తెలంగాణ రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బీ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులు, నిర్మాణాలు గురించి సమీక్షించారు. ముఖ్యంగా అటవీ అనుమతులు ఇంకా పొందని ప్రాజెక్టులు, అత్యవసర రహదారుల నిర్మాణంపై మంత్రి దృష్టి సారించారు. ప్రాజెక్టుల వేగాన్ని పెంచాలని, నాణ్యమైన రోడ్లు నిర్మించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

