లు) రుణ మాఫీ చేసాం. దీనివల్ల రైతులు మళ్ళీ వ్యవసాయ రుణాలు పొందడానికి మార్గం సుగమమైంది. ఈ భారీ రుణ మాఫీతో తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు బాటలు వేశాం.

రైతుభరోసా:

  1. 3 రాష్ట్రంలోని రైతులు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేసేందుకు, పెట్టుబడి సాయంగా మా ప్రభుత్వం 2025, జనవరి 26 తేదీన తెలంగాణ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం క్రింద రైతులకు ఏడాదికి, ఎకరానికి 12 వేల రూపాయలు అందుతాయి.
  2. 3 ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకి యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో సర్వే చేసి, గ్రామ సభలలో ధృవీకరించి, సాగుకు యోగ్యంకాని భూమిని గుర్తించడం ద్వారా,ఈ వృధాను అరికట్టాము. రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేల కోట్ల (18,000 కోట్లు)రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (రైతు కూలీ సంక్షేమం):

  1. 34. భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండే దీన స్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12వేల రూపాయలు చెల్లించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నాం.

సన్న వడ్లకు రూ.500 బోనస్:

  1. 35. రాష్ట్ర రైతులనుండి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాలుకు 500 రూపాయల చొప్పున అదనపు ప్రోత్సాహాన్ని (బోనస్) చెల్లిస్తున్నాం. దీని వల్ల రాష్ట్రంలో సన్న రకాల వరిసాగు గణనీయంగా పెరిగింది. గత ఖరీఫ్ తో పోల్చినప్పుడు, సన్న వడ్ల సాగు 25 లక్షల ఎకరాల నుండి 40 లక్షల ఎకరాలకు పెరిగింది. మా ప్రభుత్వం ఇస్తున్నబోనస్ మరియు ప్రతి చివరి వడ్లగింజ కూడా కొంటామని మేము చేసిన వాగ్దానమే దీనికి ప్రత్యక్ష కారణం. ఫలితంగా, రైతులకు చక్కని గిట్టుబాటు ధర లభిస్తున్నది. ఖరీఫ్ సీజన్ లో సన్నవడ్లు పండించిన రైతులకు,పన్నెండువందల ఆరు కోట్ల నలభై నాలుగు లక్షలు (1,206.44 కోట్లు) బోనస్చెల్లించడం జరిగింది. రైతుల సౌకర్యార్ధం 2024-25 ఖరీఫ్ సీజన్ లో 8,332 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసాం.
  2. 36. అకాల వర్షాల వల్ల ధాన్యం పాడవకుండా, పండిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో ఎటువంటి నష్టం జరుగకుండా, గంట గంటకూ వాతావరణ సూచనలను అటు రైతులకు, ఇటు కొనుగోలు కేంద్రాలకు తెలియజేస్తున్నాం. అధునాతన డ్రైయర్లు, ధాన్యం క్లీనర్లు, తగినన్ని టార్పాలీన్లను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. వ్యవసాయ మార్కెట్ యార్డులలో వసతుల అభివృద్ధికి 181.98 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టాము.
  3. 37. 2024-25 ఖరీఫ్ సీజన్ లో పది లక్షల ముప్ఫై ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు (10,35,484) మంది రైతులనుండి ధాన్యం కొనుగోలు చేసి,పన్నెండు వేల ఐదు వందల పదకొండు కోట్ల డెబ్భై ఆరు లక్షల రూపాయలు(12,511.76 కోట్లు) వారి ఖాతాలలో జమ చేయడమైనది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్ర రైతుల ప్రయోజనం కోసం అన్ని చర్యలు తీసుకొంటున్నాము.
  4. 3 రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యంతో, ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తున్నాం. ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం లేని కారణంగా మన రైతులకి సరైన ధర లభించనందున, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధించేలా కృషి చేసాం. తద్వారా, ఆయిల్ పామ్ రైతులకు, టన్నుకు 2,000 రూపాయలు అదనపు లబ్ధి చేకూరి, ఆయిల్ పామ్ సాగు మరింత లాభదాయకంగాను, ఆకర్షణీయంగాను మారింది. ఉద్యానవన సాగులో బిందు సేద్యం కొరకు సౌర విద్యుత్తును ఉపయోగించే రైతులకు ప్రాధాన్యతనిచ్చి వారికి ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తాం.

వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్ లో 24,439 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాము.

పశుసంవర్ధక రంగం:

  1. పశువులు వ్యాధుల బారినపడకుండా నిరోధించే టీకాలను ఉత్పత్తి చేసే తెలంగాణ పశు వైద్య టీకా ఉత్పత్తి కేంద్రం హైదరాబాద్, శాంతినగర్ లో ఉంది.ఈ వెటర్నరీ బయోలాజికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ని మామిడిపల్లికి తరలించి, 300 కోట్ల రూపాయలతో భారీగా విస్తరింపజేస్తున్నాం. అంతేకాకుండా, క్రొత్త వ్యాక్సీన్ల ఆవిష్కరణకుఅవసరమైన పరిశోధనలు చేపట్టే నిమిత్తం, 100 కోట్ల రూపాయలతో అధునాతన యంత్రాలను తెప్పిస్తున్నాం. నూతనంగా ఏర్పాటయ్యే ఈ టీకాల కేంద్రంలో బ్యాక్టీరియల్, వైరల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్లాంట్లు, క్వాలిటీ కంట్రోల్, యానిమల్ టెస్టింగ్ ల్యాబ్ లు, ఆర్ అండ్ డి, యానిమల్ బ్రీడింగ్ సెంటర్ వంటి వాటితోపాటు, స్టాఫ్ క్వార్టర్స్ కూడా నిర్మిస్తాం.
  2. 4 మన రాష్ట్రం నుండి భారీగా చేపల ఎగుమతిని ప్రోత్సహించడానికి రంగారెడ్డి జిల్లా కొహెడలో ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ హోల్సేల్ చేపల మార్కెట్ ను 47 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించాం.
  3. 4 రాష్ట్రంలో మేలు జాతి పాడిపశువులను వృద్ధి చేయడానికి రంగారెడ్డి జిల్లా కంసాన్ పల్లి లో ఒక క్రొత్త ఫ్రోజెన్ సెమన్ బుల్ స్టేషన్ ను ఇరవై ఒక్క కోట్ల ఆరు లక్షలరూపాయల(21.06 కోట్లు) వ్యయంతో నిర్మిస్తున్నాం. దీనిని అతి త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. దీని ద్వారా సంవత్సరానికి సుమారు 10 లక్షల ఫ్రోజెన్ సెమన్ డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడుతుంది.

పశు సంవర్థక శాఖకు ఈ బడ్జెట్ లో 1,674 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

భూ భారతి:

  1. 4 భూమి అనేది ఒక స్థిరాస్థి మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం. భూమితో ఉన్న అనుబంధం కన్నతల్లితో, సొంత ఊరితో ఉన్న అనుబంధంతో సమానం. ఒక వ్యక్తి తన భూమిని కోల్పోయినప్పుడు తన అస్తిత్వాన్నే పోగొట్టుకున్నట్లు భావిస్తాడు. అటువంటి, భావుకతతో ముడిపడి ఉన్న అంశంలో,గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల వల్ల సామాన్యులకు తీరని వేదన మిగిలింది. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ, ప్రజలు చేసుకున్న ధరఖాస్తులు కూడా పరిష్కరించలేని దుస్థితి అప్పట్లోఏర్పడింది. వీటి పరిష్కరణను వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉన్న పరిష్కరణ అధికారాన్ని తహసీల్దార్/ఆర్.డి.ఓలకు బదిలీ చేస్తూ మార్గదర్శకాలను విడుదల చేసాం.
  2. 4 తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టంలోని నిబంధనలు పారదర్శకంగా, సమగ్రంగా భూవివాదాలకు తావులేకుండా, భూ యజమానుల హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి రూపొందించబడ్డాయి. డిజిటల్ మ్యాపింగ్ వ్యవస్థ ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా, భూ భారతి లావాదేవీలను సులభతరం చేసి, సక్రమమైన భూ రికార్డ్ వ్యవస్థను ఏర్పరచడానికి దోహదం చేస్తుంది. భూ పరిపాలనను మరింత బలోపేతం చేయడానికి, 10,954 గ్రామ స్థాయి అధికారుల పోస్టులను మంజూరు చేసాం. దీనితో, క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారుల పాత్రను పునరుద్ధరించి, భూ సమస్యలను వేగంగా పరిష్కరించే సమర్థవంతమైన పాలనావ్యవస్థను తెస్తున్నాం.

నూతన రేషన్ కార్డుల జారీ:

  1. 4 తెలంగాణ అవతరించిన తరువాత ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డు కొరకు ఆశగా వేచి చూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులో జత చేయలేదు. ప్రజల ఆకాంక్షలను గుర్తించిన మేము అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, వారికి సన్నబియ్యం కూడా ఇవ్వాలని నిర్ణయించాం. నూతన రేషన్ కార్డుల జారీ మరియు అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసే ప్రక్రియ ఈ సంవత్సరం జనవరి 26 నుండి ప్రారంభించాం.

