సంక్రాంతి పండుగ వేళ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో సోమవారం నుంచి బుధవారం వరకు పొడి వాతావరణం ఉండే సూచనలు ఉన్నాయి. అయితే, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల పడవచ్చని అంచనా. వీటి ప్రభావంతో కొన్నిచోట్ల చల్లని వాతావరణం ఏర్పడే అవకాశముంది. ప్రయాణాలు ప్లాన్ చేసుకునేవారు ఈ సూచనలను దృష్టిలో పెట్టుకోవాలని అధికారులు కోరుతున్నారు.

