రాష్ట్రంలోని SC, ST, BC, మరియు జనరల్ కేటగిరీలకు సంబంధించిన గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET) – 2025 పోస్టర్‌ను స్థానిక ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ముఖ్యంగా సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలను సమాన అవకాశాల ద్వారా కల్పించడం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులు నాణ్యమైన విద్య మరియు సంపూర్ణ విద్యా మద్దతు పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్య అధికారులు, ఉపాధ్యాయులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