పౌర సరఫరాల శాఖకి ఈ బడ్జెట్ లో 5,734 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

విద్య:

యంగ్‌ ఇండియా ఇంటి గ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ :

  1. 4 విద్యతోనే సామాజిక అభివృద్ధి సాధ్యం.ముఖ్యంగా, పేద మరియు వెనుకబడిన తరగతులకు చెందిన పిల్లల సురక్షిత భవిష్యత్తుకి విద్య ఒక దారిని చూపుతుంది.
  2. ఇది ప్రగాఢంగా నమ్మిన UPA ఛైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు మరియు ఆనాటి భారత ప్రధాని దివంగత డా. మన్మోహన్ సింగ్ గార్ల నాయకత్వంలోఉచిత విద్యా హక్కు చట్టం 2009 లో చేసారు.
  3. 47. ప్రస్తుతం తెలంగాణలో 1,023 ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా, వీటిలో 662 పాఠశాలలకు స్వంత భవనాలు లేవు. అనేక గురుకులాలు అరకొర సౌకర్యాలున్న భవనాల్లో, వందలాది మంది విద్యార్థులతో, సరైన టాయిలెట్ సదుపాయం కూడా లేకుండా నడుస్తున్నాయి. వర్గాల వారీగా ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నప్పటికీ, వాటి మధ్య విద్యా ప్రమాణాల విషయంలో, మౌలిక వసతుల విషయంలో సారుప్యత లేదు.ప్రపంచ వ్యాప్తంగా విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకున్నప్పటికీ, మన ప్రభుత్వ పాఠశాలలు దశాబ్దాల కాలం వెనుకబడి ఉన్నాయి.
  4. 48. ఈ పరిస్థితులను సరిదిద్దడానికిసామాజికవేత్తలు, విద్యావేత్తలతో చర్చించి, మన ప్రభుత్వవిద్యా వ్యవస్థను మరియుభావితరాలను అత్యుత్తమరీతిలో తీర్చిదిద్దే విధంగాయంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ని రూపొందించాం. కులం, మతం లేదా ఆర్థిక స్థితిగతులకు అతీతంగా, విద్య మాత్రమే కాకుండా, విద్యార్థుల యొక్క మానసిక, శారీరక అభివృద్ధికి,అంటే హోలిస్టిక్ డెవలప్‌మెంట్కి దోహదపడే విధంగా ఈ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ పాఠశాలలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులను ఒకే గొడుగు కిందకుతెచ్చి సమాన విద్యా అవకాశాలను కల్పించడం,ఒక గొప్ప సామాజిక ఐక్యతకు పునాది అవుతుంది.
  5. 49. “Education is the milk of a lioness.The one who drinks it, can’t stay without roaring”

Dr. B.R. Ambedkar.

విద్య అనేది సింహపు పాల వంటిది, వాటిని త్రాగిన వారు గర్జించకుండా ఉండలేరు.

డా.బి.ఆర్.అంబేద్కర్ కలలు కన్న విద్యావ్యవస్థను మేము సృష్టించబోతున్నాము. దీనికోసమే రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి 11,600 కోట్ల రూపాయల అనుమతులు మంజూరు చేయడం జరిగింది.మేము తీసుకున్న ఈ నిర్ణయంఒక చారిత్రాత్మకం.ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ని ప్రారంభిస్తాం.

  1. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడతాయి. విద్యారంగంలో వస్తున్న మార్పులకి అనుగుణంగా, ఆధునిక వసతులతో ప్రైవేట్ పాఠశాలలకు ధీటైన విద్యను అందించేందుకు వీటిని అభివృద్ధి చేస్తున్నాం.ఆడిటోరియాలు,డైనింగ్ హాల్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్రీడా మైదానాలు, క్రికెట్ మరియు ఫుట్‌బాల్ గ్రౌండ్స్ లాంటి ఆధునికసదుపాయాలు అందుబాటులో ఉంటాయి.విద్యార్థుల నిరంతర పర్యవేక్షణకు వీలుగా ఈ పాఠశాలల ప్రాంగణాల్లోనే బోధనాసిబ్బందికి నివాససముదాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ స్కూళ్లలోపవన మరియు సౌరశక్తిని విరివిగా వినియోగిస్తాం.
  2. ఈ స్కూళ్లలోని విద్యార్థులకు వసతి, భోజనం, యూనిఫాంలు, నోటు మరియు పాఠ్య పుస్తకాలు మరియు ఇతర ఆవశ్యక వస్తువులన్నీ ఉచితంగా అందించబడతాయి. పాఠ్యాంశంతో పాటు వీరికి IIT-JEE, NEET మరియు ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. విద్యతో పాటు శారీరక మరియు మానసిక దృఢత్వానికి అవసరమైన క్రీడలు, కళలు, పోటీలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది.
  3. 5 రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం అయ్యేరోజే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలను, యూనిఫామ్‌లను అందజేస్తున్నాం. ప్రభుత్వవిద్యాసంస్థలన్నింటికీఉచిత విద్యుత్ సరఫరాని అందిస్తున్నాం. త్వరలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు గ్రీన్ విద్యుత్ ని అందిస్తాం.
  4. పిల్లల శారీరక మానసిక ఆరోగ్యానికి, సంతులిత పౌష్టికాహార ప్రాధాన్యతను గుర్తించి,రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, అన్ని సంక్షేమ శాఖలకు చెందిన అనుబంధ హాస్టళ్లలో మరియు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలలో,డైట్ చార్జీలు40 శాతం మరియు కాస్మొటిక్‌ ఛార్జీలు 200 శాతం పెంచాం. ఈ పెంపు వల్ల తెలంగాణ వ్యాప్తంగా 7.66 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాలలో చదువుకొనే విద్యార్థులందరికీ ఒకే తరహా భోజనం ఇచ్చేందుకు కామన్ డైట్ పథకాన్ని ప్రారంభించాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ స్నాక్స్ ఇస్తున్నాం.
  5. 54. పాఠశాలల్లో అమలు పరిచే మధ్యాహ్న భోజన పథకం మరియు సంక్షేమ వసతి గృహాలల్లో ఆహార పదార్థాలను తయారు చేసి, నిల్వ ఉంచే విషయంలో ఒక నిర్దిష్ట వ్యవహార శైలిని పాటించడం ద్వారా విద్యార్థులకు పరిశుద్ధమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం సాధ్యమవుతుంది. దీనికోసం ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ను రూపొందించి అమలు చేస్తున్నాం.
  6. “Education is future insurance”విద్య భవిష్యత్తుకు బీమా కనుక విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర విద్యా రంగంలో పలు సంస్కరణలు చేపట్టాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో ఒక సమగ్ర విధాన రూపకల్పనకి, తెలంగాణ విద్యా కమీషన్ ను ఏర్పాటు చేసాం.
  7. 56. తెలంగాణ నారీ శక్తిని గౌరవిస్తూ కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి, ఆ విశ్వవిద్యాలయ వారసత్వ కట్టడాన్ని సంరక్షిస్తూనే, 550 కోట్ల రూపాయలతో అదనపు భవన నిర్మాణాలను చేపడుతున్నాం. తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్‌ రెడ్డి పేరును,ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (IIHT) కి, శ్రీ కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరును పెట్టడం జరిగింది.

విద్యా శాఖకి ఈ బడ్జెట్ లో 23,108 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

యువత ఉద్యోగాలు:

  1. “No plan for the future development of the country can bedeemed to be complete, which does not provide for technical and Scientific training”

– Dr. B.R Ambedkar.

సాంకేతిక మరియు శాస్త్రీయ శిక్షణను అందించని దేశం, భవిష్య అభివృద్ధికి సంబంధించిన ఏ ప్రణాళికను పూర్తి చేసినట్లుగా భావించలేము.

        డా.బి.ఆర్.అంబేద్కర్ గారు దూరదృష్టితో అర్ధ శతాబ్దానికి పూర్వం చెప్పిన ఈ మాటలు నేటికీ మన సమాజానికి వర్తిస్తాయి. అందుకే, యువతలో శాస్త్ర- సాంకేతిక నైపుణ్యతను పెంపొందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించాం. బోధనాంశాలకు, పారిశ్రామిక అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించి నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ఈ యూనివర్సిటీ పనిచేస్తుంది.

  1. మహాత్మాగాంధి గారు స్వాతంత్ర్య సమరోద్యమంలో యువతను చైతన్య పరచడానికి నడిపిన యంగ్ ఇండియా పత్రిక పేరునే ఈ యూనివర్సిటీకి పెట్టడం గమనార్హం. ఈ యూనివర్సిటీని ముచ్చర్లలో 150 ఎకరాలలో నిర్మించి, ఏడాదికి 30 వేల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నాం. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యూకేషన్ (ITE) ప్రపంచంలోనే మేటి సంస్థ. వారి భాగస్వామ్యంతోయంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటిమాస్టర్ ట్రైయినర్లకు శిక్షణను ఇస్తున్నాము.
  2. వివిధ పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ యూనివర్సీటీలో అందించే కోర్సులు అటు యువతకు, ఇటు పరిశ్రమలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేలా రూపొందించాం. ఈ యూనివర్సిటీలో ప్రస్తుతం ఐదు కోర్సులు ప్రారంభమైనాయి. మున్ముందు యానిమేషన్, టూరిజం మరియు హాస్పిటాలిటి, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, నిర్మాణ రంగం, రిటైల్ రంగం, మీడియా, సినిమారంగం, నౌకా మరియు విమాన మెయింటెనెన్స్ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీ కోర్సులను కూడా ప్రారంభించబోతున్నాం.
  3. 6 తెలంగాణ యువతను, విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా 200 ఎకరాలలో AI సిటీని నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ సిటీలోప్రత్యేక AI విశ్వవిద్యాలయాన్ని, డేటాసెంటర్లను, కంప్యూటింగ్ సౌకర్యాలను, పౌరులకు అవగాహన కల్పించే కేంద్రాన్ని స్థాపించడానికి తగిన చర్యలు ప్రారంభించాం.
  4. 6 కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం, తెలంగాణలో 2023 జూలై – సెప్టెంబర్ కాలంలో నిరుద్యోగ రేటు 22.9 శాతం ఉండగా, 2024 జూలై – సెప్టెంబర్ కాలంలోఅది 18.1 శాతానికి తగ్గింది. మా ప్రభుత్వం చేస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు,ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, యువ పారిశ్రామికవేత్తలకుఇస్తున్న ప్రోత్సాహకాల వల్లనే ఇది సాధ్యమయ్యింది. సమర్థవంతమైన విధానాల రూపకల్పన మరియు కార్యాచరణ చక్కటి ఫలితాలు ఇస్తాయన్నదానికి ఇది నిదర్శనం.మా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించి పోలీస్, రెసిడెన్షియల్ స్కూల్స్, వైద్య, ఆరోగ్య మరియు ఇతర శాఖల్లో 57,946 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తిచేశాము.అంతే కాకుండా, వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలలో మానవ వనరుల అవసరాలపై సమీక్షలు జరిపి, 30,228 కొత్త పోస్టులను మంజూరు చేసాం.  గ్రూప్-1, గ్రూప్-2 మరియు గ్రూప్-3 పరీక్షలు సకాలంలో, సక్రమంగా నిర్వహించి వాటి ఫలితాలు కూడా ప్రకటించాం. త్వరలో వారికి నియామక పత్రాలు అందచేస్తాము.అలాగే, 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసాం.
  5. తెలంగాణ రాష్ట్ర సాధనలో మన యువత పాత్ర మరియు త్యాగాలు మరువలేనివి. తెలంగాణ సాధించుకున్న తరువాత వారి పట్ల గత ప్రభుత్వంనది దాటే వరకు ఓడ మల్లయ్య, దాటిన తర్వాత బోడ మల్లయ్యఅనే విధంగా ప్రవర్తించింది.వారి జీవితాలలో ఎటువంటి మార్పు రాకపోగా, ప్రభుత్వ ఉద్యోగాలు అందని ద్రాక్షగానే మిగిలాయి.
  6. కూటి కోసం, కూలి కోసం, పట్టణంలో బ్రతుకుదామని తల్లిమాట చెవిన పెట్టక బయలు దేరిన బాటసారికి ఎంత కష్టం… ఎంత కష్టం…
  • శ్రీ. శ్రీ.

