తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలోని కల్యాణ మండపంలో నూతన సంవత్సర వేడుకల పేరుతో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీపై తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరు ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి చెందినవారిగా సమాచారం. ప్రత్యేక పోలీసు బృందం ఈ దాడి నిర్వహించగా, భారీ కలకలం రేగింది. రేవ్ పార్టీ నిర్వహణకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

