Saturday, May 2, 2026
35.2 C
Hyderabad

ఆపరేషన్ సింధూర్!

పాక్ స్థావరాలపై భారత్‌ మెరుపు దాడులు!
పాక్ లో దాడులు 1971 తర్వాత ఇదే తొలిసారి
పాక్ ప్రతి స్పందనపై సర్వత్రా ఆసక్తి
భారత భద్రతాదళాలను అభినందిస్తూ పలువురి ట్వీట్లు

అంతా అనుకున్నట్లే అయింది. టెర్రరిజంపై యుద్ధం మొదలైంది. తూరుపు సింధూరపు కిరణాలు పాక్ భూభాగంపై పడక ముందే ‘ఆపరేషన్ సింధూర్!’ మొదలైంది. తెలతెల వారుతుండగానే భారత్ భద్రతాదళాలు పాక్ లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. మెరుపు దాడులు చేశాయి. 9 స్థావరాలను ఉగ్రమూకల నుండి విముక్తి చేశాయి. ఈ దాడులు పాక్ ను గడగడలాడించాయి. ఈ ఆపరేషన్‌ ద్వారా భారత్‌ దేశ సమగ్రతను, పౌరుల భద్రతను కాపాడటానికి సిద్ధంగా ఉన్నదని ప్రపంచానికి చాటి చెప్పినట్లైంది. పాక్ లో దాడులు 1971 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే లేస్తే మనిషిని కాదంటున్న పాక్ ప్రతి స్పందన ఏ విధంగా ఉండనుందన్నదే ఆసక్తిగా మారింది. అయితే భారత భద్రతా దళాల చర్యలను అభినందిస్తూ రాష్ట్రపతి, ప్రధాని తదితరులు ట్వీట్లు చేశారు.

జమ్మూకశ్మీర్‌లో రుధిర క్రీడకు తెగబడి పాకిస్తాన్‌లో దాక్కున్న ఉగ్రమూకలకు భారత్‌ గట్టిగానే బుద్ధి చెప్పింది. పాక్ బంకర్ల కలుగుల్లో దాక్కున్న ఉగ్ర ఎలకలను ఏకోన్ముఖంగా మూకుమ్మడిగా తగలబెట్టేసింది. 9 కీలక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో చేపట్టిన ఈ దాడులు పాక్ ను గడగడలాడించాయి. ఈ ఆపరేషన్‌ ద్వారా భారత్‌ సాయుధ దళాలు సమష్టిగా దేశం సమగ్రతను, పౌరుల భద్రతను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ కోడ్‌ నేమ్‌ పెట్టారు. ‘ఆపరేషన్‌ సింధూర్‌’ అనేది కేవలం యాథృచ్చికంగా పెట్టింది కాదు. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిగా భారత్‌ దేశంలో ఉన్న మహిళలకు భరోసాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

పాక్ నుంచి విముక్తి పొందిన 9 స్థావరాలు
పాకిస్తాన్ సహా, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత దళాలు విముక్తి చేశాయి. వాటిలో 1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ – జేఎం, 2. మర్కజ్ తైబా, మురిద్కే – ఎల్ఇటి, 3. సర్జల్, తెహ్రా కలాన్ – జెఎం, 4. మెహమూనా జోయా, సియాల్‌కోట్ – హెచ్ఎం, 5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా – ఎల్ఇటి, 6. మర్కజ్ అబ్బాస్, కోట్లి – జెఇఎం, 7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి – హెచ్ఎం, 8. షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ – ఎల్ఇటి, 9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ – జే

భారత రక్షణ శాఖ విడుదల చేసిన లేఖ సారాంశం ‘కొద్దిసేపటి క్రితం, భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించాయి, భారతదేశంపై ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేసిన పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ, కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. తొమ్మిది స్థావరాలలు లక్ష్యంగా దాడులు జరగాయి. కానీ, పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. కేవలం ఉగ్రవాదుల స్థావరాలపై మాత్రమే దాడులు చేశాం. నిర్ణీత లక్ష్యాన్ని గురి చూసి కొట్టాం. లక్ష్య అమలు పద్ధతిలోనూ భారతదేశం గణనీయమైన సంయమనాన్ని ప్రదర్శించింది. 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడిని హత్య చేసిన అనాగరిక, పాశవిక పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ చర్యలు జరిగాయి. ఈ దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచాలనే నిబద్ధతకు మేము కట్టుబడి ఉన్నాం. కాగా, ఈ రోజు ఉదయం 10 గంటలకు ‘ఆపరేషన్ సింధూర్’ గురించి వివరణాత్మక బ్రీఫింగ్ ఉంటుంది.’ అని అందులో తెలిపింది.

భారత్, పాక్ ల అలెర్ట్
ఇదిలావుండగా, యుద్ధం నేపథ్యంలో పాక్ అప్రమత్తమైంది. లాహోర్‌, సియాల్‌కోట ఎయిర్‌పోర్ట్‌లు మూసివేసింది. ఇస్లామాబాద్‌, రావల్పిండిలో మెడికల్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. పంజాబ్‌లో విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు భారత దేశంలోని ధర్మశాల, లే, జమ్మూ, శ్రీనగర్‌, అమృతసర్‌తో సహా కీలక విమానాశ్రయాల్లో విమానల రాకపోకలు రద్దు చేసింది. 9 నగరాలకు విమానాల రాకపోకలను ఎయిరిండియా రద్దు చేసింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమానాలు రద్దు అయ్యాయి.