నిరుద్యోగ యువత ఇటువంటిఒక నిస్సహాయ స్థితిలో ఉండగా, మా ప్రభుత్వం అధికారం చేపట్టి వారికి భవిష్యత్తుపై తిరిగి ఆశను రగిల్చింది. ప్రభుత్వ ఉద్యోగాల సత్వర భర్తీతో పాటు ఇతర రంగాలలో ఉపాధికల్పించే దిశగా, ముఖ్యంగా మహిళలు మరియు వెనుకబడిన వర్గాల యువత కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని గుర్తించింది.

  1. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువత స్వయం ఉపాధి కల్పన కొరకు రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించాం.ఈ పథకం యువతకి ఉపాధికల్పనలో ఒక గేమ్ ఛేంజర్ గా నిలుస్తుంది. కేవలం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కాకుండా,యువతని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది, వారు మరింత మందికి ఉపాధి సృష్టించేటట్టు ప్రోత్సహించడం మా ధ్యేయం.
  2. ఈ పథకం ద్వారా యువతకు కనీవిని ఎరుగని రీతిలో,ఆరు వేల కోట్ల రూపాయల కేటాయింపుతో ఈ పథకాన్ని ప్రారంభించాం.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పోరేషన్ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తాం. అర్హుడైన ప్రతి నిరుద్యోగికి గరిష్టంగా నాలుగు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తాం.యువత అభ్యున్నతికి ఈ పథకం గొప్పగా తోడ్పడుతుంది.

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం:

  1. 6 సివిల్స్ ప్రిలిమ్స్ పాసై మెయిన్స్ పరీక్షకు వెళ్లే అభ్యర్థులకు లక్ష రూపాయలు మరియు మెయిన్స్ పరీక్ష పాసై ఇంటర్వ్యూకి సిద్ధమయ్యే అభ్యర్థులకు మరొక లక్ష రూపాయలు, మొత్తంగా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని, సింగరేణి యాజమాన్య సౌజన్యంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం క్రింద ఇస్తున్నాం. తద్వారా, ఆల్ ఇండియా సర్వీసెస్ లో తెలంగాణ రాష్ట్రం నుండి మరింత మంది పేద, మద్యతరగతి కుటుంబాలకు చెందిన యువతీ, యువకులు ఎంపికయ్యే అవకాశం ఏర్పడుతుంది.

అధునాతన సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐలు (అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌):

  1. 6 రాష్ట్ర వ్యాప్తంగా ఏటా లక్ష మందికి నైపుణ్య శిక్షణను ఇచ్చేందుకు65 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రాలను, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రక్రియ పురోగతిలో ఉంది. టాటా టెక్నాలజీ సర్వీసెస్ వారి సౌజన్యంతో నిర్వహించే ఈ శిక్షణా కేంద్రాలలో, తెలంగాణ యువత తగిన ఉద్యోగ నైపుణ్యాలు సాధించేందుకు వీలుగా9 లాంగ్‌ టర్మ్‌, 23 షార్ట్‌ టర్మ్‌ కోర్సులతోపాటు, నైపుణ్యాల కొరత తీర్చేందుకు బ్రిడ్జి కోర్సులను ప్రవేశ పెట్టాం.

డిగ్రీ విద్యార్థుల కోసం BFSI (బ్యాకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ ) ట్రైనింగ్‌ కోర్సు:

  1. 6 డిగ్రీ, ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌,ఇన్సూరెన్స్‌(BFSI) రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా BFSI ట్రైనింగ్‌ కోర్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రెగ్యులర్‌ డిగ్రీతో పాటు మిని డిగ్రీ కోర్సుగా BFSIనైపుణ్య శిక్షణను అందించే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 38 కాలేజీల్లో ప్రారంభించాం.ప్రభుత్వం గుర్తించిన 18 ఇంజనీరింగ్‌ కాలేజీలలోనూ, 20 డిగ్రీ కాలేజీల్లోనూ చదువుతున్న 10 వేల మంది విద్యార్థులకు ఈ శిక్షణ అందుతుంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు కూడాలబ్ధి చేకూరేలాఈ కాలేజీలను ఎంపిక చేయడం జరిగింది.

అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లు :

  1. రాష్ట్రంలోని119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డా. బీ.ఆర్‌. అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనుకబడిన యువతీ, యువకులకు గ్రూప్-1, గ్రూప్-2 మరియు ఇతర అన్ని పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్‌ తీసుకునేందుకు అవకాశం లభిస్తుంది.

తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రం:

  1. యువకుల ఉద్యోగావకాశాలను ఇనుమడింపజేసి, వారి సాధికారతను పెంపొందించడానికి ప్రభుత్వం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రాన్నిపునరుద్ధరించి, కృత్రిమ మేథో విజ్ఞానం ఆధారంగా నడిచేలా అనుసంధానించింది.దీని ద్వారా,పరిశ్రమలు మరియు వివిధ రంగాల అవసరాలకు కావలసిన నిపుణులను గుర్తించి, నియమించుకొనే వెసులుబాటు కలుగుతుంది.

ఈ బడ్జెట్ లో కార్మిక మరియు ఉపాధికల్పన శాఖకు900 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.

పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి:

  1. 71. “గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం

– మహాత్మాగాంధీ

ఈ స్ఫూర్తితో మా ప్రభుత్వం గ్రామీణ వికాసానికి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో నిర్వీర్యం అయిన గ్రామీణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో కార్యాచరణను రూపొందించుకున్నాం.

  1. 72. 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం MNREGS పథకం క్రింద రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన నిధులను సకాలంలో చెల్లిస్తూ, పలు గ్రామీణాభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసింది. ఈ సంవత్సరంలో, ఇరవై ఐదులక్షల డెబ్భై ఆరు వేల (25.76 లక్షలు)కుటుంబాలకు ఉపాధి చేకూర్చాం. గ్రామీణాభివృద్ధిలో భాగంగా, 781 కోట్ల వ్యయంతో 26,055 సాంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించాము. 926 కోట్ల రూపాయల వ్యయంతో 82,286 గ్రామీణ రోడ్లను నిర్మించాము. 275 కోట్ల వ్యయంతో 51,216 పిల్ల కాలువల మరియు ఇతర కాలువల పూడికతీత పనులను పూర్తి చేసాం. 244 కోట్ల రూపాయలతో 63,854 భూమి అభివృద్ధి పనులను చేపట్టాం. అలాగే, 16,310 జల పరిరక్షణ పనులకు 155 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.

ఇందిరా మహిళా శక్తి

  1. 73. మన దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ మరియు లోక్ సభ తొలి మహిళా స్పీకర్ మీరాకుమార్వంటి మహిళలు ఎంతో సమర్థవంతంగా పనిచేసి వారి పదవులకే వన్నె తెచ్చారు. మన దేశంలోని ప్రతి మహిళకు కూడా అదే సమర్ధత ఉందని మా నమ్మకం.భారత దేశ సుస్థిరతకు కుటుంబ వ్యవస్థేపునాది, అందులో మహిళలదే ప్రముఖ పాత్ర.వారి ఆర్థిక స్వావలంబన కుటుంబ స్వావలంబనకు, దేశాభివృద్ధికి ఎంతో కీలకం.
  2. 7 స్త్రీ శక్తే దేశ శక్తి అని విశ్వసించి ఇందిరా మహిళా శక్తి మిషన్ ను ప్రారంభించాం. ఈ మిషన్ తో తెలంగాణలోమహిళా సాధికారతకునూతన శకం ప్రారంభమయింది. ఈ పథకంలో20 వేలకోట్ల రూపాయల రుణాన్నిఅందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని కూడా అధిగమించి, ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల (21,632 కోట్లు) రూపాయల రుణాలనిస్వయం సహాయక సంఘాలకు (SHGs) అందించాం. దీని ద్వారా, 2.25 లక్షలసూక్ష్మ పరిశ్రమలు స్థాపించబడి, మహిళలకు పెద్ద ఎత్తునఉద్యోగ అవకాశాలులభించాయి. ఇంతే కాకుండా, 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ప్రారంభించాం. 22 ఇందిరా మహిళా శక్తి భవనాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం 110 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇవిస్వయం సహాయక సంఘాలకువ్యాపార కేంద్రాలుగా పనిచేస్తూ,మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు కీలక భూమిక పోషిస్తాయి.
  3. 75. స్వయం సహాయక సంఘాలకు పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ లు కుట్టే బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది. యూనిఫాం కుట్టు చార్జీలను జతకు 75 రూపాయలకు పెంచడం జరిగింది. దానివల్ల, నేటి వరకు స్వయం సహాయక సంఘాలు 37.5 లక్షల యూనిఫామ్‌లను కుట్టడం ద్వారా దాదాపు28 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించాయి.ఇది మహిళలకుస్వయం ఉపాధి అవకాశాలను పెంచడంలో కీలకమైన ముందడుగు.అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంద్వారా 23,701 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు 634 కోట్ల రూపాయల వ్యయంతో స్వయం సహాయక సంఘాలకు అప్పగించబడ్డాయి.
  4. 7 వ్యాపార నిర్వహణలో మహిళలను మరింత ప్రోత్సహించడానికి ప్రతి మండలంలో వారితో రైసు మిల్లులు మరియు మిని గోదాములు స్థాపించి, నిర్వహించే విధంగా సహాయసహకారాలు అందిస్తాం. IKPకేంద్రాలలో కొన్న ధాన్యాన్ని కూడా ఆ మిల్లులలో మిల్లింగ్ చేయించి,FCIకి సరఫరా చేసే బాధ్యత మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తాం.

