ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిచిన వెంటనే ఢిల్లీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వెలుపల ఫైల్‌లు, పత్రాలు, కంప్యూటర్ హార్డ్‌వేర్ వంటి వస్తువులను GAD అనుమతి లేకుండా తీసుకెళ్లరాదని అధికారులను ఆదేశించారు. డిపార్ట్‌మెంట్‌లు, కార్యాలయాల పరిధిలోని బ్రాంచ్ ఇన్‌చార్జ్‌లు తమ సెక్షన్‌లోని రికార్డుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఉత్తర్వులు సచివాలయ కార్యాలయాలు, మంత్రి మండలి క్యాంపు కార్యాలయాలకు కూడా వర్తిస్తాయి. ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు

