Thursday, July 30, 2026
23 C
Hyderabad

టీజీఐఐసీ భూముల తాకట్టు అనేది కుట్ర

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీజీఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) పరిధిలో లక్షా 75 వేల ఎకరాల భూములను తాకట్టు పెట్టేందుకు కుట్ర పన్నినట్టు ఆమె ఆరోపించారు. దీనిపై తన వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని ప్రకటించారు. ప్రభుత్వ లక్ష్యం టీజీఐఐసీని ప్రైవేట్ లిమిటెడ్ నుండి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చి వేల కోట్ల అప్పులు తీసుకోవడమేనని ఆమె మండిపడ్డారు. దీనికోసం ప్రభుత్వం ఓ రహస్య జీవోను విడుదల చేసిందని, ఇది ప్రజలకు తెలిపకుండా దాచిపెట్టిన తంతు అన్నారు.

తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజ్‌లో తాకట్టు పెట్టి పెట్టుబడులు సమకూర్చే కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరమని, పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చేందుకు టీజీఐఐసీ మార్గంగా ఉపయోగిస్తున్నారని విమర్శించారు. టీజీఐఐసీ హోదా మార్పును ప్రజలకు ముందుగా వెల్లడించకపోవడం అనైతికమని, ఈ చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గత 16 నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.1.8 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకుందన్న కవిత, అయితే ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. తెచ్చిన అప్పులతో అభివృద్ధికి ఉపయోగించకుండా, కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారని ఆరోపించారు. గతంలో తీసుకున్న అప్పుల్లో కేవలం రూ.80 వేల కోట్లు మాత్రమే తిరిగి చెల్లించారని, మిగిలిన లక్ష కోట్లు ఎక్కడకు వెళ్లాయో చెప్పాలన్నారు.

ఈ మొత్తాన్ని ప్రభుత్వ పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించిందని, ఇందులో రూ.20 వేల కోట్లు సీఎం రేవంత్ రెడ్డి ఖజానాకు చేరాయని కవిత ఆరోపించారు. 20 శాతం కమీషన్ సర్కార్‌గా విమర్శిస్తూ, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి నేరుగా వాటి నుంచి కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. ఇది కేవలం ఆరోపణలు కాదు, తాను ఆధారాలతో మాట్లాడుతున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ విషయమై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

అంతేగాక, కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చిన విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. చెట్లను నరికించి, ప్రకృతిని నాశనం చేసే ఈ చర్యలపై దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేశారు.

ఇక మరోవైపు, మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ కవిత తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. “నేను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నాను. ఇప్పటివరకు 47 నియోజకవర్గాల్లో పర్యటించాను. అక్కడి ప్రజాభిప్రాయాల ఆధారంగా నేను సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించాను” అని చెప్పారు. ప్రజల్లో పార్టీపై నమ్మకం రోజురోజుకూ పెరుగుతోందని, ఈ సమయంలో నాపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. కొందరు పనిగట్టుకుని తానుపై దుష్ప్రచారం చేస్తూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

“ఆరు నెలలు జైల్లో ఉన్నా సరిపోదా? ఇంకా నన్ను కష్టపెడతారా? నన్ను రెచ్చగొడితే గట్టిగా స్పందించాల్సి వస్తుంది. నాపై జరుగుతున్న దుష్ప్రచారం విషయమై పార్టీ స్పందిస్తుందని నమ్మకంగా ఉన్నాను” అని వ్యాఖ్యానించారు. కాలం వచ్చినప్పుడు నిజాలన్నీ బయటపెడతానని హెచ్చరించారు.

మొత్తంగా, టీజీఐఐసీ వ్యవహారంలో భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్టు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా కొత్త చర్చకు తావిచ్చారు.

Latest News

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News