మహిళల ఆర్థిక భద్రత కోసం ప్రత్యేక బీమా పథకాలు:

  1. 77. రుణ బీమా పథకం కింద ఒక్కో స్వయం సహాయక సంఘసభ్యురాలికి 2 లక్షల రూపాయల సహజ మరణ బీమామరియు 10 లక్షల రూపాయల ప్రమాద బీమాఅందించబడుతోంది. తద్వారా, స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.

మహిళలకు వ్యాపార అవకాశాల్లో విస్తరణ:

  1. 78. మహిళలు గొప్ప వ్యాపారవేత్తలుగా రాణించగలరని ఇప్పటికే రుజువైంది. రిటైల్,రవాణా రంగాలలో మహిళా పారిశ్రామికవేత్తలకుకొత్త అవకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే 32 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్‌లు ఏర్పాటు చేయబడ్డాయి.నారాయణపేటలో తొలి స్వయం సహాయక సంఘాలమహిళలు నడిపే పెట్రోల్ బంక్ ఒక కోటి ఇరవై మూడులక్షలరూపాయల (1.23 కోట్లు)పెట్టుబడితో ప్రారంభించబడింది.రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి మరిన్ని పెట్రోలుబంకులు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మండల మహిళా సమాఖ్యల ద్వారా 600 బస్సులను TGSRTCకి అద్దెకు ఇచ్చేందుకు నిర్ణయించాం. ఇప్పటికే 150 బస్సులను అద్దెకు ఇవ్వడం జరిగింది.
  2. స్వయం సహాయక సంఘాలకుసోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ల స్థాపన, నిర్వహణను అప్పగిస్తున్నాము.ఈ సంఘాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి SERP, TGREDCO, TGSPDCL మరియు TGNPDCL మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు ద్వారా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవ్వడమే కాకుండా మహిళలకు జీవనోపాధి లభిస్తుంది. కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా లక్ష కోట్ల రూపాయలవడ్డీ లేని రుణాలను అందిస్తాము.

పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్ లో 31,605 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

స్త్రీ,శిశు సంక్షేమం:

  1. 80. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినుల ఆరోగ్యం, సంక్షేమం, భద్రతను మెరుగుపరిచేందుకు, పాఠశాలల పనితీరులోని లోపాలను గుర్తించేందుకు మహిళా ఐ.ఎ.ఎస్ అధికారులు వాటిని సందర్శించి, రాత్రిపూట బస చేసేలా ఆదేశాలు ఇచ్చాం. వాటి పనితీరును మెరుగుపరచడానికి తక్షణమే తీసుకోవలసిన చర్యలతో పాటు దీర్ఘకాలిక చర్యలను కూడా సిఫారసు చేయాలని వారిని ఆదేశించాం.
  2. 2024 ఆగస్టులో, తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మహిళా మంత్రులు, అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు తక్షణ, దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందిస్తుంది.
  3. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నింటిలోను మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. వారి ప్రగతిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలన్నింటిలోనూ మహిళల ప్రాధాన్యతను పెంచుతున్నాం.

మహిళా శిశు సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్ లో 2,862 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యూల్డ్ తెగలఅభివృద్ధి:

  1. 8 తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం మరియు సమానాభివృద్ధి పట్ల నిబద్దతను నిలుపుకునేలా షెడ్యూల్డ్ కులాల (SC) ఉపవర్గీకరణ చట్టం చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది. తాము ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సమాన హక్కులు, అవకాశాలు దక్కి తమ జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మిన వారికి ఇది ఒక వెలుగు రేఖ. SC కులాల ఉపవర్గీకరణ డిమాండ్ చాలా సంవత్సరాలుగా ఉంది.దీని ముఖ్య ఉద్దేశ్యం -అత్యంత వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం, విద్యా మరియు ఉపాధి అవకాశాల్లో న్యాయమైన వాటాకల్పించడం.2024 ఆగస్టు 1న, సుప్రీంకోర్టు ‘పంజాబ్ రాష్ట్రం vs దవీందర్ సింగ్’ కేసులో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుఈ సంస్కరణకు న్యాయపరమైన మార్గదర్శకంగా నిలిచింది.ప్రభుత్వం,జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేసి, SC ఉప కులాల వర్గీకరణ పై నివేదికను ఇవ్వమని కోరింది.
  2. 84. ఈ కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తూ, రాష్ట్రంలోని 59 SC ఉపకులాలను వారి సామాజిక-ఆర్థిక వెనుకబడిన స్థాయిని బట్టి మూడు వర్గాలుగావిభజించాలని సూచించింది.జస్టీస్ షమీమ్ అక్తర్ గారి నివేదికను ఆమోదించి దాని ప్రకారమే SC ఉప కులాల వర్గీకరణ చట్టాన్ని మాప్రభుత్వం తీసుకువచ్చింది.దేశంలోనే ఈ వర్గీకరణను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.ఈ నూతన చట్టంSC ఉప కులాల సాధికారతకు తొలి మెట్టు.ఈ చట్టం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ, సామాజిక సమానత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిక్సూచిగా మారనుంది.
  3. ఆదివాసీల, గిరిజనుల వైవిధ్య జీవన విధానాన్ని, వారి హక్కులను కాపాడుతూ, వారికి అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తున్నాం. గిరిజన అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక (STSDF) ద్వారా గిరిజన ప్రాంతాలలో వైద్యం, విద్య, జీవనోపాధి వంటి అనేక కీలక రంగాల్లో అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నాం. అంతే కాకుండా,ఈప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచి,వాటిని సమర్థంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
  4. గిరిజనాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఇందిరాగిరి జలవికాసం అనే ప్రత్యేక పథకంతో పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతుల కొరకు సౌర ఆధారిత పంపుసెట్ల ద్వారా సాగునీటిని అందించాలని నిర్ణయించాం.వచ్చే నాలుగు సంవత్సరాలలో12,600 కోట్లతో,2.1 లక్షల గిరిజన రైతులకు ఈ సౌకర్యం అందిస్తాం. పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తాం.
  5. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సబ్ ప్లాన్ చట్ట ప్రకారం ఖర్చు చేయాల్సిన నిధులలో ఎస్సీలకు చెందిన 13,617 కోట్లు, ఎస్టీలకు చెందిన 1,317 కోట్ల రూపాయలను ఖర్చు చేయకుండా బకాయి పెట్టింది. మా ప్రభుత్వం ఈ చట్టాన్ని తు.చ తప్పకుండా అమలు చేస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేటాయించాల్సిన మొత్తానికి అదనంగా, 2023-24 కి సంబంధించిన బకాయిలను కూడా కేటాయిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం చేసిన చట్టాలను గౌరవించి, వారికి న్యాయంగా చెందాల్సిన నిధులను అందించడం,ఈ వర్గాల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.

ఈ బడ్జెట్ లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమంకు 40,232 కోట్ల రూపాయలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంకు 17,169 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

వెనుకబడిన తరగతుల సంక్షేమం:

సమగ్ర, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ&కుల సర్వే (SEEEPC)

  1. సామాజిక ప్రజాస్వామ్యానికి అవసరమైన ప్రణాళికల రూపకల్పనకు మొదటి మెట్టు … మేము చేపట్టిన కులగుణన. చారిత్రాత్మక అసమానతలను రూపుమాపే లక్ష్యంతో గతంలో ఎన్నడూ చేపట్టని సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయమరియుకుల సర్వేను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. కుల ఆధారిత గణన గురించి ఎన్నో దశాబ్దాలుగా డిమాండ్లు కొనసాగుతున్నాయి.సముచిత ప్రాతినిధ్యం మరియు వనరుల సమాన పంపిణీ నిర్ధారించేందుకు ఇది అత్యంత ఆవశ్యకం. ఈ సర్వే రాష్ట్ర చరిత్రలోనే విస్తృతమైన శాస్త్రీయ, పారదర్శకడేటా సేకరణ కార్యక్రమంగా నిలిచి,మొత్తం 1.12 కోట్ల కుటుంబ వివరాలను సేకరించింది. ఈ సర్వేలో కులం, భూసంపద, విద్యా స్థాయి, ఉపాధి స్థాయి, రాజకీయ ప్రాతినిధ్యం మరియుప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది వంటి అన్ని ప్రధాన అంశాలను సమగ్రంగా సేకరించాం. 96శాతం కవరేజ్‌తో, ఈ సర్వే అత్యంత విజయవంతమైన సామాజిక-ఆర్థిక డేటా సేకరణగా నిలిచింది.
  2. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేందుకు, సమర్థవంతమైన పాలనకు, ఈ సర్వే కీలక డేటాను అందించింది. రానున్న పంచాయతీ ఎలక్షన్లలో వెనుకబడిన తరగతుల వారికి, వారి జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్లు అందించడానికి అవకాశం ఏర్పడింది. ఈ డేటా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు మరియుసమగ్ర ఆర్థిక అభివృద్ధి విధానాల రూపకల్పనకు ఆధారంగా మారనుంది. సంక్షేమ పథకాలలో బీసీలకు, ఇతర శాఖలనుండి కూడా కేటాయింపులు చేసి మరియు ఖర్చు చేయడం జరుగుతుంది. పశు సంవర్థక శాఖ ద్వారా చేపల పెంపకానికి, పరిశ్రమల శాఖ ద్వారా చేనేత కార్మికులకు చీరల పంపిణీ కోసం, వ్యవసాయ శాఖ ద్వారా రైతు భరోసా మరియు రుణమాఫీ పథకాల కింద వేల కోట్ల రూపాయలు వీరి కోసం ఖర్చు చేయడం జరుగుతున్నది.

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్ లో 11,405 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.

