తెలంగాణా లో ఎమ్మెల్యే కోటాలో గల ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ నేటి నుంచి ఈనెల 10 వరకు కొనసాగుతుంది. ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన, 13 న ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 20 తేది న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు లెక్కింపు జరుగుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది.

