Saturday, June 13, 2026
27.3 C
Hyderabad

పుస్తక పఠనం ద్వారా జీవన మార్గం

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన 35వ పుస్తక మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి కృష్ణారావు రాసిన పీవీ నరసింహారావు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పుస్తక పఠనంపై తన అనుభవాలను, అభిప్రాయాలను గురించి చెప్పారు.

తన వ్యక్తిత్వాన్ని, ధైర్యాన్ని పుస్తకాలు రూపుదిద్దాయని పవన్ కల్యాణ్ చెప్పారు. ఐదో తరగతి నుంచే పుస్తక పఠనం అలవాటు వుందని, తన తల్లిదండ్రులే ఈ ప్రేరణ ఇచ్చారని గుర్తుచేశారు. కొత్త పుస్తకాలు చదవడం తనకు ఒక మక్కువగా మారిందని, వాటి సువాసన తనను ఎంతో ఆకర్షిస్తుందని తెలిపారు. తన విద్యా జీవితం ఇంటర్మీడియేట్ వద్దనే ఆగిపోయినా, పుస్తక పఠనాన్ని ఎప్పటికీ మానలేదన్నారు. ‘‘పుస్తకాలు నా మానసిక శక్తిని బలంగా నిలబెట్టాయి’’ అని ఉద్ఘాటించారు.

పవన్ కల్యాణ్ సాహిత్యాన్నీ, కవిత్వాన్నీ ఎంతో ప్రేరణాత్మకంగా చూశాను అన్నారు. విశ్వనాథ సత్యనారాయణ రచనలు, గుర్రం జాషువా కవిత్వం, గోపీచంద్ రచనలు తనపై అపార ప్రభావం చూపాయని చెప్పారు. ‘‘అమృతం కురిసిన రాత్రి’’ మొదటగా కొనుగోలు చేసిన పుస్తకం అని, అప్పటి నుంచి తన పుస్తకాల పట్ల ఆసక్తి పెరిగిందని వివరించారు.

తెలుగు భాష, సాహిత్యంపై గౌరవం వుందని చెప్తూ విద్యార్థులు తమ మాతృభాషపై పట్టు సాధించాలన్నారు. ‘‘ఇంగ్లీషు తప్పనిసరి అయినా, సృజనాత్మకత మాతృభాష ద్వారానే వస్తుంది’’ అని పేర్కొన్నారు. తెలుగులో వ్యాకరణంపై దృష్టి పెట్టడం ఎంతైనా అవసరమని సూచించారు. రచయితలు, కవుల కృషిని అర్థం చేసుకుంటే వారి పట్ల గౌరవం పెరుగుతుందని ఆయన అన్నారు.

పుస్తక ప్రదర్శనకు మున్సిపల్ స్టేడియం ఇవ్వడం లేదని తెలిసిన వెంటనే సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించారు. ‘‘పుస్తకాలు మన మెదడుకు శిక్షణ ఇస్తాయి’’ అని అన్నారు. పుస్తక ప్రదర్శనలు, గ్రంథాలయాల స్థాపన ఉద్యమంగా మారాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. పుస్తక రచయితల ఇళ్లను టూరిజంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం వుందన్నారు. ‘‘మన దేశంలో రచయితలకు, కవులకు ప్రత్యేక గుర్తింపు రావాలి’’ అని పేర్కొంటూ, సాహిత్యానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News