చేనేత:

  1. 90. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేనేత అభయ హస్తం పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా తెలంగాణ నేతన్న పొదుపు (పొదుపు నిధి), తెలంగాణ నేతన్న భద్రత (నేతన్న బీమా), తెలంగాణ నేతన్నకు భరోసాలను అమలు చేస్తున్నాం. 2018 నుండి 2022 వరకు మరమగ్గ కార్మికులకు బకాయి పడ్డ 10 శాతం నూలు సబ్సిడీ కింద ముప్ఫై ఏడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలను (37.49 కోట్లు) ఈ సంవత్సరంలో విడుదల చేశాం. చేనేత కార్మికుల కోసం రాజన్న సిరిసిల్ల, వేములవాడలో 50 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ తో నూలు డిపోను ఏర్పాటు చేశాం.
  2. 91. రాష్ట్రంలోస్వయంసహాయకసంఘాల్లో ఉన్న7లక్షలమందిసభ్యులకుఏటారెండునాణ్యమైనచీరలుఇవ్వాలనినిర్ణయించాం. ఆచీరలనుతయారుచేసేబాధ్యతమన రాష్ట్ర నేతన్నలకేఅప్పగించాలనినిర్ణయించాం.

చేనేత రంగానికిఈ బడ్జెట్ లో 371 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.

మైనారిటీ సంక్షేమం:

  1. రాష్ట్రంలో మైనారిటీలభద్రతకు, సంక్షేమానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ లలో, వివిధ ప్రాంతాలలో ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అంతర్భాగం అవుతాయి. తద్వారా మైనారిటీ విద్యార్థులకు కూడా ఇతర విద్యార్థులతో పాటు అత్యుత్తమ విద్యనభ్యసించే అవకాశం కలుగుతుంది.
  2. ముస్లిం సోదరులు అతి పవిత్రంగా భావించే హజ్ యాత్రకు తగినన్ని నిధులను కేటాయించాం. “హజ్‌-2024” యాత్రకు 11,446 మంది వెళ్లడం తెలంగాణ చరిత్రలో ఒక రికార్డు. రాజీవ్ యువ వికాసంలో భాగంగా మైనారిటీ సోదర, సోదరీమణులకు 840 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాలు చేపడుతాం.

మైనారిటీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్ లో 3,591 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

పారిశ్రామిక రంగం:          

MSME పాలసీ – 2024:

  1. సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో MSME పాలసీ 2024ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. రాబోయే ఐదేళ్లలో MSME ల అభివృద్ధి కోసం నాలుగు వేల కోట్ల రూపాయలను (4,000 కోట్లు) ఖర్చు చేసి, 25,000 కు పైచిలుకు కొత్త MSMEపరిశ్రమలను స్థాపించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పాలసీతో స్వయం సహాయక బృందాలు, MSMEలుగా మారేందుకు అన్ని దశల్లో సహాయం అందిస్తాం.

పారిశ్రామిక ప్రోత్సాహకాలు :

  1. నూతన పారిశ్రామిక పార్కుల్లో 5 శాతం ప్లాట్లు మహిళా పారిశ్రామికవేత్తలకు, 15 శాతం SC/ST పారిశ్రామికవేత్తలకు కేటాయించాలని నిర్ణయించాం. ప్రభుత్వం SC/ST పారిశ్రామికవేత్తలకు 50 లక్షల రూపాయల పరిమితికి లోబడి50 శాతం వరకు భూమి ధరలో రాయితీని ఇస్తుంది. అదనంగా, ప్రైవేట్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడానికిప్రభుత్వం స్టాంప్‌ డ్యూటీ తగ్గింపులు,విద్యుత్ వినియోగ చార్జీలు మరియు భూమి ధర రాయితీలను అందిస్తుంది. ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి, పాలసీలో మూలధన పెట్టుబడి రాయితీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టాం.

మెగా మాస్టర్‌ ప్లాన్‌2050 :

  1. 2050 నాటికి తెలంగాణ రాష్ట్రం అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్‌ ప్లాన్-2050 పాలసీని ప్రభుత్వం రూపొందించింది. హైదరాబాద్‌ ఒక్క చోటే పారిశ్రామిక ప్రగతి కేంద్రీకృతం కాకుండా,పారిశ్రామిక వికేంద్రీకరణ జరిపి తెలంగాణలోని అన్ని ప్రాంతాలు, హైదరాబాద్‌ తరహాలోనే అభివృద్ధి చెందాలన్నది ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోను ఐటీ, ఫార్మా, హెల్త్‌తో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌, స్పోర్ట్స్‌, ఆటోమొబైల్‌, గార్మెంట్స్, మెటల్ వేర్, చేనేత, ఆభరణాల తయారీ మొదలైన క్లస్టర్లను ఏర్పాటు చేసి, పరిశ్రమలనుఅభివృద్ధి పరచడానికి కావలసిన అన్ని చర్యలు చేపడతున్నాం. అంతేకాకుండా, హైదరాబాద్, వరంగల్ పారిశ్రామిక కారిడార్ ను NH 163 కి ఇరువైపుల ఏర్పాటు చేస్తాం.

గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్లు :

  1. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌‌ జిల్లాల పరిధిలో గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఔషధాల తయారీ కంపెనీలకు, బయోటెక్‌ మరియు లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించి గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం తోడ్పడుతుంది. యాంటీ బయాటిక్స్‌, సింథటిక్‌ డ్రగ్స్‌, వ్యాక్సిన్లు, న్యూట్రాస్యూటికల్స్‌, హెర్బల్‌ ఔషధ ఉత్పత్తులు, కాస్మోటిక్స్‌ సంబంధిత ఉత్పత్తులన్నింటికీ ఫార్మా సిటీలో ప్రాధాన్యత ఉంటుంది.

పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణ:

  1. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పెట్టుబడులకు గొప్ప ఆకర్షణ కేంద్రంగా మారింది. World Economic Forum ఆధ్వర్యంలో దావోస్ లో జనవరి, 2025 లో జరిగిన వార్షిక సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన ఐ.టి. పరిశ్రమల శాఖామాత్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పాల్గొని, ప్రపంచ పారిశ్రామికవేత్తలను కలిసి వారిని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడం జరిగింది. తత్ఫలితంగా టెక్నాలజి, గ్రీన్ ఎనర్జీ, డిఫెన్స్ మరియు డాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక రంగాలలో ఉన్న 16 ప్రపంచ అగ్రగామి కంపెనీలతో సుమారుఒక లక్ష డెబ్భై ఎనిమిది వేల కోట్ల రూపాయలు (1.78 లక్షల కోట్లు) పెట్టుబడుల ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. గత ఏడాదితో పోల్చితే, ఈ ఏడాది పెట్టుబడుల విలువ నాలుగు రెట్లు ఎక్కువ. అమెరికా, సౌత్ కొరియా మరియు సింగపూర్ దేశాల పర్యటనలో గౌరవ ముఖ్యమంత్రిమరో 14,900 కోట్ల రూపాయలు పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్ లో 3,527 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐ.టి) మరియు ఐ.టి ఆధారిత సేవలు:

  1. సేవా రంగం అభివృద్ధికి దోహదపడే సానుకూల ప్రభుత్వ కీలక నిర్ణయాల ఫలితంగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి రంగం గత సంవత్సరంగా ఎంతో అభివృద్ది చెందింది. కృత్రిమ మేథ, బ్లాక్ చైన్ వంటి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇస్తూ ఆధునిక ప్రక్రియల అభివృద్దికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది.
  2. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబర్ నెలలోAIగ్లోబల్‌సమ్మిట్‌-2024ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. USA,UK, నెదర్లాండ్స్‌, మలేషియాతో పాటు దాదాపు 100దేశాల కంపెనీ యజమానులు, AI నిపుణులు, స్టార్టప్‌లు, విద్యార్థులతో సహా10,000 మంది ప్రతినిధులుఈ సమ్మిట్ కుహాజరైనారు. NVIDIA, Microsoft, Amazon వెబ్‌ సర్వీసెస్‌,CDAC వంటి కీలకమైన AI కంపెనీలతోనూ, ఇతర స్టార్టప్‌లతోనూ ప్రభుత్వం 20 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకుంది. తెలంగాణని AI టెక్నాలజీలో అగ్ర భాగాన నిలిపేందుకు AIStrategic Road Map ని ఆవిష్కరించాం. AI ఆధారిత అంకురాలను (Startupcompanies) ప్రోత్సహించడం, ప్రభుత్వ ఉద్యోగుల మరియు యువత యొక్క AI నైపుణ్యతను పెంపొందించడం, పరిపాలనలో AI ని వినియోగించుకోవడం ఈ రోడ్ మ్యాప్ యొక్క ప్రధాన లక్ష్యాలు.
  3. ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా 200 ఎకరాలలో ప్రత్యేకంగా AI సిటీని నిర్మిస్తాం. ఈ AI సిటీ ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారుతుంది.గూగుల్ కంపెనీ ఇక్కడ AI ఆధారిత యాక్సిలరేటర్ (Accelerator) సెంటర్ ను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజి శాఖకు ఈ బడ్జెట్ లో 774 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

విద్యుత్:

  1. నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా సరఫరా చేయడం ప్రభుత్వ ధ్యేయం. సంప్రదాయ ఇంధన వనరులను ఒక ప్రక్క వినియోగించుకుంటూనే, సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం పై దృష్టి సారించడం ద్వారా, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం.
  2. 103. తెలంగాణ విద్యుత్ వినియోగంలో విశేషమైన వృద్ధిని సాధించింది. అంతే కాకుండా మన ట్రాన్స్ కో తక్కువ సరఫరా నష్టాలతో, దేశంలోనే అగ్రగామి విద్యుత్ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ సంవత్సరం తెలంగాణ గరిష్ట విద్యుత్ డిమాండ్ 16,918 మెగావాట్లకు చేరుకున్నా, మనం ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించగలిగాము.
  3. పునరుత్పాదక విద్యుత్ ఆవశ్యకతను గుర్తించి, తెలంగాణ ప్రభుత్వం “క్లీన్&గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025” ను ప్రకటించింది. ఈ విధానం ప్రకారం, 2030 నాటికి ఇరవై వేలమెగావాట్ల మరియు 2035 నాటికి నలభై వేలమెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ నిఅదనంగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు, శంకర్ పల్లి వద్ద 250 మెగా వాట్లు/500 MHz (Mega Hertz)బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. సింగరేణి సంస్థ, తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పోరేషన్ సంయుక్తంగా జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
  4. రైతులకు అందించే ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 11,500 కోట్లరూపాయలుసబ్సిడీ రూపంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కేటాయిస్తున్నది.అదనంగా,గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల వరకు,50 లక్షల కుటుంబాలకు మరియు రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.ఈ పథకాల కోసం ఈ బడ్జెట్ లో మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ :

  1. 106. నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం వీర్ల పాలెం గ్రామంలో టీజీ జెన్‌ కో ఆధ్వర్యంలో యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (YTPS) నిర్మాణానికి కావలసిన పర్యావరణ అనుమతుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోక పోవడం వలన తీవ్ర జాప్యం జరిగింది. మా ప్రభుత్వం కృషి చేసి అనుమతులు సాధించి, రెండు యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తినిప్రారంభించింది.2025 మే నాటికి అన్ని ఐదు యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.

