Wednesday, July 29, 2026
23.1 C
Hyderabad

సోమనాథుడు అసామాన్య కవి, తెలంగాణ ఆదికవి, విశ్వకవి

ఆనాడే ప్రజల భాషకు కావ్య గౌరవం కల్పించిన సవ్యసాచి

సోమనాథుడి కవిత్వ వారసత్వాన్ని భావి తరాలకు అందించాలి

ఇదీ స్థానికుల మనోభావం… అతిథుల ఆశాభావం

పాలకుర్తిలో ఘనంగా సోమనాథుడి 786వ దీపారాధన

సోమనాథుడు అన్నింటా ఆరితేరిన అసామాన్యుడు. తెలంగాణ ఆదికవి. తెలుగు భాషలో తొలి స్వతంత్ర కవి. ఆయనకు ముందు అందరూ అనువాద కవులే. సోమనాథుడు అష్ట భాషా కోవిదుడు. ప్రతిభా శాలి, ప్రయోగ శీలి. ప్రగల్బ ప్రదర్శన లేని వాడు. జాను తెలుగులో వ్రాసి ప్రజల భాషకు కావ్య గౌరవం కల్పించాడు. భాష, భావం, వస్తువు, ఇతివృత్తం, పాత్రలు, ఛందస్సు, ప్రక్రియ, ప్రస్తుతి అన్ని అంశాల్లోనూ కవిత్వాన్ని, సమాజాన్ని సవ్య, నవ్య మార్గంలో నడిచి విప్లవం తెచ్చిన విశ్వకవి. ఆయన కవిత్వ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని పాలకుర్తి ప్రాంతం నుండి అనేకమంది కవులు, రచయితలు, కళాకారులు ఉద్భవించారు. అయితే ఇప్పుడు సోమనాథుడి కవిత్వ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రస్తుత ప్రపంచానికి విస్తృతంగా అందించాల్సిన అవసరం ఉంది. అని పలువురు వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు ఆది కవి పాల్కురికి సోమనాథుడి లింగైక్య దినం సందర్భంగా సోమనాథుడి 786 వ దీపారాధన కార్యక్రమం, పాలకుర్తి సోమనాథ స్మృతి వనంలో సోమనాథ కళాపీఠం, శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ పూజారుల మంత్రోచ్ఛారణల మధ్య సోమనాథుడి విగ్రహానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి, ఘనంగా నిర్వహించారు.

అనంతరం పీఠం అధ్యక్షులు డా. రాపోలు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో
హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాలకుర్తి కవులకు, కళాకారులకు, రచయితలకు పుట్టినిల్లు అన్నారు. తెలుగు ఆది కవి పాల్కురికి సోమనాథుడు జన్మించిన నేలలో మనం పుట్టడం మన అదృష్టం అన్నారు. ఇంత చారిత్రాత్మక నేలను అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి అందరితో కలిసి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న సోమనాథ కళా పీఠం కార్యవర్గాన్ని అభినందించారు.

ప్రధాన వక్త శ్రీలేఖ సాహితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ టి శ్రీరంగ స్వామి మాట్లాడుతూ… సోమనాథుడి కవిత్వ వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. సోమనాథుడి రచనలను ప్రచురించి ప్రచారం చేయడమే కాక, ఆయన ఆయన కవిత్వ విశిష్టతలపై మరిన్ని రచనలు గావించి వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యతను పీఠం కవులు రచయితలు తీసుకోవాలన్నారు.

ప్రముఖ సాహితీవేత్త మారేడుకొండ బ్రహ్మచారి (నిధి) మాట్లాడుతూ… ఆనాడే సమాజాన్ని విశ్లేషించి సమ సమాజ స్థాపన కోసం తన శక్తి యుక్తులను రచన వ్యాసంగాన్ని విశిష్టంగా విశేషంగా ధారపోసిన పాలకుర్తి సోమనాథుడు పుట్టిన ఈ నేల, ఈ ప్రాంతం ఎన్నో పుణ్యాలు చేసుకున్నదన్నారు. నిబద్ధత నిమగ్నత కలిగిన ఆదర్శవంతుడు సోమనాథుడని అన్నారు.

డాక్టర్ బేతి రమేష్ మాట్లాడుతూ జనగామ జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో సోమనాథుడి చిత్ర పటాలు వేసి విద్యార్థులకు సోమనాథుడి సాహిత్యాన్ని తెలియజేయాలని అన్నారు.

డా.రాపోలు సత్యనారాయణ మాట్లాడుతూ, కన్నడ నేలపై ప్రభవించి సమ సమాజం, సామ్యవాదం సాధనకు వీర శైవంను ఒక పరికరంగా స్వీకరించి ప్రజలను మేలు కొలిపిన మహనీయుడు బసవేశ్వరుడు. బసవేశ్వరుని భక్తి తత్వాన్ని తెలుగు దేశాన తెలియ చెప్పిన వాడు మల్లికార్జున పండితారాధ్యుడు. ఈ ఇరువురి దివ్య చరితలను వారి బలగమైన శివ శరణుల కథలను తనివి తీరా వ్రాసి, తన ఇలు వేలుపు పాలకురికి సోమేశునిపై సోమనాథ స్తవం వ్రాసి, ద్విపదకు పద్య పదవిని ఇచ్చి, లక్షణ యుక్తంగా తొలి శతకాన్ని కూర్చిన శతక కారుడు. గద్యలతో, రగడలతో ఊర్రూత లూగించిండు. అలతి ద్విపదలు, అలుకటి మాటలే కాదు, అరుదైన ఛందస్సులు, అబ్బుర పరిచే అక్షర విన్యాసాలు చూపించిండు. తన కాలపు సమాజాన్ని, సంస్కృతిని, కళలను, ప్రకృతిని, విజ్ఞానాన్ని, ఆనాటి సమస్తాన్ని తన కవిత్వంలో ఆవిష్కరించిండు. అంతటి మహత్తరమైన కవి మరొకరు లేరు. సోమనాథుడు తెలంగాణలో పుట్టినా, ప్రాంతానికి పరిమితం చేయలేని విశ్వ కవి అని అభిభాషించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి సోమనాథుడు పేరు పెట్టాలి. గతంలో దీనిమీద సోమనాథ కళాపీఠం తీవ్ర కృషి చేసింది. ఏకోన్ముఖంగా ప్రముఖ కవులందరూ ఇదే విషయాన్ని సమర్థిస్తూ వ్యాసాలు రాశారని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో డా. మార్గం లక్ష్మీనారాయణ, ఇమ్మడి దామోదర్, డివిఆర్ శర్మ, దేవగిరి రామన్న, దేవగిరి లక్ష్మన్న, దేవగిరి అనిల్, గూడూరు లెనిన్, పులి గణేష్, సుదర్శన్ కూరపాటి, రాపాక సత్యనారాయణ,
చీదర జగదీష్, మార్గం సాయి సందీప్ తేజ, సమ్మయ్య, ఆలయ సిబ్బంది సూపరింటెండెంట్ వెంకటయ్య, నిరంజన్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News