Friday, May 1, 2026
29.2 C
Hyderabad

భరత మాత నుదుట “సిందూరం”!

సగం ప్రపంచం నిద్రపోతున్నది. మిగా సగం తమ పనుల్లో నిమగ్నమై ఉంది. నిద్రలో ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో తెలవదు. పనిలో ఉన్న మిగతా ప్రపంచం గుర్తించలేదు. సరిగ్గా పహల్గామ్‌ దాడి జరిగిన 15 రోజులకు అర్ధరాత్రి వేళ – భారత ప్రతీకారాగ్నికి ప్రత్యర్థి పాక్‌ గగన తలం “సింధూర” కాంతులతో ఎరుపెక్కింది. పాక్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లో టెర్రరిస్టులు దాక్కున్న తొమ్మిది కలుగుల్లోకి దూరి భారతీయ విస్ఫోటక అస్త్రాల్రు నేలమట్టం చేశాయి. అర్ధరాత్రి చిమ్మచీకట్లో శత్రుభూమిలో కనీసం కాలు పెట్టకుండా, నిప్పులు కురిపిస్తూ భారత్‌ జరిపిన ఈ దాడి తెల్లారేసరికల్లా తెలిసి, యావత్తు ప్రపంచం ఉలిక్కి పడింది. పాక్ వెన్నులో వణుకే పుట్టింది. ఉన్మాదుల కాల్పుల్లో తమ భర్తల్ని కోల్పోయిన భారత స్త్రీలు- భారత అస్త్రాలు రగిల్చిన సింధూర కాంతుల్న చూసి గర్వంతో ఉప్పొంగే వుంటారు.

చరిత్రాత్మక ఈ భారత ప్రతీకార దాడికి ప్రపంచదేశాలన్నీ దన్నుగా నిలిచాయి. భారత్‌ ను దోషిగా నిలబెట్టాలని చివరి క్షణంలో పాకిస్తాన్‌ భద్రతాసమితిలో చేసిన దింపుడుకల్లం ప్రయత్నం బెడిసికొట్టింది. ఒక్కదేశం కూడా పాక్‌ తో కలిసి రాలేదు. రెండువారాల పాటు అందరి మద్దతు కూడగట్టి, పటిష్టమైన నిఘా, యుద్ధ వ్యూహం పన్ని, నిర్వహించిన ఈ ఆపరేషన్‌కు ఆపరేషన్‌ సింధూర్‌ అని పేరు పెట్టారు. మిగతా కార్యాన్ని మన త్రివిధ దళ సేన అత్యంత పకడ్బందీగా నిర్వహించిన తీరు అభినందనయం. ఈ దాడితో, మతం పేరిట జరిపిన మారణహోమంలో నిష్కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక హిందూ పర్యాటకుల ఆత్మలు శాంతించాయనే భావిద్దాం.

ఇంతటితో ఆగక ఇంకా దుస్సాహసానికి దిగితే సర్వనాశనం తప్పదని అమెరికా చేసిన హెచ్చరికతో కూడిన హితవుకి పాక్ తల ఒగ్గిందా సరే. లేదంటే మళ్ళీ కల్లో కూడా వూహించడానికి భయంతో చచ్చేలా గుణపాఠం చెప్పడానికి భారతీయ సేనలు సరిహద్దుల్లో మోహరించి సిద్ధంగా ఉన్నాయి. మతోన్మాదుల రక్తంతో బాధిత మహిళల నుదుట తిలకం దిద్దిన సైన్యం సాహసానికి వందనం.

