Tuesday, September 15, 2026
25.2 C
Hyderabad

ఆకాశంలో సగం…!అవకాశాల్లో సమం!!

-అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పథకాల మహోత్సవం

ఆకాశంలో సగం. ఈ భూమి మీద సగం. జనాభాలో సగం. అవకాశాల్లోనూ సమంగా ఉండాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి నేత్రుత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసమే అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది. మహిళల సాధికారతే లక్ష్యంగా పని చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలకు పెద్దపీట వేస్తూనే, మిగతా అనేక పథకాలను అమలు చేస్తున్నది. మహిళలే లబ్ధిదారులుగా ఆయా పథకాలను అందిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘అడుగు’ పాఠకుల కోసం ఆయా పథకాల వివరాలు.

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.

మహాలక్ష్మి
రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇప్పటివరకు దాదాపు 148.51 కోట్ల మంది మహిళలు జీరో టికెట్లు తీసుకున్నారు. ప్రయాణ ఛార్జీల భారం తగ్గిపోవటంతో దాదాపు రూ.4970.56 కోట్లు మహిళలకు ఆదా అయింది.

గృహ జ్యోతి
గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడే గృహ వినియోగదారులందరికీ జీరో బిల్లులు జారీ చేసింది. మార్చి నుంచి ఇప్పటివరకు 50 లక్షల కుటుంబాలకు ప్రతి నెలా ఉచితంగా గృహ విద్యుత్తును అందిస్తుంది. ఈ జీరో బిల్లులకు ప్రభుత్వం రూ.1775 కోట్లు సబ్సిడీగా చెల్లించింది.
రూ.500లకే గ్యాస్ సిలిండర్
మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ప్రస్తుతం ఈ పథకం కింద 42.90 లక్షల మందికి లబ్ధిచేకూరుతోంది. సబ్సిడీ కింద లబ్ధిదారులు ఉపయోగించిన 1 కోటి 63 లక్షల 08 వేల 833 సిలిండర్లకు రూ. 433.21 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించింది.

ఇందిరమ్మ ఇండ్లు
మార్చి 11న రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. రూ.22,500 కోట్లతో 4,50,000 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 ఇందిర‌మ్మ ఇళ్లను మంజూరు చేసింది. రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. గూడు లేని వారికి ప్రభుత్వ స్థలంతో పాటు ఆర్థిక సాయం అందిస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ప్రారంభించింది.

మహిళలకు తగిన గుర్తింపు
ఇవేగాక, ప్రభుత్వం ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ రూ. 2 కోట్ల పారితోషకం అందచేసింది. 2024 ఏడాదిని రైతు మహిళా యువత నామ సంవత్సరంగా సంకల్పించింది.
కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో స్వయం సహాయక మహిళా సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయంగా సమావేశమయ్యారు. మహిళా రక్షణ కోసం టీ సేఫ్ ను సీఎం ప్రారంభించారు. టీ సేఫ్ ద్వారా మహిళల భద్రత కోసం ప్రయాణ పర్యవేక్షణ జరుగుతున్నది. కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టారు. పారా ఒలింపిక్స్ లో క్యాంస పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవంజికీ కోటి రూపాయలు చెక్కు అందజేత. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా స్వయం సహాయక సభ్యుల సంఖ్య 65 లక్షల నుంచి కోటి మందికి పెంపు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి, సమానత్వానికి పోరాడిన సావిత్రిబాయి ఫూలే జయంతి (జనవరి 3)ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన త్రిష కు కోటి రూపాయలు, ఇదే టీం మెంబర్ తెలంగాణ కు చెందిన ధృతి కేసరి కి 10 లక్షల రూపాయలు, టీం హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి పది లక్షల చొప్పున ప్రోత్సహకాలు అందచేశారు.

1.బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి ద్యారా రుణ మద్దతు: వచ్చే ఐదేళ్ళలో బ్యాంకు బ్యాంకు లింకేజీ, స్తీ నిధి ద్వారా స్వయం సహాయక సంఘాలు రూ.1 లక్ష కోట్లకు రుణం పొందుతాయి. రూ.20వేల కోట్ల లక్ష్యం కాగా, ఈ ఆర్థిక ఏడాదిలో సంఘాలు మొత్తం రూ. 21,632 కోట్ల బ్యాంకు లింకేజీ లక్ష్యాన్ని సాధించాయి. సూక్ష్మ సంస్థల ఆర్థిక సహాయంలో భాగంగా ఈ ఏడాది 2 లక్షల 25వేల110 సంస్థలు మొత్తం రూ.4,825.54 కోట్ల విలువతో ఏర్పాటయ్యాయి.

2.ఇందిరా మహిళా శక్తి భవనాలు: మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం 22 జిల్లా సమాఖ్యల కోసం రూ.110 కోట్ల వ్యయంతో 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేసింది. 15వేల చ. అ. విస్తీర్ణంలో ఈ భవనం 2 అంతస్తులను కలిగి ఉంటుంది. ఈ భవనాన్ని జిల్లా సమాఖ్య సమావేశాలు, సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్‌, శిక్షణా కేంద్రంగా, ఉమ్మడి పని ప్రదేశంగా, ప్రదర్శనల నిర్వహణ, సరస్‌ మేళాలు, ఇతర జీవనోపాధి/ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగిస్తారు.

