కేంద్ర మంత్రి బండి సంజయ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీపై అసంతృప్తితో, బీజేపీకి మద్దతు ఇచ్చారని అన్నారు. “ప్రజలు అవినీతి, కుంభకోణాలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరడం ఊహించిందే,” అని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలోనూ ఇదే తరహా మార్పు వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడింటిలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీ తరహాలోనే తెలంగాణలో కూడా ప్రజలు బీజేపీకి మద్దతు తెలియజేస్తారని, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