మొత్తంగా కొందరు అనుకున్నట్లుగా ఆలస్యం లేకుండానే.. భారత్‌ గర్జించింది. తన సత్తా ఏమిటో లోకానికి చాటింది. మనమేంటో మరోమారు పాక్‌కు రుచి చూపింది. పాక్ పెంచుతున్న ఉగ్రమూకల పుట్టలను పటపటా పగులగొట్టింది. ఉగ్రస్థావరాలు లక్ష్యంగా చేసిన మెరుపుదాడితో పాక్‌ ఉక్కిరిబిక్కిరి అయింది. 9చోట్ల జరిపిన దాడులతో వందకు పైగానే ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. గత పాలకులు దూరదృష్టి లోపం వల్ల పాక్‌తో నిరంతరంగా ఉగ్రవాదాన్ని భారత్ పైకి ఎగదోస్తోంది. నాకేం తెలియదని నంగనాచి కబుర్లు చెబుతోంది. అప్పట్లో జరిగిన యుద్దాల్లో పాక్‌ను దయతలచి వదిలి పెట్టడం జరిగింది. ఏకుమేకు అయినట్లు పాక్‌ పక్కలో బల్లెంగా మారింది. అందుకు భారీ మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాం. ఆనాడే 90వేల మది సైన్యం భారత్‌ చేతికి చిక్కినా.. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ గురించి పట్టుబట్టలేదు. అనేక విషయాలను అలాగే వదిలేశాం. ఇలా చేయడంతో ఇంతకాలం మనం ఎన్నో ఉగ్రదాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోపక్క భారత్‌ను చీల్చుకుని పుట్టుకొచ్చిన పాక్‌, బంగ్లాలు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందాన వ్యవహరిస్తున్నాయి. వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సిన సమయంలో ఇప్పుడు భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుని ‘ఆపరేషన్‌ సింధూర్‌’ను అమలు చేసింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు, పాక్‌ భూభాగంలోని మొత్తం 9 ఉగ్రస్థావరాలపై విరుచుకుపడి దాడులు చేసింది. నిమిషాల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అందరూ నిద్రపోతున్న వేళ..ఎలాంటి అలజడి లేకుండా భారత సైన్యం పని పూర్తి చేసింది. కానీ, ఇది ఇంతటితోనే ఆగుతుందని అనడానికి లేదు. పాక్‌ నుంచి వచ్చే ప్రతిస్పందన ఆధారంగా మన దాడులు మరింతగా ఉండే అవకాశం లేకపోలేదు.

370 ఆర్టికల్‌ రద్దు తర్వాత కశ్మీర్ లో ప్రశాంత వాతావణం ఏర్పడి, పర్యాటకం మళ్లీ పురివిప్పింది. దీనిని చెడగొట్టే లక్ష్యంతో పాక్‌ కుట్రలు పన్నుతోంది. అవకాశం దొరికినప్పుడల్లా కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతోంది. ఉగ్రవాదాన్ని ఉసి గోల్పుతోంది. ఈ వరసలో జరిగిన దాడే పహల్గామ్‌ ఊచకోత. ఈ దాడులను ఇక ఎంతమాత్రం ఉపేక్షించబోమని భారత్ జరిపిన ప్రతిదాడుల హెచ్చరికతో పాక్‌ దారికి రావాలి. లేకుంటే ప్రపంచ పటంలో పాక్‌ ఆనవాళ్లు కూడా ఉండవని గుర్తించాలి.

Latest News

పందేరం సందేశమేనా?|TELANGANA|V.HANUMANTHA RAO|BC

వీహెచ్ కు సలహా పదవి..|V.HANUMANTHA RAO|ADVISOR బీసీలకు సానుకూల సంకేతమా?|BC సీనియర్ల అనుభవానికి గుర్తింపా?|SENIOR LEADERS పార్టీకి, ప్రభుత్వానికి మేలు చేసేనా?|PARTY|GOVERNMENT సీఎం పదవి మరింత పదిలమయ్యేనా?|CM కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు సలహాదారుగా పదవివ్వడం పార్టీలో సీనియార్టీని గౌరవించడమా?...

