కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 31 డిసెంబర్ రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఉచిత క్యాబ్ సర్వీస్ అందించనట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలను నివారించేందుకు ఈ సేవలు అందిస్తున్నామని సంస్థ తెలిపింది. 9177624678 నంబర్‌కి కాల్ చేస్తే, నగర పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ సౌకర్యం ద్వారా ప్రజలు నిబద్ధతతో ప్రయాణం చేయవచ్చని, భద్రతకై తీసుకున్న ఈ చర్యను అసోసియేషన్ స్పష్టం చేసింది.

