కాంగ్రెస్ వైఫల్యం వల్లనే వరంగల్ జిల్లాలో లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి
బాబును ప్రశ్నించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు.
బాబు కు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నాడు.
జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో వున్న మాజీ మంత్రి హరీష్ రావు జనగామ జిల్లా కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ స్పీకర్, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనచారి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ…. మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎండల వల్ల పంటలు ఎండిపోతుంటే కెసిఆర్ , హరీష్ రావు సంతోషపడుతున్నారని అన్నాడన్నారు. అలాగే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కెసిఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎండలు కొట్టాయి. కానీ ఆనాడు ఎందుకు పంటలు ఎండలేదు, ఈరోజు ఎందుకు ఎండిపోతున్నాయి? అని ప్రశ్నించారు. మండుటెండల్లో కూడా వాగులు, వంకలు, చెరువుల్లో నీళ్లు ఉండేవి. ఒక ఎకరం కూడా ఎండకుండా కెసీఆర్ గారి పాలనలో పంట పండింది కానీ పాలన చేతకాక ప్రకృతిపైన, ప్రతిపక్షాలపైన నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుండని దుయ్యబట్టారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని అన్నారు. దేవాదుల ఓ అండ్ ఎం కాంట్రాక్టర్ కు 7000 కోట్లు బిల్లులు చెల్లించకపోవడం వల్ల 33 రోజులు పంపుల మోటర్లు ఆన్ చేయలేదు. 33 రోజులు దేవాదుల పంపుల మోటార్లు ఆన్ చేసి ఉంటే రిజర్వాయర్లు నిండేవి, పొలాలకు నీళ్లు వచ్చేవి అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన తప్పును ప్రకృతి మీద మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నీళ్లు ఇవ్వద్దని మోటార్లకు అడ్డంగా హరీష్ రావు, బిఆర్ఎస్ నాయకులు నిలుచున్నారా అనేది ప్రజలు గమనించాలి అన్నారు. రేవంత్ రెడ్డిది 20- 20 మ్యాచ్ అని అన్నాడు మొన్న, ఫైనాన్స్ లో బిల్లులు ఇవ్వాలంటే 20% కమిషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20% కమిషన్, మున్సిపల్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ లకు, గేటెడ్ కమ్యూనిటీలకు పర్మిషన్ ఇవ్వాలంటే 20% కమిషన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి అన్నారు. కాంగ్రెస్ వైఫల్యం వల్లనే వరంగల్ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు.