ఇటికెలకు నీల్లు కొడితే, గోడలు గట్టిగుంటయ్!?|ADUGU TRENDS

ఇల్లు కడితే ఏం శేత్తం? గోడలు కట్టినంక నీల్లు బాగా పడ్తం. కనీ, ఇటికెలకు నీల్లు పట్టినంకనే గోడలు కట్టాల్నట! గట్ల కడితే గా ఇటికెలు గట్టిపడి గోడలు నెర్రెలు బాయయట. గంతే...

శ్రమైక జీవన సౌందర్యం-మే డే!|EDITORIAL

“శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాద్యములు సంరావిస్తూ, వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక...

01-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం వైశాఖ పూర్ణిమ మేడే  తిధి శు పౌర్ణమి రాత్రి 09.15 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం స్వాతి రాత్రి 03.10 వరకు ఉపరి విశాఖ యోగం సిద్ది రాత్రి 08.13 వరకు ఉపరి వ్యతీపాత కరణం భద్ర...

అదిరింది..గీ బొంగులతో పందిరి!?|ADUGU TRENDS

సల్లగుండాలె! సూడ్డానికి మంచిగుండాలె! ఏం శేయాలె? గిట్ల ఆలోసించిన గీ అన్నకు భలే ఐడియా వచ్చింది. గదేందో సూత్తాం పదండ్రి. అసలే ఎండా కాలం.. ఆపైన వానా కాలం. ఇగ తర్వాత సలికాలమే అనుకోండ్లి!...

కవిత్వాన్ని భూమార్గం పట్టించిన మహాకవి!|EDITORIAL

సమాజాన్ని మేల్కొలిపే శక్తి సాహిత్యానికి ఉంది. ఆ శక్తికి రూపం ఇచ్చినవారు కవులు. అలాంటి కవుల్లో అగ్రగణ్యుడు శ్రీరంగం శ్రీనివాసరావు, అంటే “శ్రీశ్రీ”. ఆయన కవిత్వం కేవలం సాహిత్యానికే పరిమితం కాలేదు. అది...

30-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 08.06 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం చిత్త రాత్రి 01.21 వరకు ఉపరి స్వాతి యోగం వజ్ర రాత్రి 08.23 వరకు ఉపరి సిద్ది కరణం గరజి ఉదయం...

భూకంపం పుట్టిస్తున్న భూ సేకరణ!|EDITORIAL

అభివృద్ధి ప్రజల సహకారంతో మాత్రమే సుస్థిరంగా ఉంటుంది. రైతులను భాగస్వాములుగా కాకుండా బాధితులుగా మార్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండవు. అమరావతి వంటి మహత్తర ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే, అక్కడి రైతుల నమ్మకం,...

29-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 07.30 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం హస్త రాత్రి 12.00 వరకు ఉపరి చిత్త యోగం హర్షణ రాత్రి 08.52 వరకు ఉపరి వజ్ర కరణం కౌలవ ఉదయం...

ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్! హార్మూజ్ ని తెరుస్తాం! కానీ,

అమెరికాకు ఇరాన్ రెండు షరతులు అమెరికా-ఇరాన్ చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఇరాన్ కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. హర్మూజ్ జలసంధిని తెరిచి నౌకల రాకపోకలకు అనుమతిస్తామని తెలిపింది. అయితే అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని...

శిన్న శిట్కాతోటి కొవ్వు ఖతం!?|ADUGU TRENDS

ఇగిప్పుడు అందరి బాధా గా పెయ్యిల శెడు కొవ్వే! మనం తినే ఆహారపు అలవాట్లు, బతుకు తెరువులు బాగా మారినయి. జీవన శైలి గూడ మస్తుగ మారింది. ఇగ గిదీంతోటి పెయ్యిల అట్టు...

కొంగ జపం శాంతి తపం!?|EDITORIAL

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిజమేనా? అసలా చర్చలు దౌత్య నాటకమా? నిజమైన పరిష్కార ప్రయత్నమా? మధ్యప్రాచ్యంలోని తాజా ఉద్రిక్తతలను పరిశీలిస్తే ఈ ప్రశ్న తలెత్తక మానది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News