అండర్-19 మహిళల ఆసియా కప్‌ను ఇండియా సొంతం చేసుకుంది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను 41 పరుగుల తేడాతో ఓడించి టీమిండియా విజేతగా నిలిచింది. మొదటిసారి నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో భారత్, బంగ్లాదేశ్‌తో తుది పోరుకు దిగింది. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 117 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి బంగ్లాదేశ్ 76 పరుగులకే కుప్పకూలింది.
టీమిండియాకు ప్రారంభంలోే తడబాటు కొంత ఇబ్బంది కల్గింది. ఓపెనర్ కమిలి (5) మరియు వన్ డౌన్ బ్యాటర్ సానికా చల్కే (0) త్వరగా ఔట్ అయ్యారు. అయితే, ఓపెనర్ త్రిష (52) పట్టుదలతో ఆడింది. కెప్టెన్ నికీ ప్రసాద్ (12) మరియు మిథిలా (17) కీలక పాత్రలు పోషించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫర్జానా 4 వికెట్లు సాధించి మంచి ప్రదర్శన కనబరచింది.
చేసిన చిన్న స్కోరును బంగ్లాదేశ్ ఛేదించలేకపోయింది. టీమిండియా బౌలర్లలో ఆయుషి శుక్లా 3 వికెట్లతో కీలక ప్రదర్శన ఇచ్చింది. సిసోడియా, సోనమ్ యాదవ్ చెరో 2 వికెట్లు తీసి భారత్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.

