గత పది రోజులుగా కొనసాగుతున్న వెలిమల భూ వివాదం రోజుకొక్క మలుపు తిరుగుతుంది. తమకు న్యాయం చేయాలంటూ గిరిజనులు ఆందోళనలు నిర్వహిస్తున్న లెక్కచెయ్యకుండా ఒక వైపు బిల్లా దాకాల మిగులు భూముల్లో పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. గిరిజనుల ఆందోళన కు మద్దతుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు రంగంలోకి దిగారు. గిరిజనులకు బీజేపీ అండగా నిలుస్తుందని గురువారం పార్టీ కార్యాలయంలో ప్రకటించిన రఘునందన్ పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం ఉదయం వెలిమల తండాకు చేరుకున్నారు. గిరిజనులతో కలిసి ర్యాలీగా వెలిమల తండా నుంచి సదరు భూముల వద్దకు చేరుకుని గిరిజనులతో కలిసి బైఠాయించారు.
ఎనబై ఏండ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను అప్పనంగా రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థలకు కట్టబెట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ భూ కేటాయింపు రద్దు చేసి గిరిజనులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వచ్చి న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బీష్మించుకుర్చున్నారు. ఎంపీ రఘునందన్ రాకతో వెలిమల ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళన కార్యక్రమం కొనసాగుతోంది.
గిరిజనుల ఆందోళనకు మద్దతుగా రంగంలోకి ఎంపీ రఘునందన్

