వక్ఫ్ ఆస్తుల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ లేదా వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీ నోటిఫై చేయవద్దని, అలాగే ఈ ఆస్తులపై ఎలాంటి మార్పులు చేయవద్దని ఆదేశించింది. వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. పిటిషనర్ లు లేవనెత్తిన అంశాలకు సంబంధించి వారం రోజుల్లో కేంద్రం తగిన జవాబు దాఖలు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఈ ఉత్తర్వులు కీలకంగా మారనున్నాయని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

