జనవరి 1 వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు సందడిగా మారాయి. గడియారంలో 12 గంటలు పూర్తికాగానే ప్రజలు పెద్ద ఎత్తున “హ్యాపీ న్యూ ఇయర్” అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నారు. నృత్యాలు, పాటలతో ఉత్సాహంగా నూతన సంవత్సరం వేడుకలను జరుపుకున్నారు. జమ్మూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు కొత్త ఏడాది ఆరంభాన్ని ఉత్సాహంగా స్వాగతించారు.చాలామంది భక్తులు ఆలయాలను సందర్శించి భగవంతుని ఆశీర్వాదాలను కోరుకుంటున్నారు. దేశంలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. నూతన సంవత్సరం వేడుకలతో దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