భారత్ దాడులను తిప్పి కొడతామని బీరాలు పలుకుతూ, బింకాలు పోతున్న పాక్ సమాధానం ఏ విధంగా ఉండనుంది? అన్నదే ఆసక్తిగా మారింది.

Latest News

శెదలు పట్టకుండ శేసే శిట్కా!?|ADUGU TRENDS

కొత్తగ ఇల్లు కడతం. ఏడాది తిరక్కముందే గా ఇంటికి శెదలు పడతది. బూజులొత్తయి. బండల కింద పొక్కలు పడతయి. శీమెలు, ఎల్కలు సొత్తయి. ఇగ ఇల్లంత ఆగమాగం. ఇగ ఆయింత రెండు మూడు...

రాజకీయాలకతీతంగా ఆర్థిక క్రమశిక్షణ!|EDITORIAL

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ సంక్లిష్టంగా, సంక్షోభంగా మారుతోంది. అప్పులు ఎలా తీర్చాలి? అన్న ఆలోచన, ప్రభుత్వాలకు పాలకులకు ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా విధానాల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు....

02-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 10.45 వరకు ఉపరి విదియ నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 05.23 వరకు ఉపరి అనూరాధ యోగం వ్యతీపాత రాత్రి 08.24 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ...

పందేరం సందేశమేనా?|TELANGANA|V.HANUMANTHA RAO|BC

వీహెచ్ కు సలహా పదవి..|V.HANUMANTHA RAO|ADVISOR బీసీలకు సానుకూల సంకేతమా?|BC సీనియర్ల అనుభవానికి గుర్తింపా?|SENIOR LEADERS పార్టీకి, ప్రభుత్వానికి మేలు చేసేనా?|PARTY|GOVERNMENT సీఎం పదవి మరింత పదిలమయ్యేనా?|CM కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు సలహాదారుగా పదవివ్వడం పార్టీలో సీనియార్టీని గౌరవించడమా?...

ఇటికెలకు నీల్లు కొడితే, గోడలు గట్టిగుంటయ్!?|ADUGU TRENDS

ఇల్లు కడితే ఏం శేత్తం? గోడలు కట్టినంక నీల్లు బాగా పడ్తం. కనీ, ఇటికెలకు నీల్లు పట్టినంకనే గోడలు కట్టాల్నట! గట్ల కడితే గా ఇటికెలు గట్టిపడి గోడలు నెర్రెలు బాయయట. గంతే...

శ్రమైక జీవన సౌందర్యం-మే డే!|EDITORIAL

“శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాద్యములు సంరావిస్తూ, వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక...

01-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం వైశాఖ పూర్ణిమ మేడే  తిధి శు పౌర్ణమి రాత్రి 09.15 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం స్వాతి రాత్రి 03.10 వరకు ఉపరి విశాఖ యోగం సిద్ది రాత్రి 08.13 వరకు ఉపరి వ్యతీపాత కరణం భద్ర...

అదిరింది..గీ బొంగులతో పందిరి!?|ADUGU TRENDS

సల్లగుండాలె! సూడ్డానికి మంచిగుండాలె! ఏం శేయాలె? గిట్ల ఆలోసించిన గీ అన్నకు భలే ఐడియా వచ్చింది. గదేందో సూత్తాం పదండ్రి. అసలే ఎండా కాలం.. ఆపైన వానా కాలం. ఇగ తర్వాత సలికాలమే అనుకోండ్లి!...

కవిత్వాన్ని భూమార్గం పట్టించిన మహాకవి!|EDITORIAL

సమాజాన్ని మేల్కొలిపే శక్తి సాహిత్యానికి ఉంది. ఆ శక్తికి రూపం ఇచ్చినవారు కవులు. అలాంటి కవుల్లో అగ్రగణ్యుడు శ్రీరంగం శ్రీనివాసరావు, అంటే “శ్రీశ్రీ”. ఆయన కవిత్వం కేవలం సాహిత్యానికే పరిమితం కాలేదు. అది...

30-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 08.06 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం చిత్త రాత్రి 01.21 వరకు ఉపరి స్వాతి యోగం వజ్ర రాత్రి 08.23 వరకు ఉపరి సిద్ది కరణం గరజి ఉదయం...

భూకంపం పుట్టిస్తున్న భూ సేకరణ!|EDITORIAL

అభివృద్ధి ప్రజల సహకారంతో మాత్రమే సుస్థిరంగా ఉంటుంది. రైతులను భాగస్వాములుగా కాకుండా బాధితులుగా మార్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండవు. అమరావతి వంటి మహత్తర ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే, అక్కడి రైతుల నమ్మకం,...

29-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 07.30 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం హస్త రాత్రి 12.00 వరకు ఉపరి చిత్త యోగం హర్షణ రాత్రి 08.52 వరకు ఉపరి వజ్ర కరణం కౌలవ ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News