3.ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు: స్వయం సహాయక సంఘాల మహిళలను శక్తివంతం చేయడానికి కమ్యూనిటీ ఆధారిత క్యాంటీన్లను ప్రారంభించింది. ఈ క్యాంటీన్లు పూర్తిగా మహిళల యాజమాన్యం, నిర్వహణలో ఉంటాయి, ఇవి సచివాలయం, కలెక్టరేట్లు, రిజిస్ట్రేషన్‌, మున్సిపల్‌ కార్యాలయాలు, కోర్టులు, కళాశాలలు, దవాఖానాలు, దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, పారిశ్రామిక పార్కులు మొదలైన వివిధ సంస్థలను సందర్శించే పౌరులకు నాణ్యమైన, శుచి, రుచి, శుభ్రమైన ఇంటి శైలి భోజనం అందించబడుతుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 214 క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి.

4.ఇందిరా మహిళా శక్తి బజార్‌: గ్రామీణ కళాకారులను ప్రపంచ మార్కెట్‌ తో అనుసంధానింస్తూ, సంఘాల సాధికారత కోసం ప్రభుత్వం శిల్పారామంలోని 106 దుకాణాల సముదాయాన్ని కేటాయించింది. ఈ సముదాయంలో ఫుడ్‌ కోర్ట్‌, స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక, యాంఫిథియేటర్‌, ఆహార ఉత్సవాలు ఉంటాయి.

5.విద్యార్థులకు యూనిఫాంలు కుట్టడం: పాఠశాలల యూనిఫాం కుట్టే పనిని మహిళా సంఘాలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుట్టు ఛార్జీలను రూ.50 నుండి రూ.75కి పెంచింది. 2024-25లో 2,259 మహిళా శక్తి కుట్టు కేంద్రాలు 29,680 స్వయం సహాయక సంఘాల మహిళా దర్జీలను నియమించాయి. 37,58,988 యూనిఫాంలను కుట్టడం ద్వారా మొత్తం రూ.728.09 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి.

6.అమ్మ ఆదర్శ పాఠశాల: ప్రతి పాఠశాలలో ఏర్పడిన ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల” ద్వారా రూ. 634 కోట్ల విలువైన 23,701 పనులు అమలు చేయబడ్డాయి. ఈ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాలు మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, తరగతి గదులను పునరుద్ధరించదానికి వీలు కల్పిస్తుంది.

7.ప్రమాద, రుణ బీమా: సంఘాల మహిళలకు ఆర్థిక భద్రతను కల్పించడానికి, సమ్మిళిత బీమా పథకం అమలు చేస్తున్నారు. రూ. 2 లక్షల రుణ బీమా ఉంది. ఇప్పటివరకు 3,066 క్లెయిమ్‌లు నమోదయ్యాయి. రూ.10 లక్షల ప్రమాద బీమా వథకం సభ్యులందరికీ అందుబాటులో ఉంది.

8.మొబైల్ ఫిష్‌ రిటైల్ అవుట్‌లెట్లు: మహిళల జీవనోపాధిని మెరుగుపరచడానికి, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద మత్స్య శాఖ, సెర్ప్ ఆర్థిక సహాయంతో మొబైల్‌ ఫిష్‌ రిటైల్‌
అవుట్‌లెట్‌లను (MFROలు) మంజూరు చేసింది. మొదటి దశలో, 60% సబ్సిడీతో ఒక్కొక్కటి
రూ.10 లక్షలతో 32 యూనిట్లు ఒక్కో జిల్లాకు ఒకటి చొప్పున మంజూరయ్యాయి. రెండవ దశలో అదనంగా 64 యూనిట్లు మొదలవుతాయి.

9.సోలార్‌ పవర్‌ ప్లాంట్లు: ఇందిరా మహిళా శక్తి పథకం కింద SHGen లేదా వాటి సమాఖ్యల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి 19 నవంబర్‌ 2024న SERP, TGREDCO, TGSPDCL, TGNPDCL మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా, తెలంగాణ 1000 MW సోలార్‌ పవర్‌ను ఉత్పత్తి చేయాలని, జీవనోపాధిని మెరుగుపరచాలని, 2030 నాటికి దేశంలోని ఖనిజ, ఇంధనేతర లక్ష్యాలకు సహకరించాలని భావిస్తోంది.

10.స్వయం సహాయక సంఘాల మహిళల కోసం ఆర్టీసి బస్తులు: మహిళా సంఘాలకు ఆర్థిక స్వావలంబన కల్పించే వినూత్న నిర్ణయం. ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపుతో మహిళలు అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు పడింది. మొదటి విడత 150 మండల సమాఖ్యలకు 150 బస్సులు, త్వరలో మిగిలిన 450 బస్సులు అంద చేస్తారు. ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ అందించి మద్దతునిస్తుంది.

11.జిల్లా సమాఖ్యలకు పెట్రోల్‌ బంకులు: మహిళా శక్తి విధానం కింద, ముఖ్యమంత్రి నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్యల ద్వారా నిర్వహిస్తున్న మొట్ట మొదటి పెట్రోల్‌ బంకును రూ.1.23 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. త్వరలో అన్ని నియోజకవర్గాలలో విస్తరించడానికి నిర్ణయించారు.

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News