2024లో 2.34 లక్షల కేసులు, 20 టన్నుల గంజాయి సీజ్
తెలంగాణలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ జితేందర్ తెలిపారు. 2024లో మొత్తం 2,34,158 కేసులు నమోదు కాగా, రాష్ట్రాన్ని జీరో డ్రగ్స్ స్టేట్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ ఏడాది 20 టన్నుల గంజాయి సీజ్ చేయగా, దాని విలువ రూ. 142 కోట్లుగా ఉంది. డ్రగ్స్ కేసుల్లో 48 నిందితులకు శిక్షలు ఖరారయ్యాయని వివరించారు. సైబర్ నేరాలు పెరిగినప్పటికీ రూ. 2.42 కోట్ల నగదును నేరగాళ్ల నుంచి రికవర్ చేసినట్లు తెలిపారు. గత ఏడాదిలో జరిగిన ప్రధాన ఘటనల వివరాలు వెల్లడించిన డీజీపీ, రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