విద్యుత్ అంబులెన్స్‌ సర్వీస్‌:

  1. 107. ప్రజలకు మెరుగైన విద్యుత్‌ సేవలు అందించేందుకు, దేశంలో ఎక్కడాలేని విధంగా విద్యుత్ అంబులెన్స్‌ సర్వీస్ ను ప్రభుత్వం ప్రారంభించింది. ఎక్కడైనా, ఏదైనా కారణంతో విద్యుత్‌ సమస్య ఉత్పన్నమైతే,ఫిర్యాదు చేయడానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశాం. ఫిర్యాదు అందిన వెంటనే విద్యుత్ అంబులెన్స్ లో సిబ్బంది అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తారు. ఈ అంబులెన్స్‌లో ఒక అసిస్టెంట్‌ ఇంజినీరు, ముగ్గురు లైన్‌మెన్లు 24 గంటలపాటు అందుబాటులో ఉంటారు. దీంట్లో ఒక ట్రాన్స్ ఫార్మర్, ధర్మల్ విజన్ కెమెరాలు, కేబుల్స్, రక్షణ పరికరాలు మరియు మరమ్మత్తుకు అవసరమైన ఇతర పరికరాలు ఉంటాయి. హైదరాబాద్‌లో 57 సబ్‌ డివిజన్లకు ఒక్కో వాహనం కేటాయించాం. త్వరలో ఈ వినూత్న సదుపాయాన్ని రాష్ట్రమంతా విస్తరిస్తాం.

విద్యుత్ శాఖకి ఈ బడ్జెట్ లో 21,221 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

వైద్యం-ఆరోగ్యం:

  1. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. 2023 డిసెంబర్ నుండి, ప్రభుత్వం వివిధ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ పథకం క్రింద1,215 కోట్ల రూపాయలను విడుదల చేసింది.ఇదిగత సంవత్సరాల కేటాయింపు కంటే 50 శాతంఅధికం.దీని ద్వారా, 2.84 కోట్ల మంది పౌరులకు నిరంతర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంది. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) క్రింద మన రాష్ట్రానికి అధిక నిధులు రాబట్టేందుకు వీలుగా మన రాష్ట్ర వాటా క్రమం తప్పకుండా సకాలంలో విడుదల చేసి, గతం కంటే ఎక్కువ నిధులు పొందగలిగాం.
  2. రాష్ట్రవ్యాప్తంగా 102 కేంద్రాల ద్వారా, ఉచిత డయాలిసిస్ సేవలు అందించబడుతున్నాయి.దీని ద్వారాలక్షకు పైగా రోగులకు ప్రయోజనం చేకూరి948 కోట్ల రూపాయల మేరకు ప్రజలపైఆర్థికభారంతగ్గింది. ఈ సేవలను మరింత విస్తరించేందుకు వీలుగా 95 కొత్త డయాలిసిస్ కేంద్రాలను మంజూరు చేయడం జరిగింది. అత్యవసర వైద్య సహాయాన్ని బలోపేతం చేయడానికి, అంబులెన్స్ సేవలు అందుబాటులో లేని మండలాల్లో 136 కొత్త అంబులెన్సులను ప్రవేశపెట్టాం.
  3. వైద్య విద్యమరియుఆసుపత్రుల మౌలిక సదుపాయాలను విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నాం. నూతన వైద్య కళాశాలలలో400 అదనపు MBBS సీట్లు అందుబాటులోకి వచ్చాయి.అదేవిదంగా, 16నూతన నర్సింగ్ కళాశాలలు మరియు 28 అనుబంధ హెల్త్ సైన్స్ కళాశాలల ద్వారాప్రతి సంవత్సరం 2,640 మంది విద్యార్థులకు అదనంగా వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం లభించనుంది.
  4. 111. వందేళ్లకు పైగా చరిత్రగల, శిధిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి తిరిగి పూర్వ వైభవం కలిగించేందుకు 27 ఎకరాల విస్తీర్ణంలో2,700 కోట్ల రూపాయల వ్యయంతోఅత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసాం.

వైద్య, ఆరోగ్య శాఖకి ఈ బడ్జెట్ లో 12,393 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ:

  1. 112. దేశంలోనే అత్యంత వేగంగా పట్టణీకరణ తెలంగాణలో జరుగుతోంది. పలు ఐ.టి. పరిశ్రమల ఏర్పాటు, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రభుత్వం చేపట్టే విప్లవాత్మక చర్యలు దీనికి దోహద పడుతున్నాయి. హైదరాబాద్ తో పాటు, తర్వాతి స్థాయి నగరాలైన వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలను కూడా అభివృద్ధి పరుస్తున్నాం. వరంగల్ ను విద్య, వైద్య మరియు ఐటి కేంద్రంగాను, నిజామాబాద్, ఖమ్మంలను వ్యవసాయాధారిత పరిశ్రమలకు, తయారీ రంగానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం.
  2. 113. హైదరాబాద్ నగరం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నందున, తదనుగుణంగా ప్రధాన మౌలిక సదుపాయలతో పాటు, నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు H-CITI ప్రణాళిక అమలుచేస్తున్నాం. ఈ ప్రాజెక్టులో భాగంగా, (31) ఫ్లైఓవర్‌లు,(17) అండర్ పాసెస్ లు, (10) రోడ్డు విస్తరణ పనులను ఏడు వేల ముప్పై రెండు కోట్ల రూపాయల(7,032కోట్లు)అంచనా వ్యయంతోప్రారంభించాము. 150 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులనుకూడా చేపట్టాం.
  3. జలమండలి ద్వారా 2024లో పలు విప్లవాత్మక ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది.ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ జలశయాలపై మొత్తం 20MLD సామర్థ్యం కలిగిన 4 మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపట్టాం. మూసీ ప్రక్షాళన లో భాగంగా, గోదావరి డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై స్కీమ్‌ కింద గోదావరి జలాలతో ఉస్మాన్‌ సాగర్‌, హిమయత్‌ సాగర్‌ జలాశయాలను నింపి, వాటిని పునరుజ్జీవింప చేయడానికి అవసరమైన పనులను చేపడుతున్నాం.
  4. గత కొన్ని దశాబ్దాల కాలంగా, ఎప్పుడు పట్టించుకోని మ్యాన్ హోల్స్ పూడిక తీత పనులు, ఒక స్పెషల్ డ్రైవ్ గా జల మండలి చేపట్టింది.3,025 కిలోమీటర్ల మురుగు నీటి లైన్లు శుభ్రం చేసి, 2.39 లక్షల మ్యాన్ హోల్స్ లో పూడికతీతపూర్తి చేయడం జరిగింది. ఫలితంగా ఇప్పటి వరకు మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన ఫిర్యాదులు 25 శాతానికి పైగా తగ్గాయి.
  5. ORRPhase-2 నీటి సరఫరా ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది.దీని ద్వారా HMDA పరిధిలో విస్తరించిన పట్టణ ప్రాంతాలకు త్రాగునీరు అందించబడుతుంది.పట్టణాలలో వరద సమస్యలను ఎదుర్కొనడానికి ప్రభుత్వం సమగ్ర నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.హైదరాబాద్‌లో వరదనీటిని నివారించేందుకు 5,942 కోట్ల రూపాయల వ్యయంతో సమగ్ర వరద నీరు పారుదల ప్రాజెక్ట్ ను మంజూరు చేయడం జరిగింది.
  6. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థలలో మౌలిక సదుపాయాల కల్పన మరియు అభివృద్ధి కొరకు 4,500 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ మొత్తాన్ని వచ్చే మూడేళ్లలో ఖర్చు చేసి, వాటికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తాం.

ఫ్యూచర్ సిటీ:

  1. 118. రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికంగా ఉండే మొట్టమొదటి నెట్-జీరో ఫ్యూచర్ సిటీని రూపొందించే దశలో ప్రభుత్వం ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలతో పోటిపడేలా, కాలుష్యరహితంగా, అత్యంత ఆధునికంగా, సకల సదుపాయాల కల్పనతో ఇది రూపొందుతుంది. శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ రహదారుల మధ్య 56 గ్రామాల్లో,765 చ.కి.మీ విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ మెగా అర్బన్ ప్రాజెక్టును పర్యవేక్షించడానికి ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) ఏర్పాటు చేసాం. ఈ సిటీలో మల్టిమోడల్ కనెక్టివిటి, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, గ్రీన్ బిల్డింగ్స్ లాంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. AI సిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ జోన్‌ లాంటివి ఫ్యూచర్ సిటీలో భాగంగా ఉంటాయి.

స్పీడ్‌ (SPEED) (స్మార్ట్‌ ప్రోయాక్టివ్‌, ఎఫిషియెంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ)

  1. 119. రాష్ట్ర ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా చేపట్టిన 19 ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలోపూర్తి చేయడానికి స్పీడ్‌ (స్మార్ట్‌, ప్రోయాక్టివ్‌, ఎఫిషియెంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ) పేరుతో వేగవంతమైన, సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. వీటిలో, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌ప్‌మెంట్‌, మెట్రో రైలు విస్తరణ, రీజినల్‌ రింగు రోడ్డు నిర్మాణం,ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణం, నూతన ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణం మరియు మాదకద్రవ్యాల నిరోధక వ్యూహాల అమలు, మొదలగు ప్రాజెక్టులు ఉన్నాయి.

మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకి ఈ బడ్జెట్ లో 17,677 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

నీటి పారుదల రంగం:

  1. పోరాడి తెలంగాణ సాధించుకున్నప్పటికీ, కృష్ణా మరియు గోదావరి నీటి కేటాయింపులల్లో మన రాష్ట్రానికి రావలసిన న్యాయమైన వాటా గురించి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి కార్యచరణ చేపట్టలేదు.అంతేకాకుండా,కృష్ణా జలాల్లోని811 TMCలలో,511 TMCల నీటిని ఆంధ్రప్రదేశ్ ను వాడుకొమ్మని గత పాలకులు అధికారికంగా చెప్పారు. ఈ చర్యతో తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం జరిగింది.
  2. మేము, మన రాష్ట్రానికి రావలసిన నీటి వాటా సాధించుకోవడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు సహేతుకమైన మరియు గణాంకాలతో కూడిన బలమైన వాదనలు వినిపించాం. మన దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తక్కువ కేటాయింపుతో ఎక్కువ నీటిని వినియోగిస్తున్న విషయాన్ని ట్రిబ్యునల్ ముందు ఉంచి, ఇరు రాష్ట్రాల నీటి వినియోగాన్ని ఖచ్చితంగా గుర్తించడానికి మరియు నియంత్రించడానికి టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించాం. మన నీరు దారిమళ్లకుండా, అవసరమైతే ఈ టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా భరించేందుకు సంసిద్దత వ్యక్తపరిచాం.
  3. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకొని ప్రాధాన్యత క్రమంలో ఎ, బి కేటగిరీలుగా విభిజించాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సేద్యంలోకి తీసుకురావలన్నది ప్రభుత్వ ఉద్దేశం. నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు నీటిని అందించడానికి వీలుగాఉదయ సముద్రం బ్రాహ్మణ వెలమల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను ప్రారంభించాం. ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి 6.70 TMCలనీటిని బ్రాహ్మణ వెలమల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు లిఫ్ట్ చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా,94 గ్రామాల్లో లక్ష ఎకరాలకు సాగు నీటిని మరియు ఫ్లోరైడ్ సమస్య ఉన్న 107 గ్రామాలకు తాగునీటిని అందించడమౌతుంది.
  4. 123. శ్రీ ఎస్. జైపాల్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా P. లక్ష్మి దేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రభుత్వం సత్వరం చేపడుతుంది. మూసీ ప్రాజెక్టు పరిధిలోని బునాదిగాని కాలువ పునరుద్ధరణ పనులకు రెండు వందల అరవై ఆరు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో (266.65 కోట్లు)పాలనాపరమైన అనుమతి ఇవ్వడం జరిగింది. యాదాద్రి జిల్లాలో మూసీ ప్రాజెక్టు కింద బునాదిగాని కాలువతోపాటు,పిల్లాయిపల్లి,ధర్మారెడ్డి పల్లి కాలువల పునరుద్ధరణకు ఈ నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించాం.

నీటి పారుదల శాఖకి ఈ బడ్జెట్ లో 23,373 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

రోడ్డు, భవనాల శాఖ ( ఆర్‌ అండ్‌ బీ)

  1. తెలంగాణ ప్రభుత్వం హైబ్రిడ్ అన్యూటీ మోడల్ (HAM) ద్వారా రహదారుల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. ఈ మోడల్‌లో 40 శాతం ప్రభుత్వ నిధులతో, 60 శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం. HAM మోడల్‌లో 2028 వరకు 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను సుమారు 28,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ది చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
  2. 125. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 769.35 కి.మీ. పొడవు కలిగిన రహదారుల నిర్మాణానికి మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల ఇరవై రెండు లక్షలరూపాయల(3,725.22 కోట్లు) మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. వీటిలో 55 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారులు, 9 వంతెనల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.
  3. 126. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి వీలుగా, ప్రతి పంచాయితీకి బి.టి రోడ్డు ఉండేలా రోడ్ల నిర్మాణం చేపట్టాం. గ్రామీణ ప్రాంతాలలో పాడైపోయిన రహదారుల మరమ్మత్తులు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. 12జిల్లా కేంద్రాల్లో కోర్టు భవన సముదాయాలనిర్మాణానికి 972 కోట్ల రూపాయలతో పాలనపరమైన అనుమతులను మంజూరు చేసాం.
  4. 127. రాష్ట్ర ప్రభుత్వ విశేష కృషి వల్ల ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న వరంగల్ జిల్లా మామునూర్‌ ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.ఇప్పటికే, దీనికి కావల్సిన 253 ఎకరాల భూ సేకరణకు నిధులు మంజూరు చేసాం. హైదరాబాద్ నగరానికి నలువైపుల జాతీయ రహదారి నెట్ వర్క్ లో ఉన్న లోటును పూడ్చడానికి రీజనల్ రింగు రోడ్డు ప్రణాళిక రూపొందించబడింది. ఈ రహదారిని ఎక్స్ ప్రెస్ వే ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని, మొదటగా నాలుగు లేన్లగా నిర్మించి భవిష్యత్తులో ట్రాఫిక్ కి అనుగుణంగా ఎనిమిది లేన్లకు విస్తరిస్తాం.ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఉత్తర భాగ భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. దక్షిణ భాగానికి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తయారీకి NHAI కన్సల్టెంట్ లను నియమించింది.ఈ ప్రాజెక్టును తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా ప్రభుత్వం పరిగణిస్తుంది.

రోడ్డు మరియు భవనాల శాఖకు ఈ బడ్జెట్ లో 5,907 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

పర్యాటక రంగం:

టూరిజం పాలసీ

  1. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం నూతన టూరిజం పాలసీ ని ఆవిష్కరించింది. GSDP లోపర్యాటక రంగం వాటాను 10 శాతానికి పెంచడం, 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి 3 లక్షల ఉద్యోగాలను సృష్టించడంతోపాటు, 2030 నాటికి 10 కోట్ల దేశీయ పర్యాటకులు, 5 లక్షల అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం ఈ పాలసీ యొక్కప్రధాన ఉద్దేశ్యం.
  2. ఈ పాలసీలో భాగంగా రాష్ట్రంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు,రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రీజనల్ రింగ్ రోడ్ (RRR) సమీపంలో మౌలిక వసతులు అభివృద్ధి చేయడంజరుగుతుంది. గోదావరి, కృష్ణా నదులపై జెట్టీలు, లాంచి స్టేషన్లు, వాటర్ స్పోర్ట్స్, హౌస్‌బోట్లు, నదీ ఉత్సవాలను ప్రోత్సహిస్తూ, పర్యాటక రంగంలో పెట్టుబడులకు మూలధన సబ్సిడీలు, భూమి వినియోగ మార్పిడికి సంబంధించిన రాయితీలుఇవ్వబడుతాయి. నల్లమలలో పర్యాటక ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 242 కోట్ల రూపాయలతో పనులు చేపట్టింది.

పర్యాటక శాఖకు ఈ బడ్జెట్ లో 775 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

సాంస్కృతిక రంగం:

  1. 130. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గీతం “జయ జయ హే తెలంగాణ – జననీ జయ కేతనం”.మన కవి అందె శ్రీ రచించిన ఈ గీతం తెలంగాణ ప్రజల అస్తిత్వానికి, పోరాట దీక్షకి, త్యాగాలకి మరియు విజయాలకి ప్రతీక. దీనిని మన రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించి, తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను, ఆశయాలను గౌరవించుకున్నాం.
  2. 131. తెలంగాణ తల్లి రూపుని అధికారికంగా గుర్తించి, ఆ తల్లి విగ్రహాన్ని అత్యంత వైభవంగా రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ప్రతిష్టించాం. కుల, వర్గమరియు ప్రాంతీయ గుర్తింపులను అధిగమిస్తూ, ఆత్మగౌరవం, సాధికారతమరియు సమగ్రతను ప్రదర్శించేలా ఈ విగ్రహాన్ని రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సినీ, టీవి, నాటక కళారంగానికి ప్రతిష్టాత్మకంగా ఇచ్చే గద్దర్ ఫిలిం అవార్డ్ లను వచ్చే నెలలోనే ఇవ్వబోతున్నాం.

క్రీడలు:

  1. 132. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర క్రీడా విధానాన్ని ప్రవేశపెట్టి, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఫ్యూచర్‌ సిటీ లో స్పోర్ట్స్‌ హబ్‌ను ఏర్పాటు చేయనున్నాం. 12 క్రీడల అకాడమీలను స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో భాగంగా ఏర్పాటు చేస్తాం. అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలతో పాటు, ఈ స్పోర్ట్స్‌ హబ్‌లో స్పోర్ట్స్‌ సైన్స్‌ సెంటర్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ సెంటర్‌ లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
  2. 133. మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మొహమ్మద్‌ సిరాజ్‌ టీ-20 వరల్డ్‌ కప్ లోరాణించి తెలంగాణ రాష్ట్రానికి కీర్తి, ప్రతిష్టలు తీసుకొచ్చారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం సత్కరిస్తూ, డీఎస్పీ ఉద్యోగంతో పాటు జూబ్లీహిల్స్ లో 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఇక ఇస్తాంబుల్ లోజరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్‌ లో వర్డల్‌ ఛాంపియన్ షిప్ సాధించిన నిఖత్‌ జరీన్ ను మా ప్రభుత్వం డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
  3. 134. పారాఒలింపిక్స్‌-2024లో సత్తా చాటి, పతకం గెలిచిన తొలి తెలంగాణ మహిళ యువఅథ్లెట్‌ దీప్తి జీవాంజిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించి, కోటి రూపాయల నగదుతో పాటు, గ్రూప్‌-2 ఉద్యోగాన్నీ, వరంగల్‌లో 500 గజాల ఇంటి స్థలాన్నీ ఇచ్చింది.
  4. క్రీడలను మరింత ప్రోత్సహించడానికి ప్రభుత్వం CMకప్ టోర్నమెంట్ ని ఇటీవలే నిర్వహించింది. 36 విభాగాలలో వివిధ ఈవెంట్లు నిర్వహించాం. దాదాపు మూడు లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమం అత్యంత విజయవంతమయింది.

క్రీడా శాఖకు ఈ బడ్జెట్ లో 465 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.

అడవులుపర్యావరణం:

  1. 136. పర్యావరణ కాలుష్య నివారణలో పచ్చదనం పాత్ర అతి ముఖ్యమైనది. రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలను నాటాలనే అతి భారీ లక్ష్యంతో “వజ్రోత్సవం వన మహోత్సవం” కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటి వరకు 18.71 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ భాగంలో ఉన్న రెండు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాం.
  2. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమ్రాబాద్ లో అటవీ అతిథి గృహాల అభివృద్ధి, సఫారీ సేవలు, ట్రెక్కింగ్ మార్గాలు, సోమశిల వద్ద బోటింగ్ మరియు కారవాన్ క్యాంపింగ్ సదుపాయాల కల్పన చేపట్టాం. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతాలను ఎకోటూరిజం కేంద్రాలుగా పర్యావరణ హితం, వన్యప్రాణుల సంరక్షణ నిబంధనల మేరకు అభివృద్ధి చేస్తాం.
  3. తెలంగాణ అటవీ విస్తీర్ణం ప్రస్తుత 24.05 శాతం నుంచి 33 శాతం వరకు పెంచేలా జాతీయ అటవీ విధాన లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పట్టణీకరణ, పారిశ్రామీకరణ ద్వారా ఏర్పడే కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు, ప్రకృతి పరిరక్షణలో సమతుల్య అభివృద్ధి అనివార్యమని ప్రభుత్వం గ్రహించి ఆ దిశగా చర్యలు చేపట్టింది.

అడవులు మరియు పర్యావరణ శాఖకు ఈ బడ్జెట్ లో 1,023 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

దేవాదాయ, ధర్మాదాయ:

  1. మా ప్రభుత్వం తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ యాదాద్రిని తిరిగి యాదగిరిగుట్టగా ప్రకటించింది. యాదగిరిగుట్ట దేవాలయ విమాన గోపురానికి మొత్తం 65 కిలోల బంగారంతో తాపడం పనులుపూర్తిచేసి, సంప్రోక్షణ మహోత్సవం నిర్వహించాం. తిరుమల తిరుపతి దేవస్థానం (టీ.టీ.డీ.) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్‌ బోర్డును ఏర్పాటు చేస్తున్నాం.
  2. 140. మహబూబ్ నగర్జిల్లా అమ్మాపురంలోని కురుమూర్తి దేవాలయం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.110 కోట్ల రూపాయలతో ఘాట్‌ రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులుఇప్పటికే మొదలయ్యాయి. రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ఆధ్వర్యంలో గోదావరి నదీ హారతి కార్యక్రమాన్ని ప్రారంభించాం. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన వేములవాడ అభివృద్ధికి ఇప్పటికే 100 కోట్ల రూపాయలను మంజూరు చేసాం. దానికి సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తాం.

దేవాదాయ శాఖకు ఈ బడ్జెట్ లో 190 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

శాంతి భద్రతలు:

  1. 141. న్యాయం మరియు చట్టవ్యవస్థ పరిరక్షణ అనేది రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల అమలుకు అత్యంత ఆవశ్యకం. ప్రభుత్వం ప్రధానంగా టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌పై దృష్టి పెట్టి, పౌరులకు పారదర్శకంగా మరియు స్నేహపూర్వకంగా, వేగవంతమైన మరియు సమర్థవంతమైన సేవలందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది.
  2. 142. నిరంతరాయంగా బాధ్యతాయుతమైన విధులను నిర్వహించే పోలీసు ఉద్యోగులు తమ పిల్లల చదువుల విషయంలో నిశ్చింతగా ఉండడానికి గాను సైనిక్‌ స్కూళ్ల మాదిరిగా రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో యంగ్ ఇండియా పోలీస్ రెసిడెన్షియల్ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలతో,క్రీడా ప్రాంగణాలతో వసతీ సౌకర్యాలతోఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసాం. ఈ పాఠశాలలో పోలీసుల పిల్లలతో పాటు, పోలీస్‌ అమరవీరులు, అగ్నిమాపక, ఎక్సైజ్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌, జైళ్ల విభాగాలలో పని చేసే వారి పిల్లలకు కూడా ప్రవేశం కల్పిస్తాం.
  3. 143. క్షేత్ర స్థాయిలో అత్యంత కీలకమైన హోంగార్డుల రోజువారి వేతనాన్ని 921 రూపాయల నుండి 1,000రూపాయలకి పెంచాం. సహజ మరణం లేదా విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతిచెందిన హోం గార్డుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలఎక్స్ గ్రేషియా అందజేస్తున్నాం. దీని ద్వారా, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్గుతుంది.
  4. 144. డ్రగ్స్ రహిత తెలంగాణ సాధించే కార్యచరణలో భాగంగా, రాష్ట్ర ఐ.టి. డిపార్ట్ మెంట్మరియు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (TGANB) ల భాగస్వామ్యంతోమిత్ర యాప్‌ను రూపొందించడం జరిగింది. మాదక ద్రవ్యాలను వినియోగించే విద్యార్థులలో కనిపించే ప్రవర్తన లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు ఈ యాప్ సహాయ పడుతుంది. ఇది కృత్రిమ మేథఆధారంగా పని చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాలలో ఉన్న 1,000 పాఠశాలలకు దీని ద్వారా సేవలు అందుతున్నాయి. త్వరలోనే దీనిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తాం.
  5. మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో మా ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. మాదక ద్రవ్యాలకి సంబంధించిన నేరాలలో ఉన్నవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించక వారిపై ఉక్కుపాదం మోపుతాం. గత సంవత్సర కాలంలో 148 కోట్ల రూపాయల విలువైన మత్తుమందులు జప్తుచేసి, మాదక ద్రవ్యాల సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకున్నాం.

హోం శాఖకు ఈ బడ్జెట్ లో 10,188 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది.

ముగింపు:

గౌరవ అధ్యక్షా….

  1. 146. గత దశాబ్దంగా రాష్ట్రం ఎదుర్కొన్నఅనేక సవాళ్లను అధిగమించి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో కొనసాగుతోంది. మన రాష్ట్రానికి ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ సుసంపన్నత, సమగ్రత, మరియు స్థిరమైన అభివృద్ధితో కూడిన తెలంగాణను నిర్మిస్తాం. ప్రతి పౌరునికి విద్య, ఆరోగ్యం, ఉపాధి, మరియు సామాజిక భద్రతను కల్పించే స్థాయికి ఈ రాష్ట్రాన్ని తీసుకువెళ్లడమే మా లక్ష్యం.
  2. 147. ఈ బడ్జెట్‌లో ప్రస్తావించిన ప్రణాళికలు కేవలం ఆర్థిక కేటాయింపులు మాత్రమే కాదు,ఇవి సమాన అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికిమరియు సామాజిక న్యాయానికి మార్గదర్శికలు.మా ప్రభుత్వం సామాజిక న్యాయం, అభివృద్ధి,సంక్షేమ సమ్మిళిత విధానాలతో ప్రగతివైపు అడుగులు వేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నది.ఈ విధానాల విజయంమీ అందరి సహకారంపై ఆధారపడి ఉంటుంది.దృఢసంకల్పం, మొక్కవోని నిబద్ధత మరియుప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో మాత్రమే ఇది సాధ్యమౌతుంది.
  3. 148. ప్రజల హృదయాలను ప్రతిభింబించేలా మా ప్రభుత్వ విధానాలు రూపొందించబడ్డాయి. రైతులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, దినసరి కూలీల నుండి ఐటీ నిపుణుల వరకుప్రతి ఒక్కరినీ మా అభివృద్ధి పథకాలు బలోపేతం చేస్తాయి. ప్రజా ప్రతినిధులుగా, తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం మరియు బాధ్యత మనపై ఉంది. సమిష్టి కృషితో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు, దేశానికే తలమానికంగా తెలంగాణ నమూనాను ఉంచేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ ఉజ్వల భవిష్యత్ మనందరి ఉమ్మడి బాధ్యతగా గుర్తెరగాలని సవినయంగా మనవిచేస్తూ, ఈ బృహత్తర యజ్ఞంలో అందరి సహకారం కావాలని కోరుకొంటున్నాను.
  4. 1 విభేదాలను అధిగమించి, నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొని, ప్రజోపయోగమైన ఫలితాలను సాధించేందుకు కలిసికట్టుగా పనిచేయడం మనందరివిధి. రాజకీయాలకు అతీతంగా ఈ సభలోని సభ్యులందరు, బడ్జెట్‌లో సూచించిన ప్రగతిశీల చర్యలకు సంపూర్ణ మద్దతునివ్వాలనివిజ్ఞప్తి చేస్తున్నా. లోతుగా చర్చించి, విశ్లేషించి, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మనం నిర్ణయాలు తీసుకోవాలి. నేటి మన విధానాలే రేపటి తెలంగాణ నిర్మాణానికిఉపకరిస్తాయి. లౌకిక విలువలను స్ఫూర్తిగా నమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం కుల, మత భేదం లేకుండా అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి వనరుల పంపకం జరగాలని తద్వారా సమాజంలో అసమానతలు లేని వ్యవస్థ స్థాపన లక్ష్యంగా ఈ బడ్జెట్ ను రూపొందించాం.

2025-26 బడ్జెట్ అంచనాలు:

  1. 150. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ. 36,504 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను.
  2. 2025-26 సంవత్సరపు బడ్జెట్‌ ప్రతిపాదనలనుపరిశీలన, చర్చమరియు ఆమోదం కోసం ఈ సభకు సమర్పిస్తున్నాను. తెలంగాణనుప్రగతిబాటలో నడిపేందుకు మీ అందరి మద్దతును హృదయపూర్వకంగాఆశిస్తున్నాను.

//జై హింద్…..జై తెలంగాణ……//

Latest News

వాడి పడేసిన డబ్బల్ని వాడే ఇకమతు!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! ఉపాయం ఉంటే ఊరేగొచ్చట!! వాడి పడేసే డబ్బాల్ని గిట్ల వాడే ఇకమతు శేస్తున్న గీ అక్క ఉపాయం సూత్తే మీరే పరేషాన్ అయితరు! మనం పండ్లు కొంటే గ...

శాంతి చర్చలు-సజీవంగా ఆశలు!?|EDITORIAL

ప్రపంచంలో యుద్ధోన్మాద ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు విఫలమవడం, ఇజ్రాయెల్ పాత్ర, చమురు సరఫరాలో ప్రతిష్టంభన, అంతరాయం ప్రపంచాన్ని అస్థిరత వైపు నెడుతున్నాయి. శాంతి...

15-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ త్రయోదశి రాత్రి 08.17 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం 01.10 వరకు ఉత్తరాభాద్ర యోగం బ్రహ్మ ఉదయం 11.27 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం 08.41 వరకు ఉపరి...

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News