శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు పాల్గుణమాసం కృష్ణపక్షం
తిధి షష్ఠి రాత్రి 10.15 వరకు ఉపరి
సప్తమి
నక్షత్రం అనూరాధ రాత్రి 07.30 వరకు
ఉపరి జ్యేష్ఠ
యోగం వజ్ర పగలు 03.10 వరకు ఉపరి
సిద్ది
కరణం గరజి ఉదయం 09.40 వరకు
ఉపరి భద్ర
వర్జ్యం రాత్రి 02.00 నుండి 03.42
వరకు
దుర్ముహూర్తం ఉదయం 10.00 నుండి
10.48 వరకు తిరిగి పగలు 02.48 నుండి
03.36 వరకు
రాహుకాలం పగలు 01.30 నుండి
03.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.25
సూర్యాస్తమయం సాయంత్రం 06.24
మార్చి 20, 2025 రాశి ఫలాలు
మేషరాశి
ఈ రోజు వృత్తి, వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. సామాజిక పరిధి విస్తరిస్తుంది. దూర ప్రయాణాలు, ఖర్చులు తప్పవు. ఉదర సంబంధ అనారోగ్యాలకు చికిత్స అవసరం.
వృషభరాశి
ఆర్థికపరంగా ఇబ్బందులు ఉండవు. విదేశీ వీసాలు, ఇతర దేశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ధైర్యంతో కార్యసిద్ధి కలుగుతుంది. రక్తపోటు నియంత్రణలో శ్రద్ధ అవసరం.
మిథునరాశి
ఆశయాలను, లక్ష్యాలను గుర్తుంచుకుని, అవరోధాలను అధిగమించి, సహనం, శాంత స్వభావంతో విజయం సాధిస్తారు. వాహన చోదకులు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకరాశి
ఆర్థిక విషయాలలో శ్రద్ధ అవసరం. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఉద్యోగ జీవితంలో సమస్యలు, మానసిక ఒత్తిడి, వాదనలకు దూరంగా ఉండాలి. గుండె, పొట్ట సంబంధిత ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.
సింహరాశి
విలాసాలను అనుభవిస్తారు. కోరికలు నెరవేరుతాయి. సంపద, ఆస్తి కూడబెట్టే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం, మంచి ఆరోగ్యం లభిస్తాయి.
కన్యరాశి
ఆరోగ్యం పట్ల నిరంతర భయం. మార్గావరోధాలను నివారించేందుకు దూర ప్రయాణాలు మానండి. అధికారుల ద్వారా గుర్తింపు లేదా ప్రతిఫలం లభిస్తుంది.
తులరాశి
రావలసిన బాకీలు వసూలు అవుతాయి. సోదర వర్గం వారి అండదండలు ఉంటాయి. ప్రణాళికలతో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం చేస్తారు. పుత్ర సంతాన ప్రాప్తి. కోర్టు విషయాలు అనుకూలం.
వృశ్చికరాశి
న్యాయస్థానాల చుట్టూ తిరగడం, ధన వ్యయం, బంధన యోగం పొంచి ఉంది. తలనొప్పి, కంఠ సంబంధిత అనారోగ్య సూచనలు. సుబ్రహ్మణ్య ఆరాధన, అభిషేకం ఉపశమనాన్ని ఇస్తుంది.
ధనుస్సురాశి
అధికార హోదా పెరుగుతుంది. ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్యం సామాన్యం. గృహంలో శుభకార్యాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వృత్తి పరంగా అనుకూలం.
మకరరాశి
గతం నుండి పేచీలతో సాగుతున్న వైవాహిక బంధాలు ఒక కొలిక్కి వచ్చి విముక్తి పొందుతారు. సహనాన్ని అలవరచుకోవడం మంచిది.
కుంభరాశి
పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. పలుకుబడి, గుర్తింపు పొందుతారు. కుటుంబం, స్నేహితులు మిమ్మల్ని గౌరవిస్తారు. సామాజికంగా ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం అనుకూలం.
మీనరాశి
జీవితం ఉల్లాసంగా ఉంటుంది. సంతృప్తికరమైన ఆదాయం, వృద్ధి పొందుతారు. జీవిత భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది. మానసికంగా దృడంగా వుంటారు.ఈ రోజు క్రొత్త ఆలోచన చేస్తారు.

