Friday, May 1, 2026
26.7 C
Hyderabad

ప్రభుత్వ బడుల అభివృద్ధి మా ప్రాధాన్యం: రాజగోపాల్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై 24 గంటలూ ఆలోచిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసేవనే తన లక్ష్యమని, రాజకీయాల్లో ఏ పదవి వచ్చినా అది కేవలం బాధ్యతగా భావిస్తానని తెలిపారు.

ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన *”గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు”*లో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను, 601 గాంధీ విగ్రహాల ప్రదర్శనను, సాంస్కృతిక కార్యక్రమాలను సందర్శించారు.

అనంతరం మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి, పేదలకు అన్యాయం చేసే అవినీతి వ్యక్తులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, పేదల హక్కులను దోచుకోవడం సహించబోమని స్పష్టంచేశారు. మంచి నాయకులు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని, తన రాజీనామా ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని గుర్తు చేశారు.

తన నియోజకవర్గంలో బెల్ట్ షాపుల సంఖ్య తగ్గించడంలో విజయం సాధించామని, ప్రభుత్వ బడుల ప్రగతికి కృషి చేయడం తన కర్తవ్యం అని తెలిపారు. “ప్రభుత్వ పాఠశాలలు పేదల ఆశాజ్యోతి. వాటి అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటా,” అని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.

Latest News

ఇటికెలకు నీల్లు కొడితే, గోడలు గట్టిగుంటయ్!?|ADUGU TRENDS

ఇల్లు కడితే ఏం శేత్తం? గోడలు కట్టినంక నీల్లు బాగా పడ్తం. కనీ, ఇటికెలకు నీల్లు పట్టినంకనే గోడలు కట్టాల్నట! గట్ల కడితే గా ఇటికెలు గట్టిపడి గోడలు నెర్రెలు బాయయట. గంతే...

శ్రమైక జీవన సౌందర్యం-మే డే!|EDITORIAL

“శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాద్యములు సంరావిస్తూ, వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక...

01-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం వైశాఖ పూర్ణిమ మేడే  తిధి శు పౌర్ణమి రాత్రి 09.15 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం స్వాతి రాత్రి 03.10 వరకు ఉపరి విశాఖ యోగం సిద్ది రాత్రి 08.13 వరకు ఉపరి వ్యతీపాత కరణం భద్ర...

అదిరింది..గీ బొంగులతో పందిరి!?|ADUGU TRENDS

సల్లగుండాలె! సూడ్డానికి మంచిగుండాలె! ఏం శేయాలె? గిట్ల ఆలోసించిన గీ అన్నకు భలే ఐడియా వచ్చింది. గదేందో సూత్తాం పదండ్రి. అసలే ఎండా కాలం.. ఆపైన వానా కాలం. ఇగ తర్వాత సలికాలమే అనుకోండ్లి!...

కవిత్వాన్ని భూమార్గం పట్టించిన మహాకవి!|EDITORIAL

సమాజాన్ని మేల్కొలిపే శక్తి సాహిత్యానికి ఉంది. ఆ శక్తికి రూపం ఇచ్చినవారు కవులు. అలాంటి కవుల్లో అగ్రగణ్యుడు శ్రీరంగం శ్రీనివాసరావు, అంటే “శ్రీశ్రీ”. ఆయన కవిత్వం కేవలం సాహిత్యానికే పరిమితం కాలేదు. అది...

30-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 08.06 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం చిత్త రాత్రి 01.21 వరకు ఉపరి స్వాతి యోగం వజ్ర రాత్రి 08.23 వరకు ఉపరి సిద్ది కరణం గరజి ఉదయం...

భూకంపం పుట్టిస్తున్న భూ సేకరణ!|EDITORIAL

అభివృద్ధి ప్రజల సహకారంతో మాత్రమే సుస్థిరంగా ఉంటుంది. రైతులను భాగస్వాములుగా కాకుండా బాధితులుగా మార్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండవు. అమరావతి వంటి మహత్తర ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే, అక్కడి రైతుల నమ్మకం,...

29-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 07.30 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం హస్త రాత్రి 12.00 వరకు ఉపరి చిత్త యోగం హర్షణ రాత్రి 08.52 వరకు ఉపరి వజ్ర కరణం కౌలవ ఉదయం...

ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్! హార్మూజ్ ని తెరుస్తాం! కానీ,

అమెరికాకు ఇరాన్ రెండు షరతులు అమెరికా-ఇరాన్ చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఇరాన్ కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. హర్మూజ్ జలసంధిని తెరిచి నౌకల రాకపోకలకు అనుమతిస్తామని తెలిపింది. అయితే అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని...

శిన్న శిట్కాతోటి కొవ్వు ఖతం!?|ADUGU TRENDS

ఇగిప్పుడు అందరి బాధా గా పెయ్యిల శెడు కొవ్వే! మనం తినే ఆహారపు అలవాట్లు, బతుకు తెరువులు బాగా మారినయి. జీవన శైలి గూడ మస్తుగ మారింది. ఇగ గిదీంతోటి పెయ్యిల అట్టు...

కొంగ జపం శాంతి తపం!?|EDITORIAL

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిజమేనా? అసలా చర్చలు దౌత్య నాటకమా? నిజమైన పరిష్కార ప్రయత్నమా? మధ్యప్రాచ్యంలోని తాజా ఉద్రిక్తతలను పరిశీలిస్తే ఈ ప్రశ్న తలెత్తక మానది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య...

28-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 07.22 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఉత్తర రాత్రి 11.09 వరకు ఉపరి హస్త యోగం వ్యాఘాత రాత్రి 09.48 వరకు ఉపరి హర్షణ కరణం బవ